# santhoor-womens-scholarships-for-government-school-students-2020

- Link: https://amaravathiteacher.com/santhoor-womens-scholarships-for-government-school-students-2020/
- Published: 2020-10-09T09:22:31+05:30
- Author: amaravathiteacher

## **santhoor-womens-scholarships-for-government-school-students-2020**

[[

### **విద్యార్థినులకు సంతూర్‌ సాయం**

### **ప్రతిభకు పేదరికమే పెద్ద సమస్య. అందులోనూ ఆడపిల్లలైతే చదువులు అర్ధాంతరంగా ఆపేయాల్సిందే. **

### **ముఖ్యంగా గ్రామీణ ప్రాంత విద్యార్థినులు ఆసక్తి ఉన్నప్పటికీ ఆర్థిక శక్తి సరిపోక ఉన్నతవిద్యలో చేరలేకపోతున్నారు. ఇలాంటి వారిని ఆర్థికంగా ఆదుకొని, చదువులో రాణించేలా చూడడానికి విప్రో సంస్థ ‘సంతూర్‌ ఉపకారవేతనా’లను అందిస్తోంది. **

### **ఈ స్కాలర్‌షిప్‌ ప్రకటన వెలువడింది. ఇంటర్‌ పూర్తిచేసిన బాలికలు దరఖాస్తు చేసుకోవచ్చు.**

### **మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారు. **

### **సమాన అవకాశాలు ఉన్నప్పటికీ బాల్యంలోనే కొంతమంది బాలికలు చదువులకు దూరం అవుతున్నారు. **

### **అందుకు ప్రధానమైన కారణం ఆర్థిక పరిస్థితి. దాన్ని అధిగమించి, వారికి ఆసరా కల్పించేందుకు సంతూర్‌ స్కాలర్‌షిప్పులు అందిస్తున్నారు. **

### **ఆర్థికంగా వెనుకబడిన నేపథ్యం ఉన్న బాలికలను చదువులో ప్రోత్సహించడానికి విప్రో కన్సూమర్‌ కేర్, విప్రో కేర్స్‌ కలిసి వీటిని అందిస్తున్నాయి. **

### **ఇవి 2016-2017 విద్యా సంవత్సరం నుంచి మొదలయ్యాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక మూడు రాష్ట్రాల నుంచి ఏడాదికి 900 మందికి ఈ ప్రోత్సాహకాలు అందుతున్నాయి. **

### **గత నాలుగేళ్లలో 3600 మంది విద్యార్థినులు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులూ లేకుండా ఈ తోడ్పాటుతో ఉన్నత విద్యలో రాణిస్తున్నారు.**

### **హ్యుమానిటీస్, లిబరల్‌ ఆర్ట్స్, సైన్స్‌ కోర్సుల్లో చేరినవారికి, వెనుకబడిన జిల్లాలకు చెందినవారికి ఎంపికలో కొంత ప్రాధాన్యం ఉంటుంది. **

### **అకడమిక్‌ మెరిట్‌ ప్రాతిపదికన అర్హులను ఎంపిక చేస్తారు**

### **󠀁[HAZARATH BEGUM MINORITY SCHOLARSHIPS FOR GIRLS ONLINE APPLICATION & DETAILS](https://amaravathiteacher.com/maulana-azad-education-foundation-begum-hazrat-mahal-scholarships-for-girls/)󠁿**

### **󠀁[TCS NATIONAL QUALIFIER TEST 2020 ONLINE REGISTRATION LINK & DETAILS](https://amaravathiteacher.com/tata-consultancy-services-tcs-national-qualifier-test-2020-21/)󠁿**

### **అర్హతలు: **

### **పదో తరగతి, ఇంటర్మీడియట్‌ ప్రభుత్వ పాఠశాల, కళాశాలల్లోనే చదివుండాలి. **

### **అలాగే ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన పేద బాలికలే ఈ స్కాలర్‌షిప్‌కు అర్హులు. **

### **2019-20 విద్యాసంవత్సరంలో ఇంటర్‌ లేదా సమాన స్థాయి కోర్సులు పూర్తిచేసినవారై ఉండాలి. **

### **2020-21లో ఏదైనా బ్యాచిలర్‌ డిగ్రీ మొదటి సంవత్సరం కోర్సుల్లో చేరి ఉండాలి. **

### **కనీసం మూడేళ్లు, ఆపై వ్యవధితో ఉన్న డిగ్రీ కోర్సుల్లో చేరినవారే ఈ స్కాలర్‌షిప్పు పొందడానికి అర్హులు.**

### **స్కాలర్‌షిప్‌: **

### **ఎంపికైన విద్యార్థినులకు మూడేళ్లు లేదా కోర్సు పూర్తయినంత వరకు ప్రతినెలా రూ.రెండువేల చొప్పున స్కాలర్‌షిప్‌ ఇస్తారు. **

