# OPTOMETRY-COLLEGES-IN-ANDHRA-PRADESH-ADMISSIONS-2020-21

- Link: https://amaravathiteacher.com/optometry-colleges-in-andhra-pradesh-admissions-2020-21/
- Published: 2020-06-09T09:33:26+05:30
- Author: amaravathiteacher

### **OPTOMETRY-COLLEGES-IN-ANDHRA-PRADESH-ADMISSIONS-2020-21**

### 󠀁[󠀁[

### **కంటి వెలుగును కాపాడే కొలువులు!\***

### **\*ఇంటర్‌ తర్వాత ఆప్టోమెట్రీ కోర్సులు\***

### **ఆప్టోమెట్రీ అనేది కంటికి సంబంధించిన ఆరోగ్య సమస్యలు మరియు వాటి చికిత్స గురించి. **

### **కంటి ఆరోగ్య సంరక్షణలో వైద్యులకు సహాయకులుగా ఆప్టోమెట్రిస్టులు ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. **

### **ఆప్టోమెట్రీ నిపుణులు భారతదేశం మరియు విదేశీ ఉద్యోగ మార్కెట్లలో మార్కెట్లో తక్షణ అవకాశాలను పొందవచ్చు. ****ఈ అంశంపై అందించే వివిధ కోర్సుల వివరాలు ఇక్కడ ఉన్నాయి.**

### **అవకాశాలు:**⏎ **ఆలస్యంగా, కంటి సంరక్షణ సంస్థలు మరియు కార్పొరేట్ ఆసుపత్రులు చిన్న పట్టణాలకు కూడా విస్తరిస్తున్నాయి. ఈ అభివృద్ధి ఆప్టోమెట్రీ మరియు ఆప్తాల్మిక్ టెక్నిక్స్‌లో శిక్షణ పొందిన నైపుణ్యం కలిగిన సిబ్బందికి డిమాండ్‌కు ఆజ్యం పోస్తోంది. ఈ కోర్సులు పూర్తి చేసిన వారు చదువుకున్న తర్వాత తగిన కెరీర్‌లను పొందవచ్చు. వారు తమ సొంత అభ్యాసాన్ని కూడా ప్రారంభించవచ్చు**

### **\*ఎప్పుడైనా ఏదైనా ఇబ్బందితో కంటి ఆసుపత్రికి వెళితే ముందుగా బోర్డు మీద విభిన్న పరిమాణాల్లో ఉన్న  అక్షరాలను చదవమని అడుగుతారు. కనిపించకపోయినా.. **

### **కాస్త  మసక అనిపించినా.. రకరకాల ఆప్టిక్స్‌ పెట్టి పరీక్షిస్తుంటారు. **

### **ఆ తర్వాతే ప్రధాన వైద్యుడిని కలవడానికి పంపుతారు. వాళ్లే ఆప్టోమెట్రీషియన్లు.\***

### **\*కంటి పరీక్షలను ప్రాథమిక స్థాయిలో క్షుణ్ణంగా నిర్వహించేవాళ్లు ఆప్టోమెట్రీషియన్లు\*. **

### ** \*ఈ ఉద్యోగాల్లోకి ప్రవేశించాలంటే ఆప్టోమెట్రీ డిప్లొమా లేదా డిగ్రీ పొంది ఉండాలి.\***

### ** \*ఇంటర్మీడియట్‌ అర్హతతో విద్యార్థులు ఆ కోర్సులకు దరఖాస్తు చేసుకోవచ్చు\***

### **\*ఇంటర్‌ విద్యార్హతతో ఆప్టోమెట్రీలో డిప్లొమా, బ్యాచిలర్‌ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.\* **

### ** \*ఇంటర్‌ అన్ని గ్రూపుల వారూ డిప్లొమాలో చేరవచ్చు\*. **

### **\*వ్యవధి రెండేళ్లు\*. **

### **\*అది పూర్తిచేసుకున్నవారు ఆప్టోమెట్రీ యూజీ కోర్సులో నేరుగా రెండో ఏడాదిలోకి ప్రవేశించవచ్చు\*. **

### **\*ఈ అవకాశం కొన్ని సంస్థల్లోనే లభిస్తుంది.\***

### ** \*బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆప్టోమెట్రీ వ్యవధి నాలుగేళ్లు\***

### **\*రాష్ట్ర స్థాయి సంస్థల్లో బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆప్టోమెట్రీ లేదా బీఎస్సీ ఆప్టోమెట్రీలో చేరాలంటే ఇంటర్మీడియట్‌ బైపీసీ గ్రూపుతో ఉత్తీర్ణులై ఉండాలి.\***

