RIE-CEE-2019-NCERT-CEE-DEGREE-B.Ed-M.Ed-courses
ప్రాంతీయ విద్యా సంస్థలు (ఆర్‌ఐఈ).. ఉపాధ్యాయ విద్యలో నిపుణులను తయారుచేసే మేటి విద్యా సంస్థలు. ఇంటిగ్రేటెడ్ కోర్సులతోపాటు పీజీ, పీహెచ్‌డీ అందించే ఆర్‌ఐఈల్లో చేరడం ద్వారా బోధన రంగంలో అపార అవకాశాలు అందిపుచ్చుకోవచ్చు.
దేశంలో ఉన్న అయిదు ఆర్‌ఐఈల్లో ప్రవేశాలకు నిర్వహించే ‘కామన్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్(సీఈఈ)-2019’కు జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎన్‌సీఈఆర్‌టీ) ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసింది.
కోర్సులు :
బీఎస్సీ బీఈడీ (నాలుగేళ్ల్లు),
బీఏ బీఈడీ (నాలుగేళ్ల్లు),
ఎమ్మెస్సీ ఎడ్యుకేషన్ (ఆరేళ్లు),
బీఈడీ (రెండేళ్లు),
ఎంఈడీ (రెండేళ్లు),
బీఈడీ-ఎంఈడీ (మూడేళ్లు).
అర్హతలు :
-
బీఎస్సీ బీఈడీ, బీఏ బీఈడీ, ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం సంబంధిత సబ్జెక్టుతో ఇంటర్‌లో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు కనీసం 45 శాతం మార్కులు ఉండాలి.
-
బీఈడీ కోర్సుల్లో ప్రవేశాల కోసం కనీసం 50 శాతం మార్కులతో డిగ్రీ/పీజీ ఉత్తీర్ణులై ఉండాలి.
-
ఎంఈడీ కోర్సుకు కనీసం 50 శాతం మార్కులతో బీఈడీ, బీఏ బీఈడీ/బీఎస్సీ బీఈడీ లేదా తత్సమాన కోర్సు ఉండాలి.
-
ఇంటిగ్రేటెడ్ బీఈడీ-ఎంఈడీ ప్రోగ్రాంలో ప్రవేశానికి సంబంధిత సబ్జెక్టులో 55 శాతం మార్కులతో పీజీ ఉత్తీర్ణులై ఉండాలి.
విభిన్న కోర్సులు..
-
తెలుగు రాష్ట్రాల్లో టీచర్ విద్యకు సంబంధించి చేరే కోర్సులు.. డీఎడ్, బీఎడ్. ఇంటర్ అర్హతతో రెండేళ్ల డీఎడ్ కోర్సుల్లో చేరితే; డిగ్రీ అర్హతతో బీఎడ్ కోర్సులో చేరడం మనందరికి తెలిసిందే.
-
ఆర్‌ఐఈల్లో విభిన్న కోర్సులు అందుబాటులో ఉండటం విశేషం. ఇంటర్ అర్హతతో ఇంటిగ్రేటెడ్ బీఎస్సీ బీఈడీ; ఇంటిగ్రేటెడ్ బీఏ బీఈడీ కోర్సులు; ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ ఎడ్యుకేషన్; బ్యాచిలర్ డిగ్రీతో రెగ్యులర్ బీఈడీ; బీఈడీ అర్హతతో ఎంఈడీ కోర్సుల్లో చేరొచ్చు.
-
పీజీ అర్హతతో ఇంటిగ్రేటెడ్ బీఈడీ-ఎంఈడీలో చేరే అవకాశముంది.
Information Brochure CLICK HERE
REGIONAL INSTITUTE OF EDUCATION MYSURU Seat matrix
HOW TO APPLY
మన విద్యార్థులు అర్హులు :
దేశంలో అజ్మీర్, భువనేశ్వర్, భోపాల్, మైసూరు, షిల్లాంగ్‌ల్లో ఆర్‌ఐఈలున్నాయి. ఒక్కో సంస్థ పరిధిలోకి ఆయా ప్రాంతాల్లో ఉన్న రాష్ట్రాలు వస్తాయి. అంటే.. వారు సంబంధింత ప్రాంతంలో ఉన్న ఆర్‌ఐఈలకు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. (కొన్ని కోర్సులకు తప్ప). సదరన్ ప్రాంతంలోని తెలంగాణ, ఏపీ, కర్ణాటక, కేరళ, తమిళనాడు, లక్షద్వీప్, పుదుచ్చేరిలు.. ఆర్‌ఐఈ మైసూరు పరిధిలోకి వస్తాయి. అంటే.. ఈ ప్రాంత విద్యార్థులు మైసూరు ఆర్‌ఐఈలోనే చదవాలి. నిబంధనల మేరకు ఒక్కో రాష్ట్ర అభ్యర్థులకు ప్రత్యేకంగా సీట్లు కేటాయిస్తారు. ఆర్‌ఐఈ మైసూరులో బీఎస్సీ బీఈడీ (ఎంపీసీ)లో 40 సీట్లు, బీఎస్సీ బీఈడీ (బీజెడ్‌సీ)లో 40 సీట్లు, బీఏ బీఈడీలో 40 సీట్లు ఉన్నాయి. ఇందులో ఒక్కో కోర్సులో ఏపీకి 8 సీట్లు; తెలంగాణకు 5 సీట్లు లభించనున్నాయి.
