# Polytechnic Common Entrance Test -2020-notification-model-papers

- Link: https://amaravathiteacher.com/polytechnic-common-entrance-test-2020-notification-model-papers/
- Published: 2020-04-01T16:41:37+05:30
- Author: amaravathiteacher

## **Polytechnic Common Entrance Test -2020-notification-model-papers**

### **27న పాలిసెట్-2020 పరీక్ష.**

### **పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన పాలిసెట్ – 2020 ప్రవేశ పరీక్ష ఈ నెల 27న నిర్వహించనున్నారు. **

### **వారం రోజుల ముందు హాల్ టికెట్లను ఆన్లైన్లో అందుబాటులో ఉంచుతారు.**

### **ఈ నెల 25న పరీక్ష నిర్వహణకు సాంకేతిక విద్యాశాఖ నిర్ణయించినా, సచివాలయ పరీక్షల నేపథ్యంలో మళ్లీ 27కి మార్పు చేశారు.**

### **POLYCET-2020 మోడల్ పేపర్లు & ప్రీవియస్ పేపర్లు**

### **టెన్త్‌ తర్వాత****? ****పాలిటెక్నిక్‌ కోర్సులు**

### ** ****తెలుగు రాష్ట్రాల్లో పాలీసెట్ ప్ర‌క‌ట‌న‌లు**

### **పదో తరగతి పూర్తవగానే ఇంజినీరింగ్‌ కోర్సుల్లో చేరే అవకాశాన్ని పాలీసెట్‌ కల్పిస్తోంది. ఉద్యోగంలో త్వరగా స్థిరపడాలనుకునే వారికి ఇది చక్కని దారి. **

### **ర్యాంకు సాధించి పాలిటెక్నిక్‌ కోర్సులో చేరితే చదువుకుంటూనే ప్రాక్టికల్‌గా నేర్చుకోవచ్చు. **

### **ఈ డిప్లొమా అందుకున్న వెంటనే కొన్ని రకాల కొలువుల్లో చేరేందుకు అర్హత లభిస్తుంది. **

### **ఈ ఎంట్రన్స్‌ల్లో ఎక్కువ మార్కులు తెచ్చుకుంటే మెరుగైన కళాశాలలో సీటు పొంది****, ****సాంకేతిక కెరియర్‌కు మేలైన బాట వేసుకోవచ్చు!**

### **హైస్కూలు స్థాయి నుంచే నేటితరానికి కెరియర్‌పై కచ్చితమైన ప్రణాళికలు ఉంటున్నాయి. **

### **టెక్నాలజీలపై పట్టు పెంచుకోవడం****, ****వేగంగా స్థిరపడటం లక్ష్యంగా సాగుతున్నారు. **

### **అందుకే కొత్త రంగాల ఆవిర్భావం****, ****వాటికి సంబంధించి వస్తున్న స్పెషలైజేషన్లు****, ****అందుబాటులోకి వస్తున్న కొత్త కోర్సులపై దృష్టిసారిస్తున్నారు.**

### **󠀁[AP POLYCET-2020 NOTIFICATION DETAILS](https://polycetap.nic.in/Booklet_Polycet.pdf)󠁿**

### **󠀁[POLYCET – 2020 BOOKLET DOWNLOAD](https://polycetap.nic.in/Booklet_Polycet.pdf)󠁿**

### **󠀁[MATHS ONLINE TESTS 10TH CLASS CHAPTER WISE ](https://amaravathiteacher.com/10th-class-maths-online-bit-exams-chapter-wise-new-cce-model/)󠁿**

### **󠀁[PHYSICAL SCIENCE (PHYSICS & CHEMISTRY) ONLINE TESTS CHAPTER WISE ](https://amaravathiteacher.com/10th-class-physical-science-online-test-new-cce-model-2020/)󠁿**