### **\*జాతీయస్థాయి, పేరున్న సంస్థలు మాత్రం బైపీసీతోపాటు ఎంపీసీ వారికీ అవకాశం కల్పిస్తున్నాయి.\* **

### **\*ఇంటర్‌ ఎంపీసీ, బైపీసీ విద్యార్థులు నాలుగేళ్ల యూజీ కోర్సులో చేరడానికి ప్రాధాన్యం ఇవ్వవచ్చు.\***

### ** \*నాలుగేళ్ల కోర్సులో చివరి ఏడాది మొత్తం ఇంటర్న్‌షిప్‌ ఉంటుంది. **

### **ఏదైనా కంటి ఆసుపత్రిలో దీన్ని చేయాలి. జాతీయ, రాష్ట్ర స్థాయుల్లో పలు సంస్థలు బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆప్టోమెట్రీ కోర్సులను నిర్వహిస్తున్నాయి. **

### **తర్వాత ఆసక్తి ఉన్నవారు రెండేళ్ల మాస్టర్‌ ఆఫ్‌ ఆప్టోమెట్రీలో చేరవచ్చు. అనంతరం పీహెచ్‌డీకీ అవకాశాలు ఉన్నాయి.\***

### **\*బీ-ఆప్టోమెట్రీ అందించే సంస్థల్లో కొన్ని పీజీ, పీహెచ్‌డీలనూ నిర్వహిస్తున్నాయి.\***

### ** \*దేశంలోని ప్రసిద్ధ నేత్ర వైద్యశాలలూ యూజీ, పీజీ,  పీజీ డిప్లొమా, పీహెచ్‌డీ స్థాయుల్లో నాణ్యమైన విద్యను అందిస్తున్నాయి. **

### **యూజీ విద్యార్థులకు ఏడాది ఇంటర్న్‌షిప్‌ అవకాశాన్నీ కల్పిస్తున్నాయి. **

### **ఇంటర్‌ బోర్డు లేదా ఓపెన్‌ విధానంలో బైపీసీ గ్రూపు చదివినవారు;  బయాలజీ, ఫిజిక్స్‌ల్లో బ్రిడ్జ్‌ కోర్సు పూర్తిచేసుకున్న ఒకేషనల్‌ విద్యార్థులు రాష్ట్ర స్థాయి సంస్థల్లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.\***

### ** \*కోర్సు ప్రారంభమైన సంవత్సరం డిసెంబరు 31 నాటికి 17 ఏళ్లు నిండడం తప్పనిసరి\*. **

### **\*ఇంటర్‌ మార్కుల ఆధారంగా అడ్మిషన్‌ ఇస్తారు\*. **

### **\*ప్రకటనలు జూన్‌ లేదా జులైల్లో వెలువడతాయి.\***

### ** \*జాతీయ స్థాయి సంస్థలు ప్రత్యేక ప్రవేశ పరీక్ష లేదా నీట్‌ స్కోర్‌తో చేర్చుకుంటున్నాయి.\***

### **\*ఆప్టోమెట్రిస్ట్‌గా సేవలు అందించాలకునే వారికి దృష్టిలోపం ఉండకపోతే మంచిది.\***

### **\*ఇవీ సంస్థలు\***

### **\*హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం ఆరేళ్ల వ్యవధితో ఇంటిగ్రేటెడ్‌ మాస్టర్‌ ఆఫ్‌ ఆప్టోమెట్రీ (ఎం-ఆప్టోమ్‌) కోర్సు అందిస్తోంది. **

### **ఇందులో 28 సీట్లు ఉన్నాయి. **

### **ఇంటర్‌లో బయాలజీ, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌ సబ్జెక్టులు చదువుకున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. **

### **60 శాతం మార్కులు తప్పనిసరి. **

### **పరీక్షలో చూపిన ప్రతిభతో ప్రవేశాలుంటాయి. ప్రకటన వెలువడింది. **

### **జూన్‌ 30లోగా దరఖాస్తు చేసుకోవచ్చు. **

### ** రాత పరీక్షలో చూపిన ప్రతిభతో అవకాశం లభిస్తుంది. **

### **వంద మార్కులకు జనరల్‌ సైన్స్‌, మ్యాథ్స్‌ సబ్జెక్టుల నుంచి ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలు వస్తాయి.\***

### **\* అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్‌) న్యూదిల్లీ, రిషికేశ్‌ క్యాంపస్‌ల్లో బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆప్టోమెట్రీ కోర్సు అందిస్తున్నారు. **

