NMMS RESULTS 2025 – NMMS Selected Candidates 2024 List
NMMS MERIT CARD DOWNLOAD DECEMBER -2024
NMMS RESULTS DECEMBER -2024 Download
NMMS DISTRICT WISE SELECTED CANDIDATES List Download
Press Note-Release of NMMS 2024 Results
08-12-2024 న రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన జాతీయ ఉపకారవేతన పరీక్ష (NMMS) ఫలితములు విడుదల చేయబడినవి. ఈ పరీక్షలో ఎంపిక అయిన విద్యార్థుల యొక్క వెబ్ మెరిట్ కార్డ్ లను ప్రభుత్వ పరీక్షల కార్యాలయ వెబ్సైట్ www.bse.ap.gov.in లో అందుబాటులో ఉంచడమైనది. కావున ఎంపిక అయిన విద్యార్థులు వెంటనే బ్యాంక్ అకౌంటు తెరిచి, విద్యార్థి ఆధార్ ను లింకు చేయించి, DBT ద్వారా డబ్బులు జమ అయ్యే విధంగా ఏర్పాటు చేసుకొనవలెను. ఎంపిక అయిన విద్యార్థులు నెబ్సైట్ నుండి వారి మెరిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకుని వారి పేరు, పుట్టిన తేదీ, తండ్రి లేదా తల్లి పేరు మొదలగు వివరములు వారి ఆధార్ కార్డ్ పైన ఉన్న విధంగానే (ఒక్క అక్షరం కూడా తేడా లేకుండా) ఉన్నవో లేదో తనిఖీ చేసుకుని విద్యా మంత్రిత్వ శాఖ, న్యూ ఢిల్లీ వారి స్కాలర్షిప్ పోర్టల్ www.scholarships.gov.in లో నమోదు చేసుకుని అప్లికేషన్ ను సబ్మిట్ చేయవలెను. తదుపరి సంబంధిత పాఠశాల నోడల్ ఆఫీసర్ మరియు జిల్లా నోడల్ ఆఫీసర్ లాగిన్ ల ద్వారా ఆప్రూవ్ చేయించుకొనవలెను. ముద్రించిన మెరిట్ కార్డ్ లను త్వరలో సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారి వారి కార్యాలయమునకు పంపడం జరుగుతుంది. వివరములు సరిపోలని విద్యార్థులు వెంటనే ఆధార్ mismatch వివరములు సంబంధిత పాఠశాల ప్రధానోపాద్యాయుల ద్వారా జిల్లా విద్యాశాఖాధికారికి అందజేయవలెను. తప్పని సరిగా విద్యార్థి ఆధార్ విద్యార్ధి బ్యాంక్ ఖాతాకు సీడ్ చేయబడి, DBT (డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్) ద్వారా నగదు జమ అయ్యేవిధంగా ఏర్పాటు చేసుకొనవలసినదిగా ప్రభుత్వ పరీక్షల సంచాలకులు డా|| కె వి శ్రీనివాసులు రెడ్డి గారు తెలియజేసారు.