prime-minister-pm-vidya-lakshmi-education-loan-scheme

prime-minister-pm-vidya-lakshmi-education-loan-scheme

prime-minister-pm-vidya-lakshmi-education-loan-scheme

విద్యాలక్ష్మి పథకం ద్వారా ఉన్నత చదువుకు చేయూత*

PM Vidyalakshmi Scheme: స్డూడెంట్స్‌కు మోదీప్రభుత్వం బంపర్ ఆఫర్..డబ్బుల్లేవని చింత వద్దు…

కేంద్ర ప్రభుత్వం PM Vidyalakshmi Scheme కింద ఇప్పుడు విద్యార్థులకు చదువుకోవడానికి స్కాలర్‌షిప్‌లు, విద్యా రుణాలు ఇస్తోంది.

గతంలో విద్యారుణం పొందాలంటే బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు.. సిఫార్సులు.. ఆస్తిపాస్తులు లేదా ఉద్యోగ పూచీకత్తులు సమర్పించాల్సిన దుస్థితి. ఇప్పుడు అవేమీ అక్కర్లేదు.

చదువుకు సంబంధించిన వివరాలు వాస్తవికతతో ఉంటే చాలు ఇంటి వద్దకే రుణం వచ్చేస్తుంది. ఇంటర్‌ నుంచి పీజీ వరకు చదువుకునే విద్యార్థులు రుణం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. పేద, మధ్య తరగతి వర్గాలకు ఉన్నత విద్య అందించాలనే సదుద్ధేశంతో ప్రభుత్వం విద్యాలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టింది.

2015-16లో కేంద్ర బడ్జెట్లో నిధులు కేటాయించారు. అప్పటి నుంచి ఏటా కేటాయింపులు జరుగుతున్నాయి.

అయితే అవగాహన లేమితో చాలామంది ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు. విద్యారుణం పొందాలంటే బ్యాంకుల చుట్టూ తిరగాలనే అపోహ విద్యార్థుల్లో ఉంది.

కానీ ఆ అవసరం లేకుండా ఇంట్లో నుంచే దరఖాస్తు చేసుకొని రుణంపొందే అవకాశం ఈ పథకం ద్వారా ఉంది.

ప్రతిభావంతులైన పేద విద్యార్థులు ఆర్థిక స్థోమతా లేకున్నా చదువు కొనసాగించవచ్చు.

కేంద్ర ఆర్థిక శాఖ, మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ, ఇండియన్‌ బ్యాంక్‌ అసోసియేషన్‌(ఏబీఏ) సంయుక్తంగా విద్యాలక్ష్మి పోర్టల్‌ను రూపొందించాయి.

ఎన్‌ఎస్‌డీఎల్‌ ఈ-గవర్నర్స్‌ వ్యవస్థ ద్వారా దీన్ని పర్యవేక్షిస్తున్నారు.

*♦12 బ్యాంకులు.. 22 రకాల రుణాలు*

12 దరఖాస్తులు విద్యాలక్ష్మి పోర్టల్‌లో నమోదై ఉన్నాయి.

22 రకాల విద్యా రుణాల్ని అవి అందిస్తున్నాయి.

ఎస్‌బీఐ, కెనరా, విజయ, ఐఓబీ, యూనియన్‌, , ఐడీబీఐ, యూబీఐ, పంజాబ్‌ నేషనల్‌, సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ, యూకో, దీనా, కరూర్‌ వైశ్య, సిండికేట్‌, టీఏఏబీ, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, కార్పోరేషన్‌ బ్యాంకు, యాక్సిస్‌, ఫెడరల్‌, న్యూఇండియా, ఆర్‌బీఎల్‌, అలాహాబాద్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా తదితర బ్యాంకుల ద్వారా రుణాలు పొందవచ్చు.

*♦సులభంగా దరఖాస్తులు..*

విద్యా రుణం కోసం మూడంటే మూడు పద్ధతుల్లో సులభంగా దరఖాస్తు చేసుకోవచ్చు.

తొలుత విద్యాలక్ష్మి పోర్టల్‌లో నమోదవ్వాలి. ఆ తరువాత దరఖాస్తు పూరించాలి.

చివరగా వివిధ రకాల బ్యాంకుల్ని ఎంపిక చేసుకోవాలి.

