# new-youtube-rules-change-youtube-website-rules-details

- Link: https://amaravathiteacher.com/new-youtube-rules-change-youtube-website-rules-details/
- Published: 2019-11-12T14:10:09+05:30
- Author: amaravathiteacher

## **_new-youtube-rules-change-youtube-website-rules-details_**

### **యూట్యూబ్ రూల్స్ ఛేంజ్… వీడియో క్రియేటర్లకు షాక్..!**

### **యూట్యూబ్, గూగుల్ లాంటి పెద్ద పెద్ద కంపెనీలు… కొత్త రూల్స్ తెచ్చినప్పుడు దాదాపు 15 నుంచీ 20 పేజీల కండీషన్లు పెడతాయి. **

### **అవి మొత్తం చదివి ఓకే చెప్పమంటాయి. చాలా మంది అవి చదవకుండానే ఓకే చెబుతారు. **

### **యూట్యూబ్ కొత్తగా తెచ్చిన రూల్స్‌ని చాలా మంది ఇలాగే ఓకే చేశారు. **

### **ఇప్పుడా రూల్స్ షాక్ ఇచ్చేలా ఉన్నాయా?**

### **ప్రపంచవ్యాప్తంగా 200 కోట్ల మందికి పైగా యూజర్లను కలిగివున్న సంస్థ యూట్యూబ్. **

### **క్షణక్షణానికీ కొన్ని వేల వీడియోలు యూట్యూబ్‌లో అప్‌లోడ్ అవుతూ ఉంటాయి. **

### **ఐతే… ఈ వీడియోల్లో చాలావాటికి… యాడ్ రెవెన్యూ రావట్లేదు. **

### **ఇలాంటి వీడియోల వల్ల యూట్యూబ్ సర్వర్లకు అనవసరంగా స్పేస్ వేస్టవుతోంది. **

### **అందుకే యూట్యూబ్ యాజమాన్యం కొత్త రూల్స్ తెచ్చింది. **

### **వాటిని ఇప్పటికే 90 శాతం కంటెంట్ క్రియేటర్లు ఓకే చేశారు కూడా. ఐతే… ఇలా ఓకే చేసిన వారిలో చాలా మందికి అసలు యూట్యూబ్ తెచ్చిన కొత్త రూల్స్ ఏంటి? కొత్త కండీషన్లేంటి? అన్నది పూర్తిగా తెలియదు. ఆ కండీషన్లను చదివే ఓపిక లేక… ఓకే చేసేసినవాళ్లే ఎక్కువ. బట్… వాటిని చదివిన వాళ్లు అసలు విషయం తెలిసి షాకవుతున్నారు.**

### **సింపుల్‌గా చెప్పాలంటే యూట్యూబ్ తెచ్చిన కొత్త రూల్స్… కంటెంట్ క్రియేటర్లకు షాక్ ఇస్తున్నాయిు. ఇకపై యూట్యూబ్‌లో క్రియేటర్లు అప్‌లోడ్ చేసే వీడియోలకు… యాడ్ రెవెన్యూ సరిగా రాకపోయినా లేక రెవెన్యూ తక్కువగా వస్తున్నా… ఇక ఆ క్రియేటర్ యూట్యూబ్ ఛానెల్‌ను యూట్యూబ్ యాజమాన్యం రద్దు చేస్తుంది. ఆ తర్వాత ఇక ఆ వీడియోలు గూగుల్ సర్వీసుల్లో కనిపించవు. **

### **ఆ క్రియేటర్… జీమెయిల్, గూగుల్ డాక్స్, గూగుల్ ఫొటోలు వంటి సేవలు కూడా వాడుకోకుండా చేస్తుంది. ఎంత రెవెన్యూ వస్తుంది, ఎంత రావాలి అన్నదాన్ని నిర్ణయించేది యూట్యూబ్ యాజమాన్యమే.**

### **ఈ జాగ్రత్తలు పాటించండి :**⏎ **– ఇకపై వీడియోలు అప్‌లోడ్ చేసే క్రియేటర్లు… క్వాలిటీ వీడియోలను మాత్రమే అప్‌లోడ్ చేయడం బెటర్.**

### **అప్‌లోడ్ చేసే వీడియో… ఎక్కువ మంది చూడదగ్గదిగా ఉండాలి. **

### **అప్పుడు దానికి యాడ్ రెవెన్యూ కూడా ఎక్కువ ఉంటుంది.**⏎ **– ఏ వీడియో అయినా కనీసం 10వేల మంది చూస్తే… అలాంటి వీడియోలకు యూట్యూబ్ ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంది.****– కనీసం వారానికి ఒక వీడియో అయినా అప్‌లోడ్ చేస్తే… అకౌంట్ యాక్టివ్‌గా ఉన్నట్లు యూట్యూబ్ యాజమాన్యం భావిస్తుంది.**

