# sanjeevani-buses-covid-19-apsrtc-52-buses-ready-for-testing-corona-tests

- Link: https://amaravathiteacher.com/sanjeevani-buses-covid-19-apsrtc-52-buses-ready-for-testing-corona-tests/
- Published: 2020-07-17T12:15:24+05:30
- Author: amaravathiteacher

## **sanjeevani-buses-covid-19-apsrtc-52-buses-ready-for-testing-corona-tests**󠀁[](https://amaravathiteacher.com/sanjeevani-buses-covid-19-apsrtc-52-buses-ready-for-testing-corona-tests/)󠁿

### **సంజీవని బస్సులు – ఏపీఎస్ ఆర్టీసీ\***

### **➪ కరోనా కట్టడికి . గ్రామాలకు ‘సంజీవని’ బస్సులు**

### **కరోనా: ఐదు నిమిషాల్లో పరీక్ష.. పది నిమిషాల్లో ఫలితం**

### **➪ రాష్ట్రంలోని ఇంద్ర బస్సులను కరోనా టెస్టింగ్ సెంటర్లుగా మారుస్తూ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ, ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకున్నాయి.**

### **➪ వాటికి ‘సంజీవని’ అనే నామకరణం చేశారు.**

### **➪ వైరస్ ఉద్ధృతి బాగా పెరిగిపోతున్న నేపధ్యంలో గ్రామాల్లో ఎక్కువగా పరీక్షలు చేసేందుకు ఏపీఎస్ఆర్టీసీ జిల్లాలకు ‘సంజీవని’ బస్సులను పంపిస్తోంది.**

### **➪ ప్రతీ జిల్లాకు నాలుగు చొప్పున బస్సులను పంపిస్తుండగా.. ఒక్కో బస్సులో పది మంది ఒకేసారి పరీక్ష చేయించుకునేలా ఏర్పాట్లు చేసింది.**

### **➪ ఈ బస్సుల్లో టెస్టులు చేసి అప్పటికప్పుడే ఫలితాలను కూడా వెల్లడిస్తారు.**

### ** ➪ మొత్తంగా 52 బస్సులను తయారు చేయనున్న ఏపీఎస్ఆర్టీసీ.. ఇప్పటివరకు 22 బస్సులను సిద్దం చేసింది.**

### ** ➪ రాష్ట్రంలో పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపధ్యంలో నెలాఖరులోగా 70 బస్సులను సిద్దం చేయాలని ఆర్టీసీ అధికారులు ప్రణాళికలను సిద్దం చేస్తున్నారు.**

### **➪ కాగా, కేసులు ఎక్కువగా ఉన్న జిల్లాలకు నాలుగు కంటే ఎక్కువ బస్సులను పంపాలని నిర్ణయం తీసుకున్నారు.**

### **రాష్ట్ర ప్రభుత్వం కరోనా టెస్ట్‌లు వేగిరం చేసేందుకు ఆరీ్టసీకి చెందిన ఇంద్ర హైటెక్‌ బస్సులను కోవిడ్‌ ర్యాపిడ్‌ టెస్ట్‌లకు అనుగుణంగా ప్రత్యేక డిజైన్‌ ద్వారా మార్పులు చేపట్టింది.**

### **ఒక్కో బస్సు లోపల దాదాపు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలు వెచ్చించి ఒకేసారి పది మందికి ర్యాపిడ్‌ టెస్ట్‌లు చేసేలా రూపకల్పన చేశారు. బస్సులో పూర్తి ఏసీ సౌకర్యంతో పాటు పది కౌంటర్లు ఉంటాయి. **

### **బస్సు అద్దాలకు మనిషి చేయి దూరేంత రంధ్రం ఏర్పాటు చేశారు. **

### **బస్సులోని ఒక్కో కౌంటర్‌ వద్ద ఒక డాక్టర్, ఒక టెక్నీíÙయన్‌ ఉంటారు. **

### **బస్సు బయట అద్దాలకు ఏర్పాటు చేసిన రంధ్రాల ద్వారా పరీక్ష చేయించుకునే వ్యక్తి తల ఎత్తుకు అందేలా ర్యాంప్‌ల ఏర్పాటుచేశారు. **

