# new-academic-schedule-fromjuly-13th-education-department-released-ap

- Link: https://amaravathiteacher.com/new-academic-schedule-fromjuly-13th-education-department-released-ap/
- Published: 2020-07-11T10:57:55+05:30
- Author: amaravathiteacher

## **new-academic-schedule-fromjuly-13th-education-department-released-ap**

### **మాస్టార్లూ… రోజూ రానక్కర లేదు!**

### **13వ తేదీ నుంచి కొత్త షెడ్యూల్‌ విడుదల చేసిన విద్యాశాఖ**

### **టీచర్ల హాజరుకు మార్గదర్శకాల జారీ**

### **యథావిధిగానే బ్రిడ్జి కోర్సుల నిర్వహణ**

### **ఈనెల 13 నుంచి అమల్లోకి.. ఆ రోజుల్లో బయోమెట్రిక్ తప్పనిసరి**

### **రాష్ట్రంలో ఈ నెల 13 నుంచి విద్యాశాఖ కొత్త మార్గదర్శకాల ప్రకారం ఉపాధ్యాయులు ప్రతిరోజు పాఠశాలలకు హాజరు కావాల్సిన అవసరం లేదు.\***

### ** \*️ప్రాథమిక పాఠశాలల్లో ప్రతి మంగళవారం, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో ప్రతి సోమ, గురువారం హాజరుకావాల్సి ఉంటుంది. **

### **ఆ రోజుల్లో బయోమెట్రిక్ మాత్రం తప్పనిసరి.**

### **కరోనా విస్తృతి కారణంగా ఉపాధ్యాయులు రోజూ బడులకు హాజరుకానక్కర లేదని రాష్ట్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. **

### **ఇప్పటికే పాఠశాలల పునఃప్రారంభంపై సందిగ్ధత నెలకొన్న సంగతి తెలిసిందే.**

### ** ఈ తరుణంలో విద్యాశాఖ ఈ నెలాఖరు వరకు ఉపాధ్యాయుల హాజరు షెడ్యూల్‌ను ప్రకటించింది. **

### **10వ తేదీలోగా పాఠశాలల సమగ్ర నివేదిక యూ–డైస్‌లో పొందు పరిచాక 13వ తేదీ నుంచి వారంలో కొన్ని రోజులు మాత్రమే ఉపాధ్యాయులు బడులకు హాజరుకావాలని సూచించింది. **

### **మరోవైపు బ్రిడ్జికోర్సుల ద్వారా విద్యార్థులకు పాఠ్యాంశాల బోధనకు కసరత్తు యధావిధిగా కొనసాగుతుంది.**

### **కంటైన్మెంట్‌ జోన్లు పెరగడం వల్లే…**

### **వీరంతా కచ్చితంగా పాఠశాలలకు హాజరై యూడైస్‌నమోదు పూర్తి చేయాలని విద్యాశాఖ ఆదేశించిన సంగతి తెలిసిందే. **

### **దీంతో ఉపాధ్యాయులు సైతం రోజూ బడులకు వెళ్లి బయోమెట్రిక్‌ వేసుకుని రికార్డుల నిర్వహణ చేపడుతున్నారు. **

### ** కరోనా వ్యాప్తి, రవాణా సమస్యలను దృష్టిలో ఉంచుకొని విద్యాశాఖ నూతన మార్గదర్శకాలను విడుదల చేసింది. **

### **ఈ నెల పదిలోగా యూ–డైస్‌ పోర్టర్‌లో వివరాల నమోదు పూర్తి చేసుకోవాలి. **

### **13వ తేదీ నుంచి రోజూ స్కూళ్లకి వెళ్లనక్కర లేకుండా కొత్త షెడ్యూల్‌ విడుదలైంది.**

### _**󠀁[TEACHERS TRANSFERS & RATIONALISATION NORMS DETAILS](https://amaravathiteacher.com/teachers-transfers-rationalisation-july-2020/)󠁿**_

### **󠀁[HOW TO CHECK YOUR DISTRICT ALL SCHOOLS ENTROLLMENT DETAILS](https://amaravathiteacher.com/ap-teachers-transfers-rationalization-how-to-know-mandal-wise-schools-enrollment/)󠁿**

### **13 నుంచి పరిమిత రోజుల్లోనే డ్యూటీ…**

### **పూర్తి స్థాయిలో పాఠశాలలు పునఃప్రారంభించే వరకు వారంలో కొన్ని రోజులు మాత్రమే టీచర్లు హాజరు కావాలని ఆ మేరకు షెడ్యూల్‌ను విద్యాశాఖ విడుదల చేసింది. **

### ** ప్రాధమిక పాఠశాలల ఉపాధ్యాయులు వారంలో ఒక రోజు (మంగళవారం), **

### **ప్రాధమికోన్నత, ఉన్నత పాఠశాలలకు వారంలో రెండు రోజులు (సోమ, గురువారం) హాజరు కావాలని పేర్కొంది. **

### **జిల్లాలో ‘మనబడి నాడు నేడు’ పనులకు ఎంపికైన స్కూళ్ల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ఎప్పటిమాదిరిగానే రోజూ హాజరై నిర్దేశించిన సమయంలో పనులు పూర్తి చేయాలని సూచించింది. **

### **యధావిధిగా బ్రిడ్జి కోర్సుల బోధన  **

### **కరోనా వైరస్‌ వ్యాప్తి తగ్గకపోవడంతో పాఠశాలలను తెరిచే అవకాశం కనిపించడం లేదు. **

### **దీన్ని దృష్టిలో పెట్టుకొని విద్యార్థులకు బ్రిడ్జి కోర్సుల ద్వారా పాఠ్యాంశాలను బోధించేలా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. **

