PAN-card-free-with-in-10-minutes-new-services-started
PAN-card-free-with-in-10-minutes-new-services-started
PAN Card: 10 నిమిషాల్లో ఉచితంగా పాన్ కార్డ్… కొత్త సర్వీస్ ప్రారంభించిన కేంద్రం*
*ఈ ఫెసిలిటీ ద్వారా కేవలం 10 నిమిషాల్లో పాన్ కార్డు తీసుకోవచ్చు.
ఇందుకోసం మీ ఆధార్ నెంబర్ వెల్లడిస్తే చాలు. 10 నిమిషాల్లో పాన్ కార్డ్ జారీ అవుతుంది.*
*ఇప్పటివరకు పాన్ నెంబర్ లేనివారు మాత్రమే ఇన్‌స్టంట్ పాన్ కార్డు తీసుకోవచ్చు.
గతంలో పాన్ కార్డు తీసుకున్నవారు మళ్లీ ఇన్‌స్టంట్ పాన్ కార్డు తీసుకోవాల్సిన అవసరం లేదు.*
*ఇన్‌స్టంట్ పాన్ కార్డు తీసుకోవాలంటే ఆధార్ నెంబర్‌కు తప్పనిసరిగా మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండాలి.*
*ఆధార్ కార్డులో పుట్టిన తేదీ, నెల, సంవత్సరం లాంటి వివరాలు పూర్తిగా ఉండాలి.
మైనర్లు ఇన్‌స్టంట్ ఇ-పాన్ కార్డు తీసుకోలేరు*
* ముందుగా ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ ఇ-ఫైలింగ్ పోర్టల్ ఓపెన్ చేయండి.*
*ఎడమవైపు Quick Links కింద Instant PAN through Aadhaar లింక్‌పైన క్లిక్ చేయండి.*
*కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో Get New PAN ట్యాబ్ పైన క్లిక్ చేయండి.*
*మీ ఆధార్ నెంబర్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి Generate Aadhaar OTP పైన క్లిక్ చేయండి.*
*మీ ఆధార్ నెంబర్‌కు లింక్ అయిన మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది.*
*ఓటీపీ ఎంటర్ చేసి మీ ఆధార్ వివరాలు సరిచూసుకోవాలి.*
*మీ ఇమెయిల్ ఐడీ ఎంటర్ చేయాలి.*
*సబ్మిట్ చేసిన తర్వాత 15 అంకెల అక్నాలెడ్జ్‌మెంట్ నెంబర్ జనరేట్ అవుతుంది.*
*వెరిఫికేషన్ పూర్తైన తర్వాత పాన్ కార్డు జారీ అవుతుంది.*
*యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా-UIDAI దగ్గర రిజిస్టర్ అయిన మీ ఆధార్ వివరాల ద్వారా మీకు పాన్ కార్డును జారీ చేస్తుంది ఆదాయపు పన్ను శాఖ.*
*ఈ ప్రాసెస్ మొత్తం 10 నిమిషాల్లో పూర్తవుతుంది.*
*Check Status/ Download PAN పైన క్లిక్ చేసి మీ ఇ-పాన్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.*
*మీ ఇ-పాన్ కార్డు పీడీఎఫ్ ఫార్మాట్‌లో మీ ఇమెయిల్ ఐడీకి వస్తుంది.*
*ఇప్పటివరకు పాన్ కార్డు లేనివాళ్లు ఉచితంగా ఇన్‌స్టంట్ పాన్ కార్డు తీసుకోవచ్చు.*
*2020 ఫిబ్రవరి 12న ప్రయోగాత్మకంగా ఇన్‌స్టంట్ పాన్ కార్డు సేవలు ప్రారంభమయ్యాయి.*
*2020 మే 25 వరకు 6,77,680 పాన్ కార్డులు జారీ అయ్యాయని అంచనా*
error: Content is protected !!