### **ఈ కొత్త రూల్స్ వెబ్‌సైట్లకు కూడా వర్తిస్తాయి. వెబ్‌సైట్లలో గూగుల్ యాడ్స్ ఉంచుతుంది. **

### **ఈ యాడ్లను ప్రజలు పెద్దగా క్లిక్ చెయ్యకపోతే… వెబ్‌సైట్‌కి యాడ్ రెవెన్యూ ఎక్కువగా రాదు. **

### **అలాంటి వెబ్‌సైట్లకు యాడ్లను గూగుల్ ఇకపై తొలగిస్తుంది. **

### **అంతేకాదు… ఆ వ్యక్తికి చెందిన జీమెయిల్, ఇతర సర్వీసుల్ని రద్దు చేస్తుంది. **

### **ఇది వెబ్‌సైట్ల నిర్వాహకులకు ఇబ్బంది కలిగించే అంశమే.**

### **కొత్త రూల్స్ డిసెంబర్ 10, 2019 నుంచీ అమల్లోకి రానున్నాయి. **

### **యూట్యూబ్ నిర్ణయంపై విమర్శలు వస్తున్నాయి. చిన్న క్రియేటర్లకు ఇబ్బంది కలిగిస్తూ… పెద్ద క్రియేటర్లకు ఫేవర్‌ చేస్తున్నారని చాలా మంది అంటున్నారు. **

### **దీనిపై చాలా మంది ట్విట్టర్, రెడ్డిట్‌లో తమ అభ్యంతరాల్ని తెలుపుతున్నారు. **

### **యూట్యూబ్ యాజమాన్యం మాత్రం… కొత్త రూల్స్ వల్ల యూట్యూబ్ మరింత ఎక్కువ మందికి చేరువవుతుందనీ, కంటెంట్ క్రియేటర్లకు అది మేలు చేస్తుందని అంటోంది.**

### 󠀁[AP TEACHERS LATEST NEWS](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)󠁿

 *  [ NEW SA1 Science Question Papers 2026 ](https://amaravathiteacher.com/sa1-science-question-papers-2026/)
 *  [ NEW SA1 EVS Key Papers 2026 PDF Download – 3rd to 5th Class ](https://amaravathiteacher.com/sa1-evs-key-papers-2026/)
 *  [ SA1 Maths Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-maths-key-papers-2026/)
 *  [ APPSC Group 2 Notification 2026 – 720 Vacancies, Post-wise Qualifications, Age, Fee, Dates & Syllabus Apply Online ](https://amaravathiteacher.com/appsc-group-2-notification-2026-720-vacancies-apply-online/)
 *  [ SA1 Hindi Key Papers 2026 PDF Download – 6th to 10th Class ](https://amaravathiteacher.com/sa1-hindi-key-papers-2026/)
 *  [ SA1 English Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-english-key-papers-2026/)
 *  [ SA1 Key Paper 2026 ](https://amaravathiteacher.com/sa1-key-paper-2026/)
 *  [ AP CPS to OPS Conversion 2026 – GO 158 Guidelines, NIDHI Application & Annexures ](https://amaravathiteacher.com/ap-cps-to-ops-conversion-2026-go-158-guidelines-nidhi-application-annexures/)
 *  [ SA1 Telugu Key Papers 2026 PDF Download – 1st to 10th Class ](https://amaravathiteacher.com/sa1-telugu-key-papers-2026/)
 *  [ AP SA1 2026 Class 10 School Level Observers Duties – DSE Proceedings 08-11-2026 ](https://amaravathiteacher.com/ap-sa1-2026-class-10-school-level-observers-duties-dse-orders/)

[View More ](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)

### 󠀁[TEACHERS SOFTWARES](https://amaravathiteacher.com/category/teachers-softwares/)󠁿

 *  [ SMC Elections 2026 Notification Voters List Download ](https://amaravathiteacher.com/smc-elections-2026-notification-voters-list-download/)
 *  [ Income Tax Online Calculator FY 2026-27 ](https://amaravathiteacher.com/income-tax-online-calculator-fy-2026-27/)
 *  [ Student id Card Download ](https://amaravathiteacher.com/student-id-card-download/)
 *  [ AP DA Arrears Calculator 2026 ](https://amaravathiteacher.com/ap-da-arrears-calculator-2026/)
 *  [ AP New DA Salary Calculator ](https://amaravathiteacher.com/ap-new-da-salary-calculator/)
 *  [ AP EHS Hospitals List ](https://amaravathiteacher.com/ap-ehs-hospitals-list/)
 *  [ AP Teachers ID Card Download ](https://amaravathiteacher.com/ap-teachers-id-card-download/)
 *  [ Pdf Compressor Online ](https://amaravathiteacher.com/pdf-compressor-online/)
 *  [ Online image compressor ](https://amaravathiteacher.com/online-image-compressor/)
 *  [ AP Medical Reimbursement Proposal Software ](https://amaravathiteacher.com/ap-medical-reimbursement-proposal-software/)

[View More ](https://amaravathiteacher.com/category/teachers-softwares/)
