rajanna-badi-bata-school-programme-from-June-12th-to-15th

rajanna-badi-bata-school-programme-from-June-12th-to-15th

నూతన విద్యావిధానం, కొత్త పాఠ్యప్రణాళికలు, నూతన విద్యా సంస్కరణలు, రాష్ట్రంలో నూతన ప్రభుత్వం… వెరసి కొంగ్రొత్త ఆశలతో నూతన విద్యాసంవత్సరం బుధవారం నుంచి ప్రారంభమవుతోంది.

వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు, కళాశాలల తలుపులు తెరచుకుంటున్నాయి.

విద్యాసంస్థల ప్రాంగణాలు కొంగ్రొత్త శోభతో విద్యార్థులను ఆహ్వానిస్తున్నాయి.

పాఠ్యపుస్తకాల పంపిణీ ఇప్పటికే పూర్తికాగా, వాటిని విద్యార్ధులకు స్కూలు తెరిచిన తొలిరోజునే ఇచ్చేందుకు ప్రధానోపాధ్యాయులు, విద్యాధికారులు సిద్ధమయ్యారు.

కార్పొరేట్‌ పాఠశాలల విద్యార్ధుల మాదిరిగా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయనున్నారు.

కీలకమైన కంప్యూటర్‌ విద్యాబోధనకు డిజిటల్‌ క్లాస్‌రూమ్‌లు, వర్చువల్‌ క్లాస్‌రూమ్‌లను విద్యాసంవత్సరం ప్రారంభం నుంచే పూర్తిస్థాయిలో వినియోగించుకునేందుకు కార్యాచరణను రూపొందించారు

రేపటి నుంచే బడిబాట

ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు, విద్యార్ధుల అడ్మిషన్లను పెంచుకునేందుకు బుధవారం నుంచి ఈ నెల 15 వరకు ‘ రాజన్న బడిబాట – బడి పిలుస్తోంది – విద్యా వారోత్సవాలు నిర్వహణకు విద్యాశాఖ సిద్ధమవుతోంది.

దీనికి సంబంధించి ఇప్పటికే రోజువారీ కార్యచరణ ప్రకటించారు.

పాఠశాలలు వారీగా విద్యార్థులు తల్లిదండ్రులు, టీచర్లతో పీటే సమావేశాలను నిర్వహించి నూతన విద్యాసంవత్సరంలో చేపట్టే కార్యక్రమాల గురించి వివరించనున్నారు.

అలాగే స్థానిక గ్రామపెద్దలు, ఎన్‌జీవోలు, స్కూలు మేనేజ్‌మెంట్‌ కమిటీల భాగస్వామ్యంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థు చేరికకు క్షేత్రస్థాయి కార్యచరణకు జిల్లా విద్యాశాఖ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది.

12-06-2019 బుధవారం

స్వాగత సంబరం

13-06-2019 గురువారం 

నందనాభినయం 

14-06-2019 శుక్రవారం 

అక్షరం 

15 -06-2019 శనివారం

వందనం-అభినందనం

ఈ నాలుగు రోజులలో ‘రాజన్న బడి బాట’ కార్యక్రమ విషయాలను క్రోడికరిo చి  ఫోటోలతో సామజిక మాధ్యమాల ద్వారా పై అధికారులకు నివేదికను సమర్పించాలి.

RAJANNA BADI BATA PROGRAMME SCHEDULE

BADI BATA PROGRAMME PROCEEDINGS OF AP AMARAVATHI

ALL EDUCATIONAL SCHEMES DETAILS IN AP SCHOOLS

error: Content is protected !!