### **󠀁[POLYCET-2020 APPLICATION FORM](https://polycetap.nic.in/APpolycet_applicationform.pdf)󠁿**

### **మూస ధోరణిలో కాకుండా కొత్త దారుల్లో కెరియర్‌ను మలచుకోవాలనుకుంటున్న వారూ ఉన్నారు. **

### **అలాంటి వారికి అనుకూలమైనవి పాలిటెక్నిక్‌ డిప్లొమా కోర్సులు.**

### **పదో తరగతి విద్యార్హతతో ఎన్నో డిప్లొమా/ పాలిటెక్నిక్‌ కోర్సుల్లో ప్రవేశం పొందవచ్చు. **

### **పది తర్వాత అప్లైడ్‌ సైన్స్‌/ టెక్నికల్‌ సబ్జెక్టులను అభ్యసించాలనుకునేవారు వీటిని ఎంచుకోవచ్చు. ఇవి ఉద్యోగాధారిత కోర్సులు. **

### **పూర్తిచేయగానే సంబంధిత పరిశ్రమల్లో ఉద్యోగం సాధించుకునే విధంగా సిలబస్‌ ఉంటుంది. **

### **టెక్నికల్‌ డిప్లొమా ప్రోగ్రాముల్లో ఇంజినీరింగ్‌ అంశాలుంటాయి.**

### ** అందుకే వీటిని డిప్లొమా ఇన్‌ ఇంజినీరింగ్‌గా వ్యవహరిస్తారు. **

### **సాధారణంగా కోర్సుల కాలవ్యవధి మూడేళ్లు. **

### **కొన్నింటికి మూడున్నరేళ్లు. సెమిస్టర్‌ విధానంలో నిర్వహిస్తారు. **

### **కోర్సుల కాలవ్యవధిని బట్టి ఆరు నెలల వరకు పారిశ్రామిక శిక్షణ ఉంటుంది.**

### **కోర్సులు.. ప్రవేశం****మనదేశంలో పాలిటెక్నిక్‌ కోర్సులకు పరిధి, గిరాకీ ఎక్కువ. ఎన్నో ఉత్తమ కళాశాలలు ఈ కోర్సులను అందిస్తున్నాయి.

### **పాలిటెక్నిక్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (పాలీసెట్‌) ద్వారా వీటిల్లోకి ప్రవేశాన్ని పొందవచ్చు. **

### **పదో తరగతి లేదా బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ గుర్తింపు పొందిన తత్సమాన కోర్సు (సీబీఎస్‌ఈ****, ****ఐసీఎస్‌ఈ****, ****ఎన్‌ఐఓఎస్‌****, ****టీఓఎస్‌ఎస్‌****, ****ఏపీఓఎస్‌ఎస్‌ వంటివి) పూర్తిచేసి ఉండాలి. **

