reserve-bank-of-india-cuts-repo-rate-by-75-bps-huge-impact-on-emi

reserve-bank-of-india-cuts-repo-rate-by-75-bps-huge-impact-on-emi

లోన్ తీసుకున్నవారికి గుడ్ న్యూస్… భారీగా తగ్గనున్న ఈఎంఐలు

ఆర్బీఐ రుణ వాయిదాల చెల్లింపులపై మారటోరియం వార్త తెలిసినప్పటి నుంచి చాలామందికి కొన్ని సందేహాలు కలిగాయి.

ఈ నెల వాయిదాను బ్యాంకు పరిగణించిందో లేదో ఎలా తెలుస్తుంది?

క్రెడిట్‌కార్డు రుణ వాయిదాలకు ఇది వర్తిస్తుందా? అనే ప్రశ్నలు తలెత్తాయి.

వాటికి ఆర్థిక నిపుణుల సమాధానాలు ఇవే.*

*♦ప్రశ్న* : త్వరలోనే నేను ఈఎమ్‌ఐ చెల్లించాల్సి ఉంది. ఇప్పుడు నా ఖాతాలో డబ్బులు అలాగే ఉంటాయా?

*🔷జవాబు* : మారటోరియం అమలు చేసేందుకు బ్యాంకులకు ఆర్‌బీఐ అనుమతించింది. అయితే నిర్ణయం తీసుకోవాల్సింది మాత్రం బ్యాంకులే. వారు అంగీకరించకపోతే మీరు వాయిదా చెల్లించాల్సిందే.

*♦ప్రశ్న* : నా ఈఎమ్‌ఐ వాయిదా వేశారో లేదో ఎలా తెలుస్తుంది?

*🔷జవాబు* : ఆర్‌బీఐ ఇప్పటికైతే వివరాలేమీ ఇవ్వలేదు. మార్గదర్శకాలు విడుదల చేస్తేనే స్పష్టత వస్తుంది.

*♦ప్రశ్న* : బ్యాంకులు ఈ ప్రక్రియను ఎలా మొదలు పెడతాయి?

*🔷జవాబు* : బ్యాంకులన్నీ కలిసి మారటోరియంపై చర్చిస్తాయి.

బోర్డు స్థాయిలో నిర్ణయం తీసుకుంటాయి.

మారటోరియం ఆమోదిస్తే ఆ విషయాన్ని వినియోగదారులకు తెలియజేస్తాయి.

*♦ప్రశ్న* : బ్యాంకు నా ఈఎమ్‌ఐ వాయిదా వేస్తే నా క్రెడిట్‌ స్కోరు దెబ్బతింటుందా?

*🔷జవాబు* : లేదు. మీ క్రెడిట్‌ స్కోరుకు ఇబ్బందేమీ లేదు.

*♦ప్రశ్న* : ఇప్పుడు ఆర్‌బీఐ చేసేది వాయిదానా లేదా రద్దా?

*🔷జవాబు* : ఇది రద్దు కాదు. వాయిదా మాత్రమే. బ్యాంకులు మారటోరియం ఆమోదిస్తే మీరు చెల్లించాల్సిన వాయిదాల కాలపరిమితి ఇప్పుడు తగ్గి మూడు నెలలు పెరుగుతుంది.

*♦ప్రశ్న* : మారటోరియం అసలు, వడ్డీ రెండింటిపై ఉంటుందా?

*🔷జవాబు* : అవును. అసలు, వడ్డీ రెండింటిపై మారటోరియం ఉంటుంది. ఇప్పుడు వాయిదా వేసే మొత్తంలో అసలు, వడ్డీ కలిపే ఉంటుంది.

*♦ప్రశ్న* : ఏయే రుణాలు మారటోరియం పరిధిలోకి వస్తాయి?

*🔷జవాబు* : కాలపరిమితి (టెర్మ్‌)తో కూడిన రుణాలన్నీ మారటోరియం కిందకు వస్తాయని ఆర్‌బీఐ తెలిపింది.

ఇందులో గృహ, వ్యక్తిగత, విద్య, వాహన ఇతర రుణాలు ఉంటాయి.

*టీవీ, మొబైల్‌, ఫ్రిడ్జ్‌ వంటి గృహ వినియోగ వస్తువులపై తీసుకున్న రుణాలకూ* ఇది వర్తిస్తుంది.