### **సాధారణ పరిస్థితులు నెలకొంటే ఆగస్టు 3వ తేదీ నుంచి పూర్తి స్థాయిలో తెరిచేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. **

### **ఆ తరువా త సవరించిన సిలబస్‌ ప్రకారం పండుగ సెలవులను తగ్గించి పాఠ్యాంశాలు బోధించాలని ప్రభుత్వం భావిస్తోంది. **

### **ఇప్పటికే దూరదర్శన్, ఎఫ్‌ఎం రేడియో, యూట్యూబ్‌ ఆధారంగా పాఠాలను విద్యాశాఖ బోధిస్తోంది. **

### **విద్యాపరంగా నిమగ్నం చేసేందుకు బ్రిడ్జ్‌కోర్సులు చేపడుతోంది. **

### **నిబంధనల మేరకు హాజరవ్వాలి **

### **పాఠశాల విద్యాశాఖ అదేశాల మేరకు జిల్లాలో ప్రభుత్వ పాఠశాలకు ఉపాధ్యాయులందరూ నిబంధనలమేరకు విధిగా హాజరుకావాలి. **

### **ఈ నెల 13 నుంచి హాజరు షెడ్యూల్‌ మారింది. **

### **ఆ మేరకు పాఠశాలలకు హాజరైతే సరిపోతుంది. **

### **అలా హాజరు కాని ఉపాధ్యాయులపై చర్యలు తీసుకుంటాం. **

### **విద్యార్థులు పాల్గొంటున్న బ్రిడ్జి కోర్సుల్లో సందేహాలు ఉంటే నివృత్తి చేయాలి.**

### **󠀁[1ST CLASS TO 10TH CLASS DD SAPTHAGIRI LESSONS SCHEDULE FROM JULY 13TH](https://amaravathiteacher.com/revised-schedule-video-lessons-through-doordarshan-saptagiri-channel/)󠁿**

### **󠀁[CONTAINMENT & RED ZONE TEACHERS NECESSARY ALL APPLICATIONS ](https://amaravathiteacher.com/ap-teachers-not-attend-to-duty-quarantine-containment-red-zones/)󠁿**

### 󠀁[AP TEACHERS LATEST NEWS](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)󠁿

 *  [ NEW SA1 Science Question Papers 2026 ](https://amaravathiteacher.com/sa1-science-question-papers-2026/)
 *  [ SA1 EVS Key Papers 2026 PDF Download – 3rd to 5th Class ](https://amaravathiteacher.com/sa1-evs-key-papers-2026/)
 *  [ SA1 Maths Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-maths-key-papers-2026/)
 *  [ APPSC Group 2 Notification 2026 – 720 Vacancies, Post-wise Qualifications, Age, Fee, Dates & Syllabus Apply Online ](https://amaravathiteacher.com/appsc-group-2-notification-2026-720-vacancies-apply-online/)
 *  [ SA1 Hindi Key Papers 2026 PDF Download – 6th to 10th Class ](https://amaravathiteacher.com/sa1-hindi-key-papers-2026/)
 *  [ SA1 English Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-english-key-papers-2026/)
 *  [ SA1 Key Paper 2026 ](https://amaravathiteacher.com/sa1-key-paper-2026/)
 *  [ AP CPS to OPS Conversion 2026 – GO 158 Guidelines, NIDHI Application & Annexures ](https://amaravathiteacher.com/ap-cps-to-ops-conversion-2026-go-158-guidelines-nidhi-application-annexures/)
 *  [ SA1 Telugu Key Papers 2026 PDF Download – 1st to 10th Class ](https://amaravathiteacher.com/sa1-telugu-key-papers-2026/)
 *  [ AP SA1 2026 Class 10 School Level Observers Duties – DSE Proceedings 08-11-2026 ](https://amaravathiteacher.com/ap-sa1-2026-class-10-school-level-observers-duties-dse-orders/)

[View More ](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)

### 󠀁[TEACHERS SOFTWARES](https://amaravathiteacher.com/category/teachers-softwares/)󠁿

 *  [ SMC Elections 2026 Notification Voters List Download ](https://amaravathiteacher.com/smc-elections-2026-notification-voters-list-download/)
 *  [ Income Tax Online Calculator FY 2026-27 ](https://amaravathiteacher.com/income-tax-online-calculator-fy-2026-27/)
 *  [ Student id Card Download ](https://amaravathiteacher.com/student-id-card-download/)
 *  [ AP DA Arrears Calculator 2026 ](https://amaravathiteacher.com/ap-da-arrears-calculator-2026/)
 *  [ AP New DA Salary Calculator ](https://amaravathiteacher.com/ap-new-da-salary-calculator/)
 *  [ AP EHS Hospitals List ](https://amaravathiteacher.com/ap-ehs-hospitals-list/)
 *  [ AP Teachers ID Card Download ](https://amaravathiteacher.com/ap-teachers-id-card-download/)
 *  [ Pdf Compressor Online ](https://amaravathiteacher.com/pdf-compressor-online/)
 *  [ Online image compressor ](https://amaravathiteacher.com/online-image-compressor/)
 *  [ AP Medical Reimbursement Proposal Software ](https://amaravathiteacher.com/ap-medical-reimbursement-proposal-software/)

[View More ](https://amaravathiteacher.com/category/teachers-softwares/)