ఈ ప్రక్రియ సాఫీగా పూర్తయితే రుణానికి సంబంధించిన వివరాలు చరవాణి, ఈ-మెయిల్స్‌కు ఎప్పటికప్పుడు వస్తాయి.

ONLINE APPLICATION CLICK HERE

జాతీయ ఉపకార వేతనాలకు సైతం..*

విద్యాలక్ష్మి పోర్టల్‌ ద్వారా జాతీయస్థాయి ప్రతిభా ఉపకార వేతనాలకు సైతం దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎక్కువమంది విద్యార్థులు.. ఉన్నత చదువులు పూర్తి చేసిన వారిని ఈ పోర్టల్‌తో అనుసంధానం చేయడంలో భాగంగా ప్రతిభా ఉపకార వేతనాల వివరాల్ని సైతం ఇందులో పొందుపరుస్తున్నారు. రుణాలు.. ఉపకార వేతనాలు అందుకుని జీవితంలో స్థిరపడిన వారి స్ఫూర్తిదాయక గాథల్ని ప్రేరణగా పోర్టల్‌ ముఖపత్ర పేజీల్లో ఉంచారు.

*♦ఏయే చదువులకు..*

ఇంటర్‌, గ్రాడ్యుయేషన్‌, పోస్టు గ్రాడ్యూయేషన్‌, ఇంజినీరింగ్‌, మెడిసిన్‌, పీజీ డిప్లమా ఇన్‌ ఫ్రోఫెషనల్‌ కోర్సులు, కాస్ట్‌ అకౌంటెన్సి, ఛార్టర్డ్‌ అకౌంట్‌, ఐఐఎం మేనేజ్‌మెంట్‌, ఐఐటీ, వృత్తి విద్యాకోర్సులు, విమానయాన రంగానికి సంబంధించి ఇంజినీరింగ్‌, మెడిసిన్‌ కోర్సులకు రుణాలిస్తారు.

* యుజీసీ, ఏఐసీటీఈ, ఎంసీఐ, ఇతర ప్రభుత్వ ఆధీకృత సంస్థలు, విశ్వవిద్యాలయాల్లో చదువుకునే వారికి మాత్రమే రుణాలు అందిస్తారు.

*♦ఎంతవరకు రుణం పొందవచ్చు..*

‌* రూ.4.5 లక్షల వరకు రుణానికి కేంద్ర ప్రభుత్వమే వడ్డీ భరిస్తుంది. బాలికల విద్యను ప్రోత్సహించడంలో భాగంగా విద్యార్థినులకు మరింత రాయితీ ఉంటుంది.

* రుణం రూ.7.5 లక్షలు దాటితే పూచీకత్తు ఉండాలి.

రూ.10 లక్షల వరకు రుణాన్ని పొందవచ్చు.

*♦ఇవి తప్పనిసరి..*

విద్యాలక్ష్మి పథకంతోపాటు రాష్ట్ర ప్రభుత్వ పథకాల కింద విద్యా రుణాలను పొందేందుకు విద్యార్థులు చివరగా చదివిన విద్యాసంస్థ నుంచి బదిలీ ధ్రువీకరణ పత్రం జత చేయాలి.

* మార్కుల జాబితా.

* ఇంతవరకూ పొందిన ఉపకార వేతనాల పత్రాలు.

* ఉన్నత విద్యకు సంబంధించి  ర్యాంకు కార్డు, ప్రవేశ అనుమతి పత్రాలు.

* చదవాల్సిన కోర్సుకు సంబంధించిన ఫీజు 

Student Information

Welcome to Vidya Lakshmi Portal!

Vidya Lakshmi Portal provides single window for Students to access information about various loan schemes provided by banks and make applications for Educational Loans.

If you want to apply for education loan on Vidya Lakshmi portal, you must register on portal. Please provide essential details as mentioned in registration form.

Important Instructions

  • Please ensure that the registration details filled in are correct

  • Please enter password in required format

Guidelines for Registering on Vidya Lakshmi Portal

  • Name- Please enter student name as per 10th class marksheet or as per the marksheet attached with your loan application

  • Mobile Number- Enter a valid mobile number. Student can provide mobile number of parent/guardian

  • Email ID- Enter a valid email ID. Email ID will not be allowed to change. All necessary communications will be sent on this email ID.

ONLINE APPLICATION CLICK HERE

OFFICIAL WEBSITE CLICK HERE

error: Content is protected !!