### **ప్రస్తుతం పదో తరగతి పరీక్షలు రాస్తున్నవారూ దరఖాస్తు చేసుకోవచ్చు.**

### **పరీక్ష విధానం**

### **ఏపీ పాలీసెట్‌: **

### **వ్యవధి రెండు గంటలు. ప్రశ్నపత్రం 120 మార్కులకు ఉంటుంది. **

### **మేథమేటిక్స్‌ నుంచి 60, ఫిజిక్స్‌, కెమిస్ట్రీల్లో ప్రతి విభాగం నుంచి 30 చొప్పున ప్రశ్నలు వస్తాయి.**

### ** ప్రశ్నలన్నీ మల్టిపుల్‌ చాయిస్‌ విధానంలో ఉంటాయి. రుణాత్మక మార్కులు లేవు.**

### **ప్రత్యేకత ఏమిటి?**⏎ **\* పాలిటెక్నిక్‌లో ‘చేయడం ద్వారా నేర్చుకోవడం’పై ప్రధాన దృష్టి ఉంటుంది. **

### **అందులో భాగంగానే సాంకేతికాంశాలను థియరీ విధానంలో బోధించడంతోపాటు ప్రాక్టికల్‌ పరిజ్ఞానానికీ సమ ప్రాధాన్యం ఇస్తారు.**

### **ఎలా సన్నద్ధమవ్వాలి?**⏎ **ప్రవేశపరీక్షలో అడిగే ప్రశ్నలన్నీ దాదాపుగా 9, 10 తరగతుల నుంచే వస్తాయి. **

### **ముఖ్యంగా ప్రశ్నలన్నీ మేథ్స్‌, సైన్స్‌ సబ్జెక్టులకు చెందినవే. **

### **పదో తరగతి తుది పరీక్షల తర్వాతే ఈ పరీక్ష ఉంటుంది. **

### **విద్యార్థులు అప్పటికే సిలబస్‌ పూర్తి చేసి ఉంటారు. **

### **కాబట్టి, ముందుగా ప్రవేశపరీక్ష సిలబస్‌ను సేకరించి పెట్టుకోవాలి. **

### **దాని ఆధారంగా సన్నద్ధత ప్రారంభించాలి.**

### **󠀁[APRJC 2020 NOTIFICATION AND MODEL PAPERS CLICK HERE](https://amaravathiteacher.com/aprjc-aprdc-2020-notification-official-website-complete-details/)󠁿**

### **󠀁[AP POYCET-2020 OFFICIAL WEBSITE](https://polycetap.nic.in/Default.aspx)󠁿**

### **అకడమిక్‌ పరీక్షల తరహాలో కష్టపడితే చాలదు. తెలివిగా చదవడంపైనా దృష్టిపెట్టాలి.**

### ** ప్రశ్నలు మల్టిపుల్‌ చాయిస్‌ విధానంలో ఉంటాయని కేవలం ఆ తరహా మెటీరియల్‌పైనే ఆధారపడకూడదు. **

### **ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలు చదవడం మేలు. కాన్సెప్టులు నేర్చుకుంటే ప్రశ్న ఏవిధంగా వచ్చినా జవాబు గుర్తించడం సులువవుతుంది. **

### **కాబట్టి, సిలబస్‌లోని ప్రతి టాపిక్‌లో ప్రాథమికాంశాలకు ఎక్కువ ప్రాధాన్యమిచ్చి చదవాలి. **

### **ఆపై మాదిరి ప్రశ్నపత్రాలను సాధించడంపై దృష్టిపెట్టాలి. **

### **ఎంత ఎక్కువ సాధనచేస్తే అంతమంచిది. **

### **గత ప్రశ్నపత్రాలు పాలీసెట్‌ అధికారిక వెబ్‌సైట్లలో ఉంటాయి.**

### **󠀁[POLYTECHNIC ENTRANCE 2017 QUESTION PAPER & KEY PAPERS](https://drive.google.com/file/d/15I8qxbdhJkSylGaY3BFoCE6ECH7URr7a/view?usp=sharing)󠁿**

### **󠀁[AP](https://drive.google.com/file/d/1socmoUD_6A4JmQDeKlNMAExUa3QgywVs/view?usp=sharing)󠁿**󠀁[ P](https://drive.google.com/file/d/1socmoUD_6A4JmQDeKlNMAExUa3QgywVs/view?usp=sharing)󠁿󠀁[OLYCET-2014](https://drive.google.com/file/d/1socmoUD_6A4JmQDeKlNMAExUa3QgywVs/view?usp=sharing)󠁿**󠀁[ QUESTION PAPER & KEY PAPERS](https://drive.google.com/file/d/1socmoUD_6A4JmQDeKlNMAExUa3QgywVs/view?usp=sharing)󠁿**

### **తక్కువ వ్యవధి: వృత్తి విద్యా కోర్సులను పూర్తిచేసి త్వరగా ఉద్యోగంలో చేరాలనుకునేవారికి ఇవి అనుకూలం. ఉద్యోగం చేస్తూ ఉన్నతవిద్యను కొనసాగించవచ్చు. **

