# new-cable-TV-rates-Telugu-Channels-from-1st-February-2019

- Link: https://amaravathiteacher.com/new-cable-tv-rates-telugu-channels-from-1st-february-2019/
- Published: 2019-01-08T21:16:12+05:30
- Author: amaravathiteacher

## **_new-cable-TV-rates-Telugu-Channels-from-1st-February-2019_**

### **కొత్త కేబుల్ ధరలు ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి వస్తాయి. జనవరి 31 వరకూ పాత ధరలే ఉంటాయి. కొత్త నిబంధనలు అమలు చేయడానికి కేబుల్ ఆపరేటర్లు, ఎమ్మెస్వోలకు తగిన సమయం ఇవ్వడానికి వీలుగా గడువు సడలించారు.**

### **తొలుత 2018 డిసెంబర్ 29 నుంచే అమలు చేయాలని నిర్ణయించినా తాజాగా ఫిబ్రవరి 1కి మార్చారు.**

### **అయితే బిల్లులు పెరగడంపైనా, కేబుల్ కనెక్షన్ విషయంలో వినియోగదారులకు ఉన్న హక్కులపైనా అనేక మంది సందేహాలున్నాయి.**

### **కేబుల్ విషయంలో వినియోగదారునికి ఉన్న ముఖ్యమైన హక్కులను ఇక్కడ అందిస్తున్నాం.**

### **గరిష్ఠ ధర రూ.19**

### **\* కొత్తగా కేబుల్ కనెక్షన్ తీసుకుంటుంటే, సెట్ టాప్ బాక్సును వాయిదా పద్ధతిలో లేదా అద్దె పద్ధతిలో కూడా తీసుకోవచ్చు. కచ్చితంగా కొనాలన్న నిబంధన లేదు.**

### **\* ఏ పే చానల్ అయినా గరిష్ఠంగా 19 రూపాయలు మాత్రమే వసూలు చేయగలదు. అంత కంటే తక్కువ కూడా చేయవచ్చు. ఎక్కువ చేయకూడదు.**

### **\* కొత్త నిబంధనల ప్రకారం 100 ఉచిత చానళ్లు తప్పనిసరిగా ఇవ్వాలి. అందులో 26 దూరదర్శన్ చానళ్లే ఉంటాయి. ఈ వంద చానళ్లకీ కలిపి 130 రూపాయలు, 18 శాతం జీఎస్టీ అంటే మొత్తం 153.40 రూపాయలు చెల్లించాలి.**

### **\* ఈ ఉచిత చానళ్లను ఎంపిక చేసుకునే హక్కు వినియోగదారుడికి ఉంది.**

[siteorigin_widget class=”WP_Widget_Custom_HTML”][/siteorigin_widget]

### **వంద చానళ్ల కంటే ఎక్కువ ఉచిత చానళ్లను ఎంపిక చేసుకునే హక్కు కూడా వినియోగదారుడికి ఉంది. ఉదాహరణకు వందకు పైన ఇంకో 25 ఉచిత చానళ్లు కోరుకుంటే దానికి మరో 20 రూపాయలు ఎక్కువ బిల్లు కట్టాలి. సాధారణంగా ఈ అవసరం ఎక్కువ మందికి రాదు.**

### **\* ప్రతీ చానల్ కీ విడివిడి ధర ఉంటుంది. లేదంటే ఒకే గ్రూపుకు చెందిన చానళ్లు నాలుగైదింటికి కలిపి ఒక ధర ఇవ్వవచ్చు.**

### **\* ప్రతీ ఆపరేటరూ మీ దగ్గరకు ఒక చానళ్ల లిస్టు తేవాలి. అందులో తాను అందిస్తోన్న చానళ్ల పేర్లు, వాటి ధరలూ ఉంటాయి. అందులో మీకు ఏది కావాలో టిక్ పెట్టి కింద సంతకం పెట్టాలి. ఈ కాపీ మీ దగ్గర ఒకటి, ఆపరేటర్ దగ్గర ఒకటీ ఉండాలి.**

### **\* కేబుల్ యాక్టివేషన్ చార్జీలు 350 రూపాయలకు మించకూడదు. అన్నిటికీ బిల్లులు తప్పనిసరిగా ఇవ్వాలి. నెల నెలా కట్టే డబ్బులతో సహా.**

