Online-application-for-migrants-move-to-own-state-registaration-process

Online-application-for-migrants-move-to-own-state-registaration-process

హైదరాబాద్ నుంచి ఏపీకి బస్సులు..

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లాక్‌డౌన్ ప్రభావంతో హైదరాబాద్‌లో వున్న ఏపీ వాసులను రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు రెడీ అయ్యింది.

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లాక్‌డౌన్ ప్రభావంతో హైదరాబాద్‌లో వున్న ఏపీ వాసులను రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు రెడీ అయ్యింది.

ఇందుకోసం హైదరాబాద్ నుంచి ఆర్టీసీ బస్సులను నడపాలని నిర్ణయించింది.

ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్పందన పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది.

అయితే, స్వస్థలాలకు చేరుకున్న తర్వాత సంబంధిత జిల్లాలో ఉండే క్వారంటైన్‌ కేంద్రంలో ఉంటామని అంగీకరిస్తేనే టికెట్లు జారీ చేయనుంది.

ఇందుకు తగిన ఏర్పాట్లు చేయాలని ఉన్నతాధికారులు అన్ని జిల్లాల ఆర్టీసీ రీజినల్‌ మేనేజర్లకు ఆదేశాలు పంపారు.

ఏసీ బస్సుల్లో గరుడ ఛార్జీ, నాన్‌ ఏసీ బస్సుల్లో సూపర్‌ లగ్జరీ ఛార్జీ వసూలు చేస్తారు.

ఈ బస్సులు మియాపూర్‌-బొల్లారం క్రాస్‌రోడ్‌, కూకట్‌పల్లి హౌసింగ్‌బోర్డ్‌, ఎల్బీ నగర్‌ నుంచి వెళ్లనున్నాయి.

రెండో దశలో బెంగళూరు, చెన్నై నగరాల్లో ఉండిపోయిన ఏపీకి చెందిన వారిని తీసుకొచ్చేందుకు సర్వీసులు నడపనున్నారు

వేరే రాష్ట్రానికి వెళ్లాలా? అప్లై చేయండి ఇలా

ఆంధ్రప్రదేశ్ నుంచి ఇతర రాష్ట్రాలకు, ఇతర రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లాలనుకునేవారి నుంచి ప్రభుత్వం ఆన్‌లైన్‌లో దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది.

కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ ఆంక్షల్లో కొన్ని మినహాయింపుల్ని ఇచ్చిన సంగతి తెలిసిందే. లాక్‌డౌన్ కారణంగా వేర్వేరు ప్రాంతాల్లో చిక్కుకు పోయిన విద్యార్థులు, పర్యాటకులు, వలసకార్మికుల్ని తమ స్వరాష్ట్రాలకు వెళ్లేందుకు అనుమతి ఇచ్చింది.

Online Registration FOR MIGRANTS

అప్ పోలీస్ EMERGENCY VEHICLE PASS APPLY HERE

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కూడా వలస కార్మికుల్ని స్వరాష్ట్రాలకు పంపేందుకు, ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన ఆంధ్రప్రదేశ్ కార్మికుల్ని తమ రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది.

మరి మీరు కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి వేరే రాష్ట్రానికి వెళ్లాలనుకున్నా, వేరే రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్‌కు రావాలన్నా వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయొచ్చు. ఎలాగో తెలుసుకోండి.

AP‌ ప్రభుత్వానికి చెందిన వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
హోమ్ పేజీలో COVID-19 Movement of People ట్యాబ్‌లో Online Registration పైన్ క్లిక్ చేయండి.

కొత్త పేజీలో Migrant Registration Form ఓపెన్ అవుతుంది.
మీరు వేరే రాష్ట్రం నుంచి ఏపీకి రావాలా? ఏపీ నుంచి వేరే రాష్ట్రానికి వెళ్లాలా? అనే ఆప్షన్ సెలెక్ట్ చేయాలి.

ఆ తర్వాత మీ పేరు, ఆధార్ నెంబర్, ఫోన్ నెంబర్, వయస్సు, ఆంధ్రప్రదేశ్‌లోని అడ్రస్, ఇతర రాష్ట్రాల్లోని అడ్రస్ ఎంటర్ చేయాలి.
వలస కూలీ, యాత్రికులు, టూరిస్ట్, విద్యార్థి, ఆఫీస్ వర్క్, అదర్స్‌లో మీ ఆప్షన్ సెలెక్ట్ చేయాలి.మీ ఆరోగ్య పరిస్థితి గురించి కూడా తెలియజేయాలి.

మీ వివరాలన్నీ పరిశీలించిన తర్వాత మిమ్మల్ని స్వరాష్ట్రానికి తరలించేందుకు ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది.

Online Registration FOR MIGRANTS

AP GOVERNMENT SPANDANA MAIN WEBSITE

error: Content is protected !!