### **ఈ రెండు సంస్థల్లో కలిపి 34 సీట్లు ఉన్నాయి. పరీక్షలో చూపిన ప్రతిభతో ప్రవేశం  లభిస్తుంది. **

### **ఈ సంస్థల్లో చేరిన విద్యార్థులకు నెలకు రూ.500 స్ట్టైపెండ్‌  చెల్లిస్తారు. **

### **నాలుగో ఏడాది ఇంటర్న్‌షిప్‌లో ప్రతి నెల రూ. 10,250 అందుతుంది.**

### ** బైపీసీ, ఎంపీసీ రెండు గ్రూపుల విద్యార్థులూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బయాలజీ, మ్యాథ్స్‌ సబ్జెక్టుల్లో ప్రశ్నలు వస్తాయి. **

### **విద్యార్థులు బయాలజీ లేదా మ్యాథ్స్‌ల్లో ఒక సబ్జెక్టు ప్రశ్నలకు జవాబులు రాస్తే సరిపోతుంది.\***

### **\* శంకర నేత్రాలయ, చెన్నై ఆధ్వర్యంలో నడుస్తున్న ఎలైట్‌ స్కూల్‌ ఆఫ్‌ ఆప్టోమెట్రీలో బ్యాచిలర్‌, మాస్టర్‌, డాక్టరేట్‌ స్థాయి కోర్సులున్నాయి.బ్యాచిలర్స్‌లో చేరినవారు మొదటి రెండేళ్లు శస్త్ర యూనివర్సిటీ, తంజావూరులో చదువుతారు. **

### **తర్వాత రెండేళ్లు ఎలైట్‌ స్కూల్‌, శంకర నేత్రాలయలో చదువు, ఇంటర్న్‌షిప్‌ పూర్తిచేస్తారు. **

### **ప్రవేశం నీట్‌ స్కోర్‌, ఇంటర్‌ మార్కులతో ఉంటుంది లేదా శస్త్ర నిర్వహించే రాత పరీక్షలో మెరిట్‌ సాధించాలి. ఈ కోర్సులకు బైపీసీ, ఎంపీసీ రెండు గ్రూపుల విద్యార్థులూ దరఖాస్తు చేసుకోవచ్చు. **

### **ప్రకటన వెలువడింది. ఆసక్తి ఉన్నవారు శస్త్ర వెబ్‌సైట్‌లో వివరాలు నమోదు చేసుకోవచ్చు.\***

### **\* ఆప్టోమెట్రీలో యూజీ, పీజీలను మణిపాల్‌ అకాడమీ ఆఫ్**

### ** హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ అందిస్తోంది. పరీక్ష, ఇంటర్వ్యూలతో ప్రవేశం లభిస్తుంది. **

### **బైపీసీ, ఎంపీసీ రెండు గ్రూపుల విద్యార్థులూ దరఖాస్తు చేసుకోవచ్చు.**

### ** ప్రస్తుతం రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ కొనసాగుతోంది.\***

### **\* ఆప్టోమెట్రీ మూడేళ్ల కోర్సు పూర్తిచేసుకున్న విద్యార్థులు నాలుగో ఏడాది ఇంటర్న్‌షిప్‌ను హైదరాబాద్‌, విశాఖపట్నం, విజయవాడ, భువనేశ్వర్‌ల్లోని ఎల్‌వీ ప్రసాద్‌ ఐ హాస్పిటల్‌ క్యాంపస్‌ల్లో చేసుకోవచ్చు. **

### **పరీక్షలో చూపిన ప్రతిభతో అవకాశం లభిస్తుంది. ఈ సంస్థ వివిధ మాడ్యూళ్లలో పీజీ డిప్లొమా ఇన్‌ ఆప్టోమెట్రీ అండ్‌ విజన్‌ సైన్సెస్‌ కోర్సులను 18 నెలల వ్యవధితో అందిస్తోంది. **

### **ఆప్టోమెట్రీలో బ్యాచిలర్‌ కోర్సులు చదివినవారు వీటికి అర్హులు.\***

### **\* అమృత విశ్వవిద్యాపీఠం, కొచ్చి క్యాంపస్‌లో ఆప్టోమెట్రీ కోర్సు ఉంది. **

### **రాత పరీక్ష ఆధారంగా అడ్మిషన్‌ ఇస్తారు.\***

### **\* భారతీ విద్యాపీఠ్‌ స్కూల్‌ ఆఫ్‌ ఆప్టోమెట్రీ, పుణెలో యూజీ, పీజీలు ఉన్నాయి.\***

### **\* గీతం, విశాఖపట్నం క్యాంపస్‌లో ఆప్టోమెట్రీ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది.\***

### **\* ఆంధ్రప్రదేశ్‌లో బీ-ఆప్టోమెట్రీని కర్నూల్‌ మెడికల్‌ కాలేజీ, **

### **ఆంధ్రా మెడికల్‌ కాలేజీ, సిద్ధార్థ మెడికల్‌ కాలేజీ, కోనసీమ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌-అమలాపురం, **

