# reserve-bank-of-india-cuts-repo-rate-by-75-bps-huge-impact-on-emi

- Link: https://amaravathiteacher.com/reserve-bank-of-india-cuts-repo-rate-by-75-bps-huge-impact-on-emi/
- Published: 2020-03-27T12:00:43+05:30
- Author: amaravathiteacher

## **reserve-bank-of-india-cuts-repo-rate-by-75-bps-huge-impact-on-emi**

### **లోన్ తీసుకున్నవారికి గుడ్ న్యూస్… భారీగా తగ్గనున్న ఈఎంఐలు**

### **ఆర్బీఐ రుణ వాయిదాల చెల్లింపులపై మారటోరియం వార్త తెలిసినప్పటి నుంచి చాలామందికి కొన్ని సందేహాలు కలిగాయి. **

### **ఈ నెల వాయిదాను బ్యాంకు పరిగణించిందో లేదో ఎలా తెలుస్తుంది?**

### ** క్రెడిట్‌కార్డు రుణ వాయిదాలకు ఇది వర్తిస్తుందా? అనే ప్రశ్నలు తలెత్తాయి. **

### **వాటికి ఆర్థిక నిపుణుల సమాధానాలు ఇవే.\***

### **\*♦ప్రశ్న\* : త్వరలోనే నేను ఈఎమ్‌ఐ చెల్లించాల్సి ఉంది. ఇప్పుడు నా ఖాతాలో డబ్బులు అలాగే ఉంటాయా?**

### **\*🔷జవాబు\* : మారటోరియం అమలు చేసేందుకు బ్యాంకులకు ఆర్‌బీఐ అనుమతించింది. అయితే నిర్ణయం తీసుకోవాల్సింది మాత్రం బ్యాంకులే. వారు అంగీకరించకపోతే మీరు వాయిదా చెల్లించాల్సిందే.**

### **\*♦ప్రశ్న\* : నా ఈఎమ్‌ఐ వాయిదా వేశారో లేదో ఎలా తెలుస్తుంది?**

### **\*🔷జవాబు\* : ఆర్‌బీఐ ఇప్పటికైతే వివరాలేమీ ఇవ్వలేదు. మార్గదర్శకాలు విడుదల చేస్తేనే స్పష్టత వస్తుంది.**

### **\*♦ప్రశ్న\* : బ్యాంకులు ఈ ప్రక్రియను ఎలా మొదలు పెడతాయి?**

### **\*🔷జవాబు\* : బ్యాంకులన్నీ కలిసి మారటోరియంపై చర్చిస్తాయి. **

### **బోర్డు స్థాయిలో నిర్ణయం తీసుకుంటాయి. **

### **మారటోరియం ఆమోదిస్తే ఆ విషయాన్ని వినియోగదారులకు తెలియజేస్తాయి.**

### **\*♦ప్రశ్న\* : బ్యాంకు నా ఈఎమ్‌ఐ వాయిదా వేస్తే నా క్రెడిట్‌ స్కోరు దెబ్బతింటుందా?**

### **\*🔷జవాబు\* : లేదు. మీ క్రెడిట్‌ స్కోరుకు ఇబ్బందేమీ లేదు.**

### **\*♦ప్రశ్న\* : ఇప్పుడు ఆర్‌బీఐ చేసేది వాయిదానా లేదా రద్దా?**

### **\*🔷జవాబు\* : ఇది రద్దు కాదు. వాయిదా మాత్రమే. బ్యాంకులు మారటోరియం ఆమోదిస్తే మీరు చెల్లించాల్సిన వాయిదాల కాలపరిమితి ఇప్పుడు తగ్గి మూడు నెలలు పెరుగుతుంది.**

### **\*♦ప్రశ్న\* : మారటోరియం అసలు, వడ్డీ రెండింటిపై ఉంటుందా?**

### **\*🔷జవాబు\* : అవును. అసలు, వడ్డీ రెండింటిపై మారటోరియం ఉంటుంది. ఇప్పుడు వాయిదా వేసే మొత్తంలో అసలు, వడ్డీ కలిపే ఉంటుంది.**

