pay-your-LIC-Primeum-with-PAYTM-mobile-app-online

pay-your-LIC-Primeum-with-PAYTM-mobile-app-online

LIC: మీ ఎల్ఐసీ ప్రీమియం పేటీఎంలో ఈజీగా కట్టండి ఇలా

లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా-LIC ప్రీమియంలు చెల్లించడానికి అనేక ఆప్షన్స్ ఇస్తోంది. ఆఫ్‌లైన్‌లోనే కాదు… ఆన్‌లైన్‌లో కూడా సులువుగా ప్రీమియం చెల్లించొచ్చు.

పేటీఎంలో ఎల్ఐసీ ప్రీమియం ఎలా చెల్లించాలో తెలుసుకోండి.

1. మీరు ఎల్ఐసీ ప్రీమియం కట్టలేదా?

ఎల్ఐసీ ఆఫీస్‌కు వెళ్లి ప్రీమియం చెల్లించే టైమ్ లేదా?

మీ ఫోన్‌లో పేటీఎం యాప్ ఉంటే చాలు.

ఈజీగా ఎల్ఐసీ ప్రీమియం చెల్లించొచ్చు.

పేటీఎంలో మొబైల్ రీఛార్జ్‌లు, పోస్ట్ పెయిడ్ బిల్ పేమెంట్స్, సినిమా టికెట్ల బుకింగ్, ఎలక్ట్రిసిటీ బిల్ చెల్లింపులు… ఇలా అనేక లావాదేవీలు జరపొచ్చు

2. వీటితో పాటు బీమా సంస్థల ప్రీమియంలు కూడా సులువుగా చెల్లించొచ్చు.

ఇందుకోసం చాలా రోజుల క్రితమే లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా-LIC సంస్థతో పేటీఎం ఒప్పందం కుదుర్చుకుంది.

పేటీఎం యాప్ లేదా వెబ్‌సైట్‌లో మీరు ఎప్పుడైనా ఎల్ఐసీ ప్రీమియం చెల్లించొచ్చు.

ఎలాగో తెలుసుకోండి

3. ముందుగా మీ స్మార్ట్‌ఫోన్‌లో పేటీఎం యాప్ ఓపెన్ చేయండి.

రీఛార్జ్ అండ్ బిల్ పేమెంట్ సెక్షన్‌లో ఎల్ఐసీ ట్యాబ్ పైన క్లిక్ చేయండి.

ఎల్ఐసీ పాలసీ నెంబర్ ఎంటర్ చేయండి.

గెట్ ప్రీమియం పైన క్లిక్ చేస్తే మీ పాలసీ వివరాలు వస్తాయి

4. మీ పాలసీ నెంబర్, పేరు, ప్రీమియం డ్యూ డేట్, ఇన్‌స్టాల్‌మెంట్ నెంబర్, ప్రీమియం మొత్తం లాంటి వివరాలన్నీ సరిచూసుకోండి.

ఒకవేళ ఏదైనా క్యాష్‌బ్యాక్ ఆఫర్ ఉంటే ప్రోమో కోడ్ అప్లై చేయడం మర్చిపోవద్దు.

ఆ తర్వాత పేమెంట్ చేయండి

5. పేమెంట్ సమయంలో మీ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ ఎంచుకోవచ్చు.

ప్రీమియం చెల్లించిన తర్వాత మీ రిజిస్టర్డ్ ఇమెయిల్ ఐడీకి, మొబైల్ నెంబర్‌కు మెసేజ్ వస్తుంది. ఆ వివరాలను భద్రపర్చుకోవాలి

PAYTM MOBILE APP IN GOOGLE PLAYSTORE CLICK HERE

error: Content is protected !!