polytechnic-common-entrance-test-study-material-online-tests-model-papers
polytechnic-common-entrance-test-study-material-online-tests-model-papers
27న పాలిసెట్-2020 పరీక్ష.
పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన పాలిసెట్ – 2020 ప్రవేశ పరీక్ష ఈ నెల 27న నిర్వహించనున్నారు.
వారం రోజుల ముందు హాల్ టికెట్లను ఆన్లైన్లో అందుబాటులో ఉంచుతారు.
ఈ నెల 25న పరీక్ష నిర్వహణకు సాంకేతిక విద్యాశాఖ నిర్ణయించినా, సచివాలయ పరీక్షల నేపథ్యంలో మళ్లీ 27కి మార్పు చేశారు.
POLYCET-2020 మోడల్ పేపర్లు & ప్రీవియస్ పేపర్లు
టెన్త్ తర్వాత? పాలిటెక్నిక్ కోర్సులు
పదో తరగతి పూర్తవగానే ఇంజినీరింగ్ కోర్సుల్లో చేరే అవకాశాన్ని పాలీసెట్ కల్పిస్తోంది. ఉద్యోగంలో త్వరగా స్థిరపడాలనుకునే వారికి ఇది చక్కని దారి.
ర్యాంకు సాధించి పాలిటెక్నిక్ కోర్సులో చేరితే చదువుకుంటూనే ప్రాక్టికల్‌గా నేర్చుకోవచ్చు.
ఈ డిప్లొమా అందుకున్న వెంటనే కొన్ని రకాల కొలువుల్లో చేరేందుకు అర్హత లభిస్తుంది.
ఈ ఎంట్రన్స్‌ల్లో ఎక్కువ మార్కులు తెచ్చుకుంటే మెరుగైన కళాశాలలో సీటు పొంది, సాంకేతిక కెరియర్‌కు మేలైన బాట వేసుకోవచ్చు!
హైస్కూలు స్థాయి నుంచే నేటితరానికి కెరియర్‌పై కచ్చితమైన ప్రణాళికలు ఉంటున్నాయి.
టెక్నాలజీలపై పట్టు పెంచుకోవడం, వేగంగా స్థిరపడటం లక్ష్యంగా సాగుతున్నారు.
అందుకే కొత్త రంగాల ఆవిర్భావం, వాటికి సంబంధించి వస్తున్న స్పెషలైజేషన్లు, అందుబాటులోకి వస్తున్న కొత్త కోర్సులపై దృష్టిసారిస్తున్నారు.
పరీక్ష విధానం
ఏపీ పాలీసెట్:
వ్యవధి రెండు గంటలు. ప్రశ్నపత్రం 120 మార్కులకు ఉంటుంది.
మేథమేటిక్స్ నుంచి 60, ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో ప్రతి విభాగం నుంచి 30 చొప్పున ప్రశ్నలు వస్తాయి.
ప్రశ్నలన్నీ మల్టిపుల్ చాయిస్ విధానంలో ఉంటాయి. రుణాత్మక మార్కులు లేవు.
ఎలా సన్నద్ధమవ్వాలి?
ప్రవేశపరీక్షలో అడిగే ప్రశ్నలన్నీ దాదాపుగా 9, 10 తరగతుల నుంచే వస్తాయి.
ముఖ్యంగా ప్రశ్నలన్నీ మేథ్స్, సైన్స్ సబ్జెక్టులకు చెందినవే.
పదో తరగతి తుది పరీక్షల తర్వాతే ఈ పరీక్ష ఉంటుంది.
అకడమిక్ పరీక్షల తరహాలో కష్టపడితే చాలదు. తెలివిగా చదవడంపైనా దృష్టిపెట్టాలి.
ప్రశ్నలు మల్టిపుల్ చాయిస్ విధానంలో ఉంటాయని కేవలం ఆ తరహా మెటీరియల్‌పైనే ఆధారపడకూడదు.
ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలు చదవడం మేలు. కాన్సెప్టులు నేర్చుకుంటే ప్రశ్న ఏవిధంగా వచ్చినా జవాబు గుర్తించడం సులువవుతుంది.
కాబట్టి, సిలబస్‌లోని ప్రతి టాపిక్‌లో ప్రాథమికాంశాలకు ఎక్కువ ప్రాధాన్యమిచ్చి చదవాలి.
ఆపై మాదిరి ప్రశ్నపత్రాలను సాధించడంపై దృష్టిపెట్టాలి.
ఎంత ఎక్కువ సాధనచేస్తే అంతమంచిది.
గత ప్రశ్నపత్రాలు పాలీసెట్ అధికారిక వెబ్‌సైట్లలో ఉంటాయి.
ఇవీ ప్రయోజనాలు!
error: Content is protected !!