అతివకు చదువు ఉన్నత కొలువు * 29 కోర్సులకు ప్రవేశాలు * దరఖాస్తుకు మే 6 ఆఖరు * రెండు రాష్ట్రాల్లో 5 పరీక్ష కేంద్రాలు
శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో పీజీ ప్రవేశాలకు ఎస్పీఎంవీవీ పీజీసెట్-19 నోటిఫికేషన్‌ను అధికారులు విడుదల చేశారు. ప్రత్యేకంగా మహిళల కోసం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏర్పాటు చేసిన ఒకే విశ్వవిద్యాలయం కావడంతో అటు తెలంగాణ.. ఇటు ఆంధ్రప్రదేశ్ నుంచి భారీ సంఖ్యలో విద్యార్థినులు దరఖాస్తు చేసుకుంటున్నారు. పీజీ కోర్సులతోపాటు వృత్తి విద్యా కోర్సులకు మహిళా వర్సిటీ నెలవుగా మారింది. రాష్ట్ర విభజన జరిగినా ప్రవేశాలు గరిష్ఠస్థాయికి చేరాయి. ప్రవేశాల సంఖ్యకు అనుగుణంగా విద్యార్థినులకు అవసరమైన వసతులు కల్పించడానికి విశ్వవిద్యాలయం కృషి చేస్తోంది. మే 6వ తేదీని దరఖాస్తుకు చివరి తేదీగా ప్రకటించారు. విశ్వవిద్యాలయంలో ఎంబీఏ, ఎంసీఏ, ఇంజినీరింగ్, పార్మసీ, నర్సింగ్ కోర్సులతోపాటు ఎమ్మెస్సీ, ఎంఏ, ఎంకాం వంటి 50కి పైగా కోర్సులు ఉన్నాయి. కోర్సుల్లో ఎమ్మెస్సీ, ఎంఏ, ఎంకాం వంటి కోర్సులతో పాటు మొత్తం 29 కోర్సులకు సెట్ ద్వారా ప్రవేశాలను కల్పించనున్నారు. సైన్స్ కోర్సులు ఎమ్మెస్సీలో మొత్తం 15 కోర్సుల్లో ప్రవేశాలకు వర్సిటీ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
అప్లైడ్ మ్యాథమెటిక్స్,
అప్లైడ్ మైక్రోబయాలజీ,
ఇండస్ట్రియల్ మైక్రోబయాలజీ,
బయోకెమిస్ట్రీ, బయోటెక్నాలజీ,
ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఫిజిక్స్,
బాటనీ, జువాలజీ,
సెరికల్చర్,
స్టాటిస్టిక్స్,
హోమ్‌సైన్స్ ఇన్ క్లినికల్ న్యూట్రిషన్ అండ్ డైటటిక్స్, కమ్యూనిటీ హెల్త్ అండ్ న్యూట్రిషన్,
ఫుడ్ సైన్స్ అండ్ క్వాలిటీ కంట్రోల్,
హోంసైన్స్ ఇన్ హ్యూమన్ డెవలెప్‌మెంట్ అండ్ ఫ్యామిలీ స్టడీస్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఆర్ట్స్ కోర్సులు మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్‌లో మొత్తం 5 కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
ఒకేషనల్ కోర్సులు ఎం.ఒకేషనల్ ఫ్యాషన్ టెక్నాలజీ అండ్ అప్పరల్ డిజైనింగ్,
న్యూట్రిషన్ అండ్ హెల్త్‌కేర్ సైన్సెస్ కోర్సులతోపాటు ఐదు సంవత్సరాల బీఏ/ఎంఏ పబ్లిక్ పాలసీ అండ్ ఆంథ్రోపాలజీ కోర్సులో ప్రవేశాలను కూడా ప్రవేశ పరీక్ష ద్వారా భర్తీ చేయనున్నారు. విద్యార్హత ఇలా ఏదైనా డిగ్రీలో 45శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించిన మహిళా అభ్యర్థులు సైన్స్, ఆర్ట్స్ పీజీ గ్రూపుల దరఖాస్తుకు అర్హులు. దరఖాస్తు రుసుం రూ.425 చెల్లించాలి. వర్సిటీ వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్ఛు దరఖాస్తు పూర్తైన తర్వాత అభ్యర్థి మెయిల్‌కు లేదా, చరవాణి సంఖ్యకు సంక్షిప్త సందేశం వస్తుంది. మే 6న దరఖాస్తు తేదీ పూర్తయిన రెండు లేదా మూడు రోజుల్లో హాల్‌టికెట్లు వెబ్‌సైట్‌లో ఉంచుతారు. వర్సిటీ వెబ్‌సైట్‌నుంచి హాల్‌టికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్ఛు మే 19న ప్రవేశ పరీక్ష దరఖాస్తు చేసుకున్న అభ్యర్థినులకు మే 19న ప్రవేశ పరీక్ష ఉంటుంది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి అభ్యర్థులు దరఖాస్తు చేసుకుంటున్న నేపథ్యంలో అభ్యర్థుల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని రెండు తెలుగు రాష్ట్రాల్లో 5 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. తిరుపతి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం తో పాటు
కర్నూలు,
హైదరాబాదు,
విజయవాడ,
విశాఖపట్టణం కేంద్రాల్లో ప్రవేశ పరీక్ష జరుగుతుంది.
Online application Starts from:22-03-2019
Last Date for submission of online and downloaded filled-in Application is 06-05-2019
Steps to be followed in filling ONLINE SPMVVDOA 2019 application form Online Application form filling process 1. The Online Application for SPMVVDOA – 2019 is available at website http://spmvvdoa.in 2. When you fill Online Application, you should have the following necessities with you. (a) Your Mobile Phone. (b) SPMVVDOA – 2019 Information Brochure. (c) Your documents pertaining to your personal details and academic records. (d) Softcopy of scanned passport photo and signature. 3. Open the website http://spmvvdoa.in from your browser(Internet Explorer / Chrome / Firefox). 4. Click on the link appearing as Click here to register for SPMVVDOA – 2019 Online Application. 5. After clicking the required link, you will get a detailed menu options screen. 6. Before proceeding to fill the application, please download and read the Admission 7. Click on Online Registration button appearing on top menu. 8. Select the Test Name(s) you to appear, degree passed/appearing and fill the required details with elective subjects, then you will find the list of eligible and not-eligible courses. 9. Then proceed to fill the Name and other personal details with present address and date of birth. Please fill the details as per SSC or equivalent certificate. 10. While entering the personal details, please give your correct MOBILE number and EMAIL address, because all the correspondence from Admission Authority (DOA) will be made to Mobile and Email only, No postal correspondence will be made under any circumstances. 11. After completion of registration details entry, your Mobile will receive SMS of a Security Code, please type the Security Code in the box provided in the Registration Form and immediately your screen will display a message as “VERIFIED” in green color. 12. Then click “Register & Proceed” button for filling the application with all academic and other details along with scanned Passport Photo and Scanned Signature (signed on white paper only). 13. Fill the entire Academic, Study, Reservation and other Personal Details and submit the application. Select the terms and conditions box, click the preview button. Now it displays the application preview. There it gives two buttons one for “Back-To-Edit” for Editing any mistakes done by you, Save and Print for continuing the application. Now it generates the Acknowledgement Receipt, Take the printout and pay the fee by online using SBI Collect. After payment of fee in bank, you will get a mail with all the details submitted by online as a PDF file. You have to take a printout of the same and retain the same until completion of admission.