### **బొల్లినేని మెడ్‌ స్కిల్స్‌ శ్రీకాకుళం (రాగోలు), జీఎస్‌ఎల్‌ పారామెడికల్‌ ఇన్‌స్టిట్యూట్స్‌-రాజమండ్రి, **

### **సమత స్కూల్‌ ఆఫ్‌ ఆప్టోమెట్రీ-విశాఖపట్నం (వేపగుంట)ల్లో అందిస్తున్నారు. **

### **ఇంటర్‌ బైపీసీ మార్కుల ఆధారంగా ప్రవేశాలుంటాయి. జులైలో ప్రకటన వెలువడుతుంది.\***

### **󠀁[OPTOMETRY COLLEGES IN INDIA 134 Optometry colleges in India offering 191 courses](https://www.collegedekho.com/para-medical/optometry-colleges-in-andhra-pradesh/)󠁿**

### **󠀁[OPTOMETRY COLLEGES IN ANDHRA PRADESH 4 Optometry colleges in Andhra Pradesh offering 4 courses](https://www.collegedekho.com/para-medical/optometry-colleges-in-andhra-pradesh/)󠁿**

### 󠀁[AP TEACHERS LATEST NEWS](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)󠁿

 *  [ NEW SA1 Science Question Papers 2026 ](https://amaravathiteacher.com/sa1-science-question-papers-2026/)
 *  [ NEW SA1 EVS Key Papers 2026 PDF Download – 3rd to 5th Class ](https://amaravathiteacher.com/sa1-evs-key-papers-2026/)
 *  [ SA1 Maths Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-maths-key-papers-2026/)
 *  [ APPSC Group 2 Notification 2026 – 720 Vacancies, Post-wise Qualifications, Age, Fee, Dates & Syllabus Apply Online ](https://amaravathiteacher.com/appsc-group-2-notification-2026-720-vacancies-apply-online/)
 *  [ SA1 Hindi Key Papers 2026 PDF Download – 6th to 10th Class ](https://amaravathiteacher.com/sa1-hindi-key-papers-2026/)
 *  [ SA1 English Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-english-key-papers-2026/)
 *  [ SA1 Key Paper 2026 ](https://amaravathiteacher.com/sa1-key-paper-2026/)
 *  [ AP CPS to OPS Conversion 2026 – GO 158 Guidelines, NIDHI Application & Annexures ](https://amaravathiteacher.com/ap-cps-to-ops-conversion-2026-go-158-guidelines-nidhi-application-annexures/)
 *  [ SA1 Telugu Key Papers 2026 PDF Download – 1st to 10th Class ](https://amaravathiteacher.com/sa1-telugu-key-papers-2026/)
 *  [ AP SA1 2026 Class 10 School Level Observers Duties – DSE Proceedings 08-11-2026 ](https://amaravathiteacher.com/ap-sa1-2026-class-10-school-level-observers-duties-dse-orders/)

[View More ](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)

### 󠀁[TEACHERS SOFTWARES](https://amaravathiteacher.com/category/teachers-softwares/)󠁿

 *  [ SMC Elections 2026 Notification Voters List Download ](https://amaravathiteacher.com/smc-elections-2026-notification-voters-list-download/)
 *  [ Income Tax Online Calculator FY 2026-27 ](https://amaravathiteacher.com/income-tax-online-calculator-fy-2026-27/)
 *  [ Student id Card Download ](https://amaravathiteacher.com/student-id-card-download/)
 *  [ AP DA Arrears Calculator 2026 ](https://amaravathiteacher.com/ap-da-arrears-calculator-2026/)
 *  [ AP New DA Salary Calculator ](https://amaravathiteacher.com/ap-new-da-salary-calculator/)
 *  [ AP EHS Hospitals List ](https://amaravathiteacher.com/ap-ehs-hospitals-list/)
 *  [ AP Teachers ID Card Download ](https://amaravathiteacher.com/ap-teachers-id-card-download/)
 *  [ Pdf Compressor Online ](https://amaravathiteacher.com/pdf-compressor-online/)
 *  [ Online image compressor ](https://amaravathiteacher.com/online-image-compressor/)
 *  [ AP Medical Reimbursement Proposal Software ](https://amaravathiteacher.com/ap-medical-reimbursement-proposal-software/)

[View More ](https://amaravathiteacher.com/category/teachers-softwares/)
