posts-names-change-Grama-sachivalayam-jobs-ap
పేర్లు మారిన ‘సచివాలయ’ పోస్టులు.. ఉత్తర్వులు జారీ
అక్టోబరు 2న ఏపీలో సచివాలయ వ్యవస్థ ప్రారంభమైన సంగతి తెలిసిందే.
మొదటి విడతలో రాష్ట్రవ్యాప్తంగా 1,254 సచివాలయాలు ప్రారంభించారు.
వీటిలో 1,138 గ్రామ సచివాలయాలు, 116 వార్డు సచివాలయాలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి.
సాంకేతిక, న్యాయపరమైన సమస్యలు తలెత్తకుండా పోస్టుల పేర్లలో మార్పు
9 పోస్టుల పేర్లను మారుస్తూ ఉత్వర్వులు జారీచేసిన ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్లో అక్టోబరు 2 నుంచి అమల్లోకి వచ్చిన గ్రామ సచివాలయాలకు సంబంధించి ప్రభుత్వం సెప్టెంబరు 4న కీలక నిర్ణయం తీసుకుంది.
గ్రామసచివాయాల్లోని 14 విభాగాలకు సంబంధించిన పోస్టుల్లో 9 పోస్టుల పేర్లను మారుస్తూ.. ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసింది.
ఉద్యోగాలకు సంబంధించి ఎలాంటి సాంకేతిక, న్యాయపరమైన సమస్యలు తలెత్తకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
మార్పులు ఇవే..
గతంలో పేర్కొన్న పోస్టు |
మారిన పోస్టు పేరు |
పంచాయతీ కార్యదర్శి |
పంచాయతీ కార్యదర్శి (గ్రేడ్-5) |
వీఆర్వో |
గ్రామ రెవెన్యూ అధికారి(గ్రేడ్-2) |
సర్వేయర్ అసిస్టెంట్ |
గ్రామ సర్వేయర్(గ్రేడ్-2) |
ఏఎన్ఎమ్ |
ఏఎన్ఎమ్ గ్రేడ్-3 |
మహిళా పోలీస్, మహిళా శిశు సంక్షేమ సహాయకురాలి |
గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శి |
అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ |
విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ |
హార్టికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ |
విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ |
సెరికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ |
విలేజ్ సెరికల్చర్ అసిస్టెంట్ |
డిజిటల్ అసిస్టెంట్ |
పంచాయతీ కార్యదర్శి గ్రేడ్-6 డిజిటల్ అసిస్టెంట్ |
AP TEACHERS LATEST UPDATES PRC – DA – FORMATIVE ASSESSMENT EXAM,, SUMMETIVE ASSESMENT EXAMS MODEL PAPERS, PROJECTS, PREVIOUS PAPERS, TEACHERS PAY BILL SOFTWARE, MEDICAL REIMBURSEMENT, ZPPF SLIPS, ZPPF SOFTWARE, APGLI ANNUAL SLIPS,