### **\* మీకిచ్చే కార్డులో మొత్తం చానళ్ల పట్టిక, వాటి ధరలు, గ్రూపు చానళ్ల ధరలు, మీ ఎంపికను మీ నెలవారీ బిల్లూ – మొత్తం ఉండాలి. ఈ కార్డు ఒక కాపీ వినియోగదారుడి దగ్గరా, ఇంకో కాపీ ఆపరేటర్ దగ్గరా ఉండాలి.**

### ** అన్ని రకాల నిబంధనలు ముద్రించిన కాగితం ఇవ్వాలి. అన్ని రకాల రేట్లు, రూల్స్ గురించి వివరించి చెప్పాలి. ఫిర్యాదు చేస్తే 8 గంటల్లో సర్వీసు సమస్య పరిష్కరించాలి.**

### **\* ఏదైనా పే చానల్ ప్రసారాలు ఆగిపోతే ఆ డబ్బు వసూలు చేయకూడదు. కానీ దాని బదులు అంతే ధర ఉన్న వేరే పే చానల్ కావాలంటే ఇవ్వవచ్చు లేదా తీసుకోవచ్చు.**

### **\* ఫిర్యాదులకు సంబంధించిన నంబర్లు ఇవ్వాలి, వెబ్ సైట్ ఏర్పాటు చేయాలి. చానళ్ల మార్పిడి రాతపూర్వకంగా ఉండాలి, 72 గంటల్లో జరగాలి.**

### **\* నెల కంటే ఎక్కువ రోజులు చానల్ చూడకపోతే ఆ నెల బిల్లు కట్టక్కర్లేదు. కానీ ఆ విషయం 15 రోజుల మందే ఆపరేటర్ కి చెప్పాలి. కానీ మళ్లీ రీ కనెక్షన్ కి మూడు నెలల లోపు అయితే 25 రూపాయలు, మూడు నెలలు దాటితే 100 రూపాయలు కట్టాలి.**

### **\* ఈ ఏర్పాట్లు కేబుల్ ఆపరేటర్ లేదా ఎమ్మెస్వో (ఎమ్మెస్వో అంటే చానల్ కీ కేబుల్ ఆపరేటర్ కీ మధ్యలో ఉండే డిస్ట్రిబ్యూటర్ వంటి వారు)లు చేయాలి.**

### **ప్రస్తుత తెలుగు చానళ్లు ఆఫర్ చేస్తోన్న ధరలు(రూ.ల్లో):**

### **1) జెమినీ టీవీ19.00**

### **2) జెమినీ మూవీస్17.00**

### **3) జెమినీ కామెడీ5.00**

### **4) జెమినీ లైఫ్5.00**

### **5) జెమిని మ్యూజిక్4.00**

### **6) ఖుషి టీవీ4.00**

### **7) జెమిని న్యూస్0.10**

### **\* పాకేజ్/బొకే ధర30.00**

[siteorigin_widget class=”WP_Widget_Custom_HTML”][/siteorigin_widget]