-
ఆరేళ్ల కాల పరిమితితో ఉండే ఎంఎస్సీ ఎడ్యుకేషన్ కోర్సు.. ఒక్క ఆర్‌ఐఈ మైసూరులో మాత్రమే ఉంది. డిగ్రీ, బీఈడీ, పీజీ పూర్తిచేయాలంటే.. ఇంటర్ తర్వాత ఏడేళ్లు పడుతుంది. కానీ ఈ కోర్సులో చేరడం వల్ల ఇంటర్ తర్వాత ఆరేళ్లలోనే పీజీతో పాటు బీఈడీ పట్టా సొంతంచేసుకోవచ్చు.
-
ఎంఎస్సీ ఎడ్యుకేషన్‌లో.. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ సబ్జెక్టుల్లో.. ఒక్కో దాంట్లో 15 చొప్పున సీట్లు ఉన్నాయి. ఇవి ఓపెన్ సీట్లు. వీటికి దేశవ్యాప్తంగా ఉన్న అభ్యర్థులు పోటీపడొచ్చు.ఈ కోర్సులు పూర్తిచేసిన అభ్యర్థులు మైసూరు యూనివర్సిటీ పరిధిలో పీహెచ్‌డీలో చేరడానికి అర్హత లభిస్తుంది.
-
ఆర్‌ఐఈ-మైసూరులో రెగ్యులర్ బీఈడీ సైన్స్ అండ్ మ్యాథ్స్ విభాగంలో 25; సోషల్ సైన్‌స అండ్ లాంగ్వేజీ గ్రూపుల్లో 25 చొప్పున సీట్లు ఉండగా.. రెగ్యులర్ ఎంఈడీ కోర్సులో 30 సీట్లు ఉన్నాయి.
పీజీతో ఇంటిగ్రేటెడ్ బీఈడీ-ఎంఈడీ :
సైన్‌స/సోషల్ సెన్సైస్/హ్యుమానిటీస్ విభాగాల్లో 55 శాతం మార్కులతో పీజీ చదివిన అభ్యర్థులు ఈ కోర్సులో చేరడానికి అర్హులు. ఈ కోర్సు ఆర్‌ఐఈ-భోపాల్‌లో మాత్రమే ఉంది. ఇక్కడ 40 సీట్లు అందుబాటులో ఉన్నాయి. మూడేళ్ల వ్యవధి ఉండే ఈ కోర్సులో చేరడానికి ప్రాంతీయ కోటా ఉండదు. దేశంలో ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఉపకార వేతనాలు :
ఎన్‌సీఈఆర్‌టీ నిబంధనల ప్రకారం ఆర్‌ఐఈల్లో చేరిన ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఉపకార వేతనాలు లభిస్తాయి. వీరితోపాటు ఇతర అభ్యర్థుల్లో సగం మందికి తల్లిదండ్రుల వార్షికాదాయం, మెరిట్ జాబితా ఆధారంగా స్కాలర్‌షిప్‌లు అందిస్తారు. ఉపకార వేతనాలు అందుకునే అభ్యర్థులు విధిగా కాలేజీ వసతిగృహాల్లో ఉండాలి.
పరీక్ష విధానం :
మూడు విభాగాల్లో అభ్యర్థి పరిజ్ఞానాన్ని పరీక్షిస్తారు. పరీక్ష సమయం రెండు గంటలు. (ఉదయం 9 గంటల నుంచి 11 వరకు).
సెక్షన్ |
ప్రశ్నల సంఖ్య |
మార్కులు |
లాంగ్వేజ్ ప్రొఫిషియెన్సీ |
20 |
40 |
టీచింగ్ ఆప్టిట్యూడ్/యాటిట్యూడ్ 30 |
60 |
|
రీజనింగ్ ఎబిలిటీ |
30 |
60 |
మొత్తం |
80 |
160 |
-
ఈ పరీక్షలో వచ్చిన మార్కులకు 60 శాతం వెయిటేజీ ఉండగా; మిగతా 40 శాతం అర్హత పరీక్షలో వచ్చిన మార్కులకు కేటాయించి.. ర్యాంకుల జాబితా రూపొందిస్తారు.