### **కౌంటర్ల వద్ద ఉన్న డాక్టర్లు బస్సు బయట ఉన్న వ్యక్తి ముక్కులోంచి పరికరం పంపించి శాంపిల్స్‌ సేకరిస్తారు. **

### **అలా తీసిన శాంపిల్‌ను అక్కడికక్కడే ర్యాపిడ్‌ యాంటీజెన్‌ కిట్‌తో పరీక్షిస్తారు.**

### **ఈ ప్రక్రియ అంతా 15 నిమిషాల్లో పూర్తవుతుంది. బస్సులో ఉన్న పది కౌంటర్ల నుంచి ఒకేసారి పది పరీక్షలు, ఫలితాలు వచ్చేలా ఏర్పాట్లు చేశారు. **

### **ఆ బస్సు ద్వారా రోజుకు వెయ్యి వరకూ పరీక్షలు చేసే సామర్ధ్యంతో కూడిన సాంకేతిక సౌకర్యాలు కల్పించారు. **

### **తక్కువ సమయంలో ఎక్కువ పరీక్షలు చేసి ఫలితాలు ఇస్తుండడంతో జిల్లాలో రాజమహేంద్రవరం, కాకినాడ, అమలాపురం డివిజన్లకు కేటాయించిన మూడు ముబైల్‌ ర్యాపిడ్‌ టెస్టింగ్‌ ల్యాబ్‌లకు ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. **

### **ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయే దాకా ఈ బస్సుల ద్వారా గత మూడు రోజుల్లో వేలాది టెస్ట్‌లు చేశారు. **

### **దీంతో రోజుకు వందకు మించి లేదా వంద లోపు ఉండే పాజటివ్‌ కేసుల సంఖ్యం ఈ బస్సులు వచ్చాక వందల్లోకి పెరిగింది**

### 󠀁[AP TEACHERS LATEST NEWS](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)󠁿

 *  [ NEW AP Special TET Results 2026 Released – Check Marks & Download Scorecard ](https://amaravathiteacher.com/ap-special-tet-results-2026/)
 *  [ NEW SA1 Science Key Paper 2026 ](https://amaravathiteacher.com/sa1-science-key-paper-2026/)
 *  [ NEW SA1 Physics Key Papers 2026–27 PDF Download – 8th to 10th Class ](https://amaravathiteacher.com/sa1-physics-key-papers-2026/)
 *  [ SA1 Science Question Papers 2026 ](https://amaravathiteacher.com/sa1-science-question-papers-2026/)
 *  [ SA1 EVS Key Papers 2026 PDF Download – 3rd to 5th Class ](https://amaravathiteacher.com/sa1-evs-key-papers-2026/)
 *  [ SA1 Maths Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-maths-key-papers-2026/)
 *  [ APPSC Group 2 Notification 2026 – 720 Vacancies, Post-wise Qualifications, Age, Fee, Dates & Syllabus Apply Online ](https://amaravathiteacher.com/appsc-group-2-notification-2026-720-vacancies-apply-online/)
 *  [ SA1 Hindi Key Papers 2026 PDF Download – 6th to 10th Class ](https://amaravathiteacher.com/sa1-hindi-key-papers-2026/)
 *  [ SA1 English Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-english-key-papers-2026/)
 *  [ SA1 Key Paper 2026 ](https://amaravathiteacher.com/sa1-key-paper-2026/)

[View More ](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)

### 󠀁[TEACHERS SOFTWARES](https://amaravathiteacher.com/category/teachers-softwares/)󠁿

 *  [ SMC Elections 2026 Notification Voters List Download ](https://amaravathiteacher.com/smc-elections-2026-notification-voters-list-download/)
 *  [ Income Tax Online Calculator FY 2026-27 ](https://amaravathiteacher.com/income-tax-online-calculator-fy-2026-27/)
 *  [ Student id Card Download ](https://amaravathiteacher.com/student-id-card-download/)
 *  [ AP DA Arrears Calculator 2026 ](https://amaravathiteacher.com/ap-da-arrears-calculator-2026/)
 *  [ AP New DA Salary Calculator ](https://amaravathiteacher.com/ap-new-da-salary-calculator/)
 *  [ AP EHS Hospitals List ](https://amaravathiteacher.com/ap-ehs-hospitals-list/)
 *  [ AP Teachers ID Card Download ](https://amaravathiteacher.com/ap-teachers-id-card-download/)
 *  [ Pdf Compressor Online ](https://amaravathiteacher.com/pdf-compressor-online/)
 *  [ Online image compressor ](https://amaravathiteacher.com/online-image-compressor/)
 *  [ AP Medical Reimbursement Proposal Software ](https://amaravathiteacher.com/ap-medical-reimbursement-proposal-software/)

[View More ](https://amaravathiteacher.com/category/teachers-softwares/)
