nirmala-sitharaman-epf-contribution-reduced-to-increase-take-home-pay

nirmala-sitharaman-epf-contribution-reduced-to-increase-take-home-salary

PF ఖాతాదారులకు అదిరిపోయే శుభవార్త.. నిర్మలా సీతారామన్ కీలక నిర్ణయం!

కేంద్ర ఆర్థిక మంత్రి ఉద్యోగులకు తీపికబురు అందించారు. పీఎఫ్ కంట్రిబ్యూషన్ మొత్తాన్ని తగ్గిస్తున్నట్లు ప్రకటించారు.

దీంతో ఉద్యోగుల టేక్ హోమ్ శాలరీ పెరుగుతుంది.

ఆర్థిక మంత్రి  నిర్మలా సీతారామన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగులకు ప్రయోజనం కలిగించే ప్రకటన చేశారు.

పీఎఫ్ కంట్రిబ్యూషన్ మొత్తాన్ని 12 శాతం నుంచి 10 శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఉద్యోగుల టేకోమ్ శాలరీ పెరుగుతుంది. దీంతో చేతిలో కొంత ఎక్కువ డబ్బులు మిగులుతాయి.

వచ్చే మూడు నెలలు ఇది వర్తిస్తుందని తెలిపారు. కంపెనీలు మాత్ర 12 శాతం పీఎఫ్ అకౌంట్‌కు కంట్రిబ్యూట్ చేస్తాయని పేర్కొన్నారు.

అలాగే కంపెనీలకు కూడా ఊరట కలిగించే నిర్ణయం తీసుకున్నారు.

పీఎఫ్ కంట్రిబ్యూషన్ మొత్తాన్ని మరో మూడు నెలలపాటు కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు.

జూన్ నుంచి ఆగస్ట్ వరకు ఇది వర్తిస్తుంది. కంపెనీలు, ఉద్యోగుల పీఎఫ్ కంట్రిబ్యూషన్‌ను కేంద్ర ప్రభుత్వమే ఈపీఎఫ్ ఖాతాకు చెల్లిస్తుంది. రూ.15000 లోపు వేతనం ఉన్న వారికి ఇది వర్తిస్తుంది.

భారీ ప్యాకేజీ: నిర్మలా సీతారామన్‌ ప్రెస్‌మీట్‌

అభివృద్ధిని ఆకాంక్షిస్తూ.. స్వయం సమృద్ధితో కూడిన భారత్‌ నిర్మాణం కోసమే భారీ ఆర్థిక ప్యాకేజీని ప్రకటించినట్లు ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు.

అన్ని వర్గాల ప్రజలతో చర్చించిన తర్వాతే ప్రధాని నరేంద్ర మోదీ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు.

ఆత్మ నిర్భర్‌ భారత్‌ అంటే స్వయం ఆధారిత భారత్‌ అని.. ఐదు మూల స్థంభాల ఆధారంగా దీనిని రూపొందించినట్లు పేర్కొన్నారు.

స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యమిస్తూ.. లోకల్‌ బ్రాండ్లను విశ్వవ్యాప్తం చేయడమే తమ లక్ష్యమన్నారు.

లాక్‌డౌన్‌ కాలంలోనూ కేంద్రం అనేక సంక్షేమ పథకాలను నిరంతరాయంగా అమలు చేస్తోందని స్పష్టం చేశారు.

నిర్మలా సీతారామన్‌ ప్రసంగం- ముఖ్యాంశాలు

  • లాక్‌డౌన్‌తో చిన్న, మధ్య తరహా పరిశ్రమలు దెబ్బతిన్నాయి

  • 45 లక్షల చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఊరట

  • రూ. 3 లక్షల కోట్ల రుణాలకు ప్రభుత్వ గ్యారెంటీ

  • చిన్న మధ్యతరహా పరిశ్రమలకు అక్టోబరు 31 వరకు అప్పులు

  • అత్యవసరాల కోసం చిన్న మధ్య తరహా పరిశ్రమల కోసం రూ. 20 వేల కోట్ల అప్పులు

  • 4 సంవత్సరాల కాలపరిమితికి అప్పులు తీసుకోవచ్చు

  • విద్యుత్‌ డిస్కంలను ఆదుకునేందుకు రూ. 90 వేల కోట్ల నిధులు

  • ఈపీఎఫ్‌ ప్రభుత్వమిస్తున్న సాయం మరో 3 నెలల పాటు పొడిగింపు

  • తద్వారా 70.22 లక్షల మంది ఉద్యోగులకు లబ్ది

  • ప్రాథమిక, సెకండరీ మార్కెట్లలో పెట్టుబడులపై రూ. 30 వేల కోట్లు

చిన్న మధ్య తరహా పరిశ్రమల మూలధన పరిధిని పెంచిన కేంద్రం

  • కోటి రూపాయల పెట్టుబడి ఉన్న కంపెనీలన్నీ సూక్ష్మతరహా పరిశ్రమలు

  • రూ. 5 కోట్ల టర్నోవర్‌ ఉన్న కంపెనీలన్నీ చిన్న, మధ్య తరహా పరిశ్రమలు

  • రూ. 10 కోట్ల పెట్టుబడి, రూ. 50 కోట్ల టర్నోవర్‌ ఉన్నవన్నీ చిన్న తరమా

  • రూ. 200 కోట్ల వరకు గ్లోబల్‌ టెండర్లు పిలవం

error: Content is protected !!