*♦ప్రశ్న* : క్రెడిట్‌ కార్డు చెల్లింపులపై మారటోరియం వర్తిస్తుందా?

*🔷జవాబు* : క్రెడిట్‌ కార్డు చెల్లింపులు కాలపరిమితి రుణాల కిందకు రావు.

కాబట్టి ఇవి మారటోరియం పరిధిలోకి రావు.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేట్ తగ్గించడం వరుసగా ఇది ఆరోసారి.

ఆరుసార్లు మొత్తం కలిపితే 210 బేసిస్ పాయింట్స్ తగ్గింది.

రుణాలు తీసుకున్నవారికి, లోన్స్ తీసుకోవాలని అనుకుంటున్నవారికి శుభవార్త.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI రెపో రేట్‌ను భారీగా తగ్గించింది.

కరోనా వైరస్ కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న సంక్షోభాన్ని నివారించేందుకు ఆర్‌బీఐ ఈ కీలక నిర్ణయం తీసుకుంది.

ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించారు.

రెపో రేట్‌ను 75 బేసిస్ పాయింట్స్ తగ్గించినట్టు ప్రకటించారు.

దీంతో రెపో రేట్ 4.4 శాతానికి చేరుకుంది. ఒకేసారి 75 బేసిస్ పాయింట్స్ తగ్గించడం కీలక నిర్ణయమే. సామాన్యులకు రుణ భారం భారీగా తగ్గనుంది. ఇంతకు ముందు రెపో రేట్ 5.15 శాతంగా ఉండేది.

ఆర్‌బీఐ రెపో రేట్ తగ్గిచండంతో వడ్డీ రేట్లు కూడా భారీగా తగ్గనున్నాయి.

హోమ్ లోన్, వెహికిల్ లోన్ భారం సామాన్యులపై భారీగా తగ్గనుంది.

కొత్తగా ఇళ్లు, వాహనాలు కొనేవాళ్లను కొత్త వడ్డీ రేట్లు ఆకర్షించే అవకాశముంది.

గురువారం కేంద్ర ప్రభుత్వం ‘పీఎం గరీబ్ కళ్యాణ్’ పేరుతో ఓ పథకాన్ని ప్రకటించింది.

ఈ పథకం ద్వారా రూ.1,70,000 కోట్లు ఖర్చు చేయనుంది.

రిజర్వు బ్యాంక్ రెపో రేటును తగ్గించడం వల్ల బ్యాంకులు అందించే రుణాలపై కూడా వడ్డీ రేట్లు గణనీయంగా తగ్గే అవకాశముంది.

ప్రస్తుతం చాలా బ్యాంకులు హోమ్ లోన్, వెహికల్ లోన్ వంటి వాటిపై వడ్డీ రేట్లను రెపో రేటుతో అనుసంధానం చేస్తున్నాయి.

దీంతో రెపో తగ్గితే లోన్ వడ్డీ రేటు కూడా తగ్గుతుంది.

దీంతో కొత్తగా రుణం తీసుకునే వారితోపాటు ఇప్పటికే లోన్ తీసుకున్న వారికి కూడా ప్రయోజనం కలుగనుంది.

కొత్తగా లోన్ తీసుకుంటే తక్కువ వడ్డీ పడుతుంది.

అదే ఇదివరకే హోమ్ లోన్ వంటివి తీసుకొని ఉంటే కస్టమర్లకు ఈఎంఐ భారం తగ్గుతుంది. 

ఉదాహరణకు హోమ్ లోన్ వడ్డీ రేట్లు 75 బేసిస్ పాయింట్ల మేర తగ్గితే.. రుణ గ్రహీతకు ఎలా ప్రయోజనం కలుగుతుందో చూద్దాం.

మీరు రూ.35 లక్షల హోమ్ లోన్‌ను 15 ఏళ్ల కాల పరిమితితో తీసుకున్నారు.

అప్పుడు మీకు ఈఎంఐ భారం రూ.1533 తగ్గుతుంది.

అంటే సంవత్సరానికి రూ.18,396 మిగులుతుంది. మొత్తంగా చూస్తే వడ్డీ రూపంలో రూ.2.76 ఆదా అవుతుంది. 

కరోనాపై పోరాటానికి కేంద్రం భారీ ప్యాకేజీ

విరాళాలకు వంద శాతం ఐటీ మినహాయింపు

error: Content is protected !!