### **\*♦ప్రశ్న\* : ఏయే రుణాలు మారటోరియం పరిధిలోకి వస్తాయి?**

### **\*🔷జవాబు\* : కాలపరిమితి (టెర్మ్‌)తో కూడిన రుణాలన్నీ మారటోరియం కిందకు వస్తాయని ఆర్‌బీఐ తెలిపింది. **

### **ఇందులో గృహ, వ్యక్తిగత, విద్య, వాహన ఇతర రుణాలు ఉంటాయి. **

### **\*టీవీ, మొబైల్‌, ఫ్రిడ్జ్‌ వంటి గృహ వినియోగ వస్తువులపై తీసుకున్న రుణాలకూ\* ఇది వర్తిస్తుంది.**

### **\*♦ప్రశ్న\* : క్రెడిట్‌ కార్డు చెల్లింపులపై మారటోరియం వర్తిస్తుందా?**

### **\*🔷జవాబు\* : క్రెడిట్‌ కార్డు చెల్లింపులు కాలపరిమితి రుణాల కిందకు రావు. **

### **కాబట్టి ఇవి మారటోరియం పరిధిలోకి రావు.**

### **రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేట్ తగ్గించడం వరుసగా ఇది ఆరోసారి. **

### **ఆరుసార్లు మొత్తం కలిపితే 210 బేసిస్ పాయింట్స్ తగ్గింది.**

### **రుణాలు తీసుకున్నవారికి, లోన్స్ తీసుకోవాలని అనుకుంటున్నవారికి శుభవార్త.**

### ** రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI రెపో రేట్‌ను భారీగా తగ్గించింది. **

### **కరోనా వైరస్ కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న సంక్షోభాన్ని నివారించేందుకు ఆర్‌బీఐ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. **

### **ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించారు. **

### **రెపో రేట్‌ను 75 బేసిస్ పాయింట్స్ తగ్గించినట్టు ప్రకటించారు.**

### ** దీంతో రెపో రేట్ 4.4 శాతానికి చేరుకుంది. ఒకేసారి 75 బేసిస్ పాయింట్స్ తగ్గించడం కీలక నిర్ణయమే. సామాన్యులకు రుణ భారం భారీగా తగ్గనుంది. ఇంతకు ముందు రెపో రేట్ 5.15 శాతంగా ఉండేది.**

### **ఆర్‌బీఐ రెపో రేట్ తగ్గిచండంతో వడ్డీ రేట్లు కూడా భారీగా తగ్గనున్నాయి. **

### **హోమ్ లోన్, వెహికిల్ లోన్ భారం సామాన్యులపై భారీగా తగ్గనుంది. **

### **కొత్తగా ఇళ్లు, వాహనాలు కొనేవాళ్లను కొత్త వడ్డీ రేట్లు ఆకర్షించే అవకాశముంది.**

### **గురువారం కేంద్ర ప్రభుత్వం ‘పీఎం గరీబ్ కళ్యాణ్’ పేరుతో ఓ పథకాన్ని ప్రకటించింది. **

### **ఈ పథకం ద్వారా రూ.1,70,000 కోట్లు ఖర్చు చేయనుంది.**

### **రిజర్వు బ్యాంక్ రెపో రేటును తగ్గించడం వల్ల బ్యాంకులు అందించే రుణాలపై కూడా వడ్డీ రేట్లు గణనీయంగా తగ్గే అవకాశముంది.**

