online-transactions-safety-instructions-cyber-police-warns

online-transactions-safety-instructions-cyber-police-warns

మీ ఆన్‌లైన్ బ్యాంక్ లావాదేవీలు భద్రమేనా.. ఇవి తెలుసుకోండి..

పెద్ద నోట్ల రద్దు అనంతరం కరెన్సీ లావాదేవీలు తక్కువై డిజిటల్ లావాదేవీలు ఎక్కువయ్యాయి.

అయితే, వీటిని ఆధారంగా చేసుకొని సైబర్ నేరగాళ్లు ఆన్‌లైన్ మోసాలకు పాల్పడుతున్నారు.

పెద్ద నోట్ల రద్దు అనంతరం కరెన్సీ లావాదేవీలు తక్కువై డిజిటల్ లావాదేవీలు ఎక్కువయ్యాయి.

అయితే, వీటిని ఆధారంగా చేసుకొని సైబర్ నేరగాళ్లు ఆన్‌లైన్ మోసాలకు పాల్పడుతున్నారు.

అందుకే ఎక్కడపడితే అక్కడ, ఏ వెబ్‌సైట్ పడితే ఆ వెబ్‌సైట్ తెరవొద్దని పోలీసులు సూచిస్తున్నారు.

ఆన్‌లైన్ లావాదేవీలు చేసేప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రజలకు అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా.. ‘ఆన్‌లైన్ లావాదేవీలు చేసేందుకు ఇతరుల కంప్యూటర్ గానీ, ఉచిత వైఫై గానీ ఉపయోగించవద్దు.

మీ బ్యాంక్ వెబ్‌సైట్ పేరును లేదా URLను టైపు చేసి మాత్రమే వెబ్‌సైట్‌ను వీక్షించాలి.

వెబ్‌సైట్ పేరు https తో ప్రారంభం అయిందో లేదో కచ్చితంగా సరి చూసుకోవాలి.

లాగిన్ మరియు పాస్‌వర్డ్ టైపు చేసేప్పుడు వర్చువల్ కీబోర్డు ఉపయోగిస్తే మేలు’ అని తెలిపారు.

క్లిష్టమైన పాస్‌వర్డ్ పెట్టుకుంటే వేరేవాళ్లకు అర్థం కాకుండా ఉంటుందని, అంతేకాకుండా ఆ పాస్‌వర్డ్‌ను తరచూ మార్చుతూ ఉంటే మంచిదని వెల్లడించారు.

పాస్‌వర్డ్, OTPతో రెండు దశల్లో ఆన్‌లైన్ ఖాతాను రూడీ చేసుకోవాలని, లావాదేవీలు చేశాక లాగ్ అవుట్ చేయడం అస్సలు మర్చిపోవద్దని సూచించారు.

error: Content is protected !!