### **లేదా లేటరల్‌ ఎంట్రీ ద్వారా ఇంజినీరింగ్‌ రెండో ఏడాదిలోకి నేరుగా ప్రవేశం పొందవచ్చు.**

### **ప్రాక్టికల్‌ పరిజ్ఞానం: పాలిటెక్నిక్‌ కోర్సుల్లో థియరీ కంటే ప్రాక్టికల్‌ పరిజ్ఞానానికి ప్రాధాన్యం ఎక్కువ.**

### ** ఇంటర్మీడియట్‌ విద్యార్థితో పోలిస్తే పాలిటెక్నిక్‌ విద్యార్థి సాంకేతిక పరిజ్ఞానం ఎక్కువ.**⏎ **ఫీజు తక్కువ: బీటెక్, బీఈ, ఇతర డిగ్రీ కోర్సుల కంటే ఈ కోర్సుల ఫీజు అందరికీ అందుబాటులో ఉంటుంది.****విభాగం మార్చుకునే వీలు: పాలిటెక్నిక్‌ కోర్సుల్లో ఉన్న లాభదాయకమైన అంశమిది. కోర్సు పూర్తయ్యాక భవిష్యత్తులో చదువు కొనసాగించాలనుకుంటే రంగాన్ని మార్చుకునే వీలుంది. **

### **కోర్సు పూర్తయ్యేనాటికి సంబంధిత సబ్జెక్టుల్లో అవగాహన, ప్రాక్టికల్‌ పరిజ్ఞానం పరంగా ఇతరుల కంటే ముందుంటారు.**⏎ **ఉద్యోగం/ వ్యాపారం: మూడేళ్ల డిప్లొమాను పూర్తిచేయడం ద్వారా సంబంధిత ఉద్యోగాలను అందుకోవచ్చు. **

### **పీఎస్‌యూలు, ప్రభుత్వ అనుబంధ సంస్థల్లో డిప్లొమా హోల్డర్లకు అవకాశాలుంటాయి. **

### **వీరిని జూనియర్‌ స్థాయి, టెక్నీషియన్‌ హోదాల్లోకి తీసుకుంటారు. **

### **రైల్వే, గెయిల్, ఓఎన్‌జీసీ, డీఆర్‌డీఓ, బెల్, ఎన్‌టీపీసీ మొదలైనవి వీరిని నియమించుకుంటున్నవాటిలో ప్రధానమైనవి. ప్రైవేటు ఎయిర్‌లైన్స్, కన్‌స్ట్రక్షన్, కమ్యూనికేషన్, ఆటోమొబైల్స్‌ సంస్థలూ వీరికి అవకాశాలు కల్పిస్తున్నాయి. **

### **కోర్సులన్నీ ప్రాక్టికల్‌/ అప్లికేషన్‌ ఓరియెంటెడ్‌గా ఉంటాయి. **

### **కాబట్టి తమ రంగంలో సొంతంగా వ్యాపారాన్నీ ప్రారంభించుకోవచ్చు.**

### **󠀁[AP POLYCET-2018 QUESTION PAPER & KEY PAPERS](https://drive.google.com/file/d/1mzz6PopLlzusSbfXna5WQ7AxuuVIR7Wn/view?usp=sharing)󠁿**

### **󠀁[AP POLYCET-2019 QUESTION PAPER & KEY PAPERS](https://drive.google.com/file/d/1I1flReFsv8kzi3pGaQaH_SXxnDFDtLKn/view?usp=sharing)󠁿**