### **ETV**

### **ఈటీవీ పాకేజ్(ధర రూ.ల్లో)**

### **సంఖ్యచానల్ధర (రూ)**

### **1) ఈటీవీ17.00**

### **2) ఈటీవీ ప్లస్7.00**

### **3) ఈటీవీ సినిమా6.00**

### **4) ఈటీవీ అభిరుచి2.00**

### **5) ఈటీవీ లైఫ్1.00**

### **6) ఈటీవీ ఆంధ్రప్రదేశ్1.00**

### **7) ఈటీవీ తెలంగాణ1.00**

### **\* పాకేజ్/బొకే ధర24.00**

### **STARMAA**

### **స్టార్ తెలుగు వాల్యూ పాక్(రూ.ల్లో)**

### **1) మా టీవీ19.00**

### **2) మా మూవీస్10.00**

### **3) మా గోల్డ్2.00**

### **4) మా మ్యూజిక్1.00**

### **5) స్టార్ స్పోర్ట్స్ 1 తెలుగు19.00**

### **6) స్టార్ స్పోర్ట్స్ 26.00**

### **7) స్టార్ స్పోర్ట్స్ 34.00**

### **8) నేషనల్ జాగ్రఫిక్2.00**

### **9) నాట్ జియో వైల్డ్1.00**

### **10) స్టార్ స్పోర్ట్స్ ఫస్ట్1.00**

### **\* పాకేజ్/బొకే ధర39.00**

### **ZEE TELUGU**

### **జీ ప్రైమ్ పాక్**

### **1) జీ తెలుగు19.00**

### **2) జీ సినిమాలు10.00**

### **3) లివింగ్ ఫుడ్జ్4.00**

### **4) జీ యాక్షన్1.00**

### **5) జీ ఇటిసి1.00**

### **6) వియాన్1.00**

### **7) జీ న్యూస్0.50**

### **8) జీ హిందుస్తాన్0.50**

### **9) జీ కేరళమ్0.10**

### **\* పాకేజ్/బొకే ధర20.00 IMAGES**

[siteorigin_widget class=”WP_Widget_Custom_HTML”][/siteorigin_widget]

### **నెలవారీ బిల్లు**

### **ప్యాకేజీ, ధరల వివరాలు:**

### ** 100 ఉచిత చానల్స్రూ. 153.40, **

### **జెమినీ బొకే 35.40, **

### **ఈటీవీ బొకే 28.32, **

### **స్టార్ తెలుగు బొకే 46.02, **

### **జీ ప్రైమ్ పాక్ బొకే 23.60, **

### **మొత్తం బిల్లు 286.74**

### 󠀁[AP TEACHERS LATEST NEWS](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)󠁿

 *  [ NEW SA1 Science Question Papers 2026 ](https://amaravathiteacher.com/sa1-science-question-papers-2026/)
 *  [ NEW SA1 EVS Key Papers 2026 PDF Download – 3rd to 5th Class ](https://amaravathiteacher.com/sa1-evs-key-papers-2026/)
 *  [ SA1 Maths Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-maths-key-papers-2026/)
 *  [ APPSC Group 2 Notification 2026 – 720 Vacancies, Post-wise Qualifications, Age, Fee, Dates & Syllabus Apply Online ](https://amaravathiteacher.com/appsc-group-2-notification-2026-720-vacancies-apply-online/)
 *  [ SA1 Hindi Key Papers 2026 PDF Download – 6th to 10th Class ](https://amaravathiteacher.com/sa1-hindi-key-papers-2026/)
 *  [ SA1 English Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-english-key-papers-2026/)
 *  [ SA1 Key Paper 2026 ](https://amaravathiteacher.com/sa1-key-paper-2026/)
 *  [ AP CPS to OPS Conversion 2026 – GO 158 Guidelines, NIDHI Application & Annexures ](https://amaravathiteacher.com/ap-cps-to-ops-conversion-2026-go-158-guidelines-nidhi-application-annexures/)
 *  [ SA1 Telugu Key Papers 2026 PDF Download – 1st to 10th Class ](https://amaravathiteacher.com/sa1-telugu-key-papers-2026/)
 *  [ AP SA1 2026 Class 10 School Level Observers Duties – DSE Proceedings 08-11-2026 ](https://amaravathiteacher.com/ap-sa1-2026-class-10-school-level-observers-duties-dse-orders/)

[View More ](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)

### 󠀁[TEACHERS SOFTWARES](https://amaravathiteacher.com/category/teachers-softwares/)󠁿

 *  [ SMC Elections 2026 Notification Voters List Download ](https://amaravathiteacher.com/smc-elections-2026-notification-voters-list-download/)
 *  [ Income Tax Online Calculator FY 2026-27 ](https://amaravathiteacher.com/income-tax-online-calculator-fy-2026-27/)
 *  [ Student id Card Download ](https://amaravathiteacher.com/student-id-card-download/)
 *  [ AP DA Arrears Calculator 2026 ](https://amaravathiteacher.com/ap-da-arrears-calculator-2026/)
 *  [ AP New DA Salary Calculator ](https://amaravathiteacher.com/ap-new-da-salary-calculator/)
 *  [ AP EHS Hospitals List ](https://amaravathiteacher.com/ap-ehs-hospitals-list/)
 *  [ AP Teachers ID Card Download ](https://amaravathiteacher.com/ap-teachers-id-card-download/)
 *  [ Pdf Compressor Online ](https://amaravathiteacher.com/pdf-compressor-online/)
 *  [ Online image compressor ](https://amaravathiteacher.com/online-image-compressor/)
 *  [ AP Medical Reimbursement Proposal Software ](https://amaravathiteacher.com/ap-medical-reimbursement-proposal-software/)

[View More ](https://amaravathiteacher.com/category/teachers-softwares/)
