కరోనా: ఐదు నిమిషాల్లో పరీక్ష.. పది నిమిషాల్లో ఫలితం
➪ రాష్ట్రంలోని ఇంద్ర బస్సులను కరోనా టెస్టింగ్ సెంటర్లుగా మారుస్తూ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ, ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకున్నాయి.
➪ వాటికి ‘సంజీవని’ అనే నామకరణం చేశారు.
➪ వైరస్ ఉద్ధృతి బాగా పెరిగిపోతున్న నేపధ్యంలో గ్రామాల్లో ఎక్కువగా పరీక్షలు చేసేందుకు ఏపీఎస్ఆర్టీసీ జిల్లాలకు ‘సంజీవని’ బస్సులను పంపిస్తోంది.
➪ ప్రతీ జిల్లాకు నాలుగు చొప్పున బస్సులను పంపిస్తుండగా.. ఒక్కో బస్సులో పది మంది ఒకేసారి పరీక్ష చేయించుకునేలా ఏర్పాట్లు చేసింది.
➪ ఈ బస్సుల్లో టెస్టులు చేసి అప్పటికప్పుడే ఫలితాలను కూడా వెల్లడిస్తారు.
➪ మొత్తంగా 52 బస్సులను తయారు చేయనున్న ఏపీఎస్ఆర్టీసీ.. ఇప్పటివరకు 22 బస్సులను సిద్దం చేసింది.
➪ రాష్ట్రంలో పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపధ్యంలో నెలాఖరులోగా 70 బస్సులను సిద్దం చేయాలని ఆర్టీసీ అధికారులు ప్రణాళికలను సిద్దం చేస్తున్నారు.
➪ కాగా, కేసులు ఎక్కువగా ఉన్న జిల్లాలకు నాలుగు కంటే ఎక్కువ బస్సులను పంపాలని నిర్ణయం తీసుకున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం కరోనా టెస్ట్‌లు వేగిరం చేసేందుకు ఆరీ్టసీకి చెందిన ఇంద్ర హైటెక్ బస్సులను కోవిడ్ ర్యాపిడ్ టెస్ట్‌లకు అనుగుణంగా ప్రత్యేక డిజైన్ ద్వారా మార్పులు చేపట్టింది.
ఒక్కో బస్సు లోపల దాదాపు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలు వెచ్చించి ఒకేసారి పది మందికి ర్యాపిడ్ టెస్ట్‌లు చేసేలా రూపకల్పన చేశారు. బస్సులో పూర్తి ఏసీ సౌకర్యంతో పాటు పది కౌంటర్లు ఉంటాయి.
బస్సు అద్దాలకు మనిషి చేయి దూరేంత రంధ్రం ఏర్పాటు చేశారు.
బస్సులోని ఒక్కో కౌంటర్ వద్ద ఒక డాక్టర్, ఒక టెక్నీíÙయన్ ఉంటారు.
బస్సు బయట అద్దాలకు ఏర్పాటు చేసిన రంధ్రాల ద్వారా పరీక్ష చేయించుకునే వ్యక్తి తల ఎత్తుకు అందేలా ర్యాంప్‌ల ఏర్పాటుచేశారు.
కౌంటర్ల వద్ద ఉన్న డాక్టర్లు బస్సు బయట ఉన్న వ్యక్తి ముక్కులోంచి పరికరం పంపించి శాంపిల్స్ సేకరిస్తారు.
అలా తీసిన శాంపిల్‌ను అక్కడికక్కడే ర్యాపిడ్ యాంటీజెన్ కిట్‌తో పరీక్షిస్తారు.
ఈ ప్రక్రియ అంతా 15 నిమిషాల్లో పూర్తవుతుంది. బస్సులో ఉన్న పది కౌంటర్ల నుంచి ఒకేసారి పది పరీక్షలు, ఫలితాలు వచ్చేలా ఏర్పాట్లు చేశారు.
ఆ బస్సు ద్వారా రోజుకు వెయ్యి వరకూ పరీక్షలు చేసే సామర్ధ్యంతో కూడిన సాంకేతిక సౌకర్యాలు కల్పించారు.
తక్కువ సమయంలో ఎక్కువ పరీక్షలు చేసి ఫలితాలు ఇస్తుండడంతో జిల్లాలో రాజమహేంద్రవరం, కాకినాడ, అమలాపురం డివిజన్లకు కేటాయించిన మూడు ముబైల్ ర్యాపిడ్ టెస్టింగ్ ల్యాబ్‌లకు ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తోంది.
ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయే దాకా ఈ బస్సుల ద్వారా గత మూడు రోజుల్లో వేలాది టెస్ట్‌లు చేశారు.
దీంతో రోజుకు వందకు మించి లేదా వంద లోపు ఉండే పాజటివ్ కేసుల సంఖ్యం ఈ బస్సులు వచ్చాక వందల్లోకి పెరిగింది