### **󠀁[PRINT YOUR HALLTICKET AND DOWNLOAD LINK](https://polycetap.nic.in/Default.aspx)󠁿**

### **ఆన్‌లైన్‌లో**** ****లేదా ఆన్‌లైన్‌/ హెల్ప్‌లైన్‌ సెంటర్లలో దరఖాస్తు చేసుకోవచ్చు. **

### **ఫీజు రూ.****400. ****దరఖాస్తుకు చివరి తేదీ:**** September 3rd.**

### **󠀁[AP POLYCET-2020 ONLINE APPLICATION ](https://polycetap.nic.in/Default.aspx)󠁿**

### **󠀁[ONLINE FEES PAYMENT LINK](https://polycetap.nic.in/Default.aspx)󠁿**

### **󠀁[AP POLYCET-2020 OFFICIAL WEBSITE ](https://polycetap.nic.in/Default.aspx)󠁿**

### **󠀁[AP POLYCET QUESTION PAPERS WITH KEY PAPERS PDF ](https://sakshieducation.com/PreviousPapers/Prevlist.aspx?cid=6&sid=150&chid=162&tid=0)󠁿**

### **󠀁[AP POLYCET QUESTION PAPERS WITH KEY PAPERS PDF ](http://www.eenadupratibha.net/pratibha/onlinedesk/previous_papers/polycet.html)󠁿**

### 󠀁[AP TEACHERS LATEST NEWS](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)󠁿

 *  [ NEW AP Special TET Results 2026 Released – Check Marks & Download Scorecard ](https://amaravathiteacher.com/ap-special-tet-results-2026/)
 *  [ NEW SA1 Science Key Paper 2026 ](https://amaravathiteacher.com/sa1-science-key-paper-2026/)
 *  [ NEW SA1 Physics Key Papers 2026–27 PDF Download – 8th to 10th Class ](https://amaravathiteacher.com/sa1-physics-key-papers-2026/)
 *  [ SA1 Science Question Papers 2026 ](https://amaravathiteacher.com/sa1-science-question-papers-2026/)
 *  [ SA1 EVS Key Papers 2026 PDF Download – 3rd to 5th Class ](https://amaravathiteacher.com/sa1-evs-key-papers-2026/)
 *  [ SA1 Maths Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-maths-key-papers-2026/)
 *  [ APPSC Group 2 Notification 2026 – 720 Vacancies, Post-wise Qualifications, Age, Fee, Dates & Syllabus Apply Online ](https://amaravathiteacher.com/appsc-group-2-notification-2026-720-vacancies-apply-online/)
 *  [ SA1 Hindi Key Papers 2026 PDF Download – 6th to 10th Class ](https://amaravathiteacher.com/sa1-hindi-key-papers-2026/)
 *  [ SA1 English Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-english-key-papers-2026/)
 *  [ SA1 Key Paper 2026 ](https://amaravathiteacher.com/sa1-key-paper-2026/)

[View More ](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)

### 󠀁[TEACHERS SOFTWARES](https://amaravathiteacher.com/category/teachers-softwares/)󠁿

 *  [ SMC Elections 2026 Notification Voters List Download ](https://amaravathiteacher.com/smc-elections-2026-notification-voters-list-download/)
 *  [ Income Tax Online Calculator FY 2026-27 ](https://amaravathiteacher.com/income-tax-online-calculator-fy-2026-27/)
 *  [ Student id Card Download ](https://amaravathiteacher.com/student-id-card-download/)
 *  [ AP DA Arrears Calculator 2026 ](https://amaravathiteacher.com/ap-da-arrears-calculator-2026/)
 *  [ AP New DA Salary Calculator ](https://amaravathiteacher.com/ap-new-da-salary-calculator/)
 *  [ AP EHS Hospitals List ](https://amaravathiteacher.com/ap-ehs-hospitals-list/)
 *  [ AP Teachers ID Card Download ](https://amaravathiteacher.com/ap-teachers-id-card-download/)
 *  [ Pdf Compressor Online ](https://amaravathiteacher.com/pdf-compressor-online/)
 *  [ Online image compressor ](https://amaravathiteacher.com/online-image-compressor/)
 *  [ AP Medical Reimbursement Proposal Software ](https://amaravathiteacher.com/ap-medical-reimbursement-proposal-software/)

[View More ](https://amaravathiteacher.com/category/teachers-softwares/)