### ** ప్రస్తుతం చాలా బ్యాంకులు హోమ్ లోన్, వెహికల్ లోన్ వంటి వాటిపై వడ్డీ రేట్లను రెపో రేటుతో అనుసంధానం చేస్తున్నాయి. **

### **దీంతో రెపో తగ్గితే లోన్ వడ్డీ రేటు కూడా తగ్గుతుంది. **

### **దీంతో కొత్తగా రుణం తీసుకునే వారితోపాటు ఇప్పటికే లోన్ తీసుకున్న వారికి కూడా ప్రయోజనం కలుగనుంది. **

### **కొత్తగా లోన్ తీసుకుంటే తక్కువ వడ్డీ పడుతుంది. **

### **అదే ఇదివరకే హోమ్ లోన్ వంటివి తీసుకొని ఉంటే కస్టమర్లకు ఈఎంఐ భారం తగ్గుతుంది. **

### **ఉదాహరణకు హోమ్ లోన్ వడ్డీ రేట్లు 75 బేసిస్ పాయింట్ల మేర తగ్గితే.. రుణ గ్రహీతకు ఎలా ప్రయోజనం కలుగుతుందో చూద్దాం. **

### **మీరు రూ.35 లక్షల హోమ్ లోన్‌ను 15 ఏళ్ల కాల పరిమితితో తీసుకున్నారు. **

### **అప్పుడు మీకు ఈఎంఐ భారం రూ.1533 తగ్గుతుంది. **

### **అంటే సంవత్సరానికి రూ.18,396 మిగులుతుంది. మొత్తంగా చూస్తే వడ్డీ రూపంలో రూ.2.76 ఆదా అవుతుంది. **

### **󠀁[కరోనాపై పోరాటానికి కేంద్రం భారీ ప్యాకేజీ](https://amaravathiteacher.com/central-government-announced-corona-virus-package-people-will-get-direct-cash-in-bank-account/)󠁿**

### **󠀁[విరాళాలకు వంద శాతం ఐటీ మినహాయింపు](https://amaravathiteacher.com/income-tax-exemption-carona-virus-donations-cm-relief-fund-andhra-pradesh/)󠁿**

### 󠀁[AP TEACHERS LATEST NEWS](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)󠁿

 *  [ NEW SA1 Science Question Papers 2026 ](https://amaravathiteacher.com/sa1-science-question-papers-2026/)
 *  [ SA1 EVS Key Papers 2026 PDF Download – 3rd to 5th Class ](https://amaravathiteacher.com/sa1-evs-key-papers-2026/)
 *  [ SA1 Maths Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-maths-key-papers-2026/)
 *  [ APPSC Group 2 Notification 2026 – 720 Vacancies, Post-wise Qualifications, Age, Fee, Dates & Syllabus Apply Online ](https://amaravathiteacher.com/appsc-group-2-notification-2026-720-vacancies-apply-online/)
 *  [ SA1 Hindi Key Papers 2026 PDF Download – 6th to 10th Class ](https://amaravathiteacher.com/sa1-hindi-key-papers-2026/)
 *  [ SA1 English Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-english-key-papers-2026/)
 *  [ SA1 Key Paper 2026 ](https://amaravathiteacher.com/sa1-key-paper-2026/)
 *  [ AP CPS to OPS Conversion 2026 – GO 158 Guidelines, NIDHI Application & Annexures ](https://amaravathiteacher.com/ap-cps-to-ops-conversion-2026-go-158-guidelines-nidhi-application-annexures/)
 *  [ SA1 Telugu Key Papers 2026 PDF Download – 1st to 10th Class ](https://amaravathiteacher.com/sa1-telugu-key-papers-2026/)
 *  [ AP SA1 2026 Class 10 School Level Observers Duties – DSE Proceedings 08-11-2026 ](https://amaravathiteacher.com/ap-sa1-2026-class-10-school-level-observers-duties-dse-orders/)

[View More ](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)

### 󠀁[TEACHERS SOFTWARES](https://amaravathiteacher.com/category/teachers-softwares/)󠁿

 *  [ SMC Elections 2026 Notification Voters List Download ](https://amaravathiteacher.com/smc-elections-2026-notification-voters-list-download/)
 *  [ Income Tax Online Calculator FY 2026-27 ](https://amaravathiteacher.com/income-tax-online-calculator-fy-2026-27/)
 *  [ Student id Card Download ](https://amaravathiteacher.com/student-id-card-download/)
 *  [ AP DA Arrears Calculator 2026 ](https://amaravathiteacher.com/ap-da-arrears-calculator-2026/)
 *  [ AP New DA Salary Calculator ](https://amaravathiteacher.com/ap-new-da-salary-calculator/)
 *  [ AP EHS Hospitals List ](https://amaravathiteacher.com/ap-ehs-hospitals-list/)
 *  [ AP Teachers ID Card Download ](https://amaravathiteacher.com/ap-teachers-id-card-download/)
 *  [ Pdf Compressor Online ](https://amaravathiteacher.com/pdf-compressor-online/)
 *  [ Online image compressor ](https://amaravathiteacher.com/online-image-compressor/)
 *  [ AP Medical Reimbursement Proposal Software ](https://amaravathiteacher.com/ap-medical-reimbursement-proposal-software/)

[View More ](https://amaravathiteacher.com/category/teachers-softwares/)