### **డబ్బు నేరుగా వారి బ్యాంకు ఖాతాలో జమవుతుంది.**

### ** ట్యూషన్‌ ఫీజులు, పుస్తకాలు, ఇతర సదుపాయాల కోసం దీన్ని ఉపయోగించుకోవచ్చు. ఇంటర్‌ తర్వాత ఉండే వివిధ యూజీ కోర్సులు చదవడానికి ఈ స్కాలర్‌షిప్పు ఉపయోగపడుతుంది.**

### **దరఖాస్తు: **

### **దరఖాస్తు ఫారాన్ని సంస్థ వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకుని, ప్రింటవుట్‌ తీసుకోవాలి. అందులో పూర్తి వివరాలను నింపి పోస్టు ద్వారా పంపాలి. **

### **దరఖాస్తు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.**

### **దరఖాస్తుల స్వీకరణకు చివరి తేది: అక్టోబరు 31**

### **చిరునామా: **

### **విప్రో కేర్స్‌- సంతూర్‌ స్కాలర్‌షిప్, **

### **దొడ్డకన్నెల్లి, సర్జాపూర్‌ రోడ్డు, **

### **బెంగళూరు – 560035, కర్ణాటక.**

### **󠀁[DOWNLOAD APPLICATION FORM ](http://www.santoorscholarships.com/documents/Str%20Women%20Scholarship%20Application%20Form%202020-21.pdf)󠁿**

### **󠀁[SANTHOOR SCHOLARSHIPS APPLICATION & COMPLETE DETAILS](http://www.santoorscholarships.com/)󠁿**

### **󠀁[HOW TO DOWNLOAD AADHAR REPRINT WITH PVC CARDS DETAILS](https://amaravathiteacher.com/aadhar-card-reprint-with-pvc-cards-with-rs-50-latest-updates/)󠁿**

### 󠀁[AP TEACHERS LATEST NEWS](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)󠁿

 *  [ NEW SA1 Science Question Papers 2026 ](https://amaravathiteacher.com/sa1-science-question-papers-2026/)
 *  [ NEW SA1 EVS Key Papers 2026 PDF Download – 3rd to 5th Class ](https://amaravathiteacher.com/sa1-evs-key-papers-2026/)
 *  [ SA1 Maths Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-maths-key-papers-2026/)
 *  [ APPSC Group 2 Notification 2026 – 720 Vacancies, Post-wise Qualifications, Age, Fee, Dates & Syllabus Apply Online ](https://amaravathiteacher.com/appsc-group-2-notification-2026-720-vacancies-apply-online/)
 *  [ SA1 Hindi Key Papers 2026 PDF Download – 6th to 10th Class ](https://amaravathiteacher.com/sa1-hindi-key-papers-2026/)
 *  [ SA1 English Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-english-key-papers-2026/)
 *  [ SA1 Key Paper 2026 ](https://amaravathiteacher.com/sa1-key-paper-2026/)
 *  [ AP CPS to OPS Conversion 2026 – GO 158 Guidelines, NIDHI Application & Annexures ](https://amaravathiteacher.com/ap-cps-to-ops-conversion-2026-go-158-guidelines-nidhi-application-annexures/)
 *  [ SA1 Telugu Key Papers 2026 PDF Download – 1st to 10th Class ](https://amaravathiteacher.com/sa1-telugu-key-papers-2026/)
 *  [ AP SA1 2026 Class 10 School Level Observers Duties – DSE Proceedings 08-11-2026 ](https://amaravathiteacher.com/ap-sa1-2026-class-10-school-level-observers-duties-dse-orders/)

[View More ](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)

### 󠀁[TEACHERS SOFTWARES](https://amaravathiteacher.com/category/teachers-softwares/)󠁿

 *  [ SMC Elections 2026 Notification Voters List Download ](https://amaravathiteacher.com/smc-elections-2026-notification-voters-list-download/)
 *  [ Income Tax Online Calculator FY 2026-27 ](https://amaravathiteacher.com/income-tax-online-calculator-fy-2026-27/)
 *  [ Student id Card Download ](https://amaravathiteacher.com/student-id-card-download/)
 *  [ AP DA Arrears Calculator 2026 ](https://amaravathiteacher.com/ap-da-arrears-calculator-2026/)
 *  [ AP New DA Salary Calculator ](https://amaravathiteacher.com/ap-new-da-salary-calculator/)
 *  [ AP EHS Hospitals List ](https://amaravathiteacher.com/ap-ehs-hospitals-list/)
 *  [ AP Teachers ID Card Download ](https://amaravathiteacher.com/ap-teachers-id-card-download/)
 *  [ Pdf Compressor Online ](https://amaravathiteacher.com/pdf-compressor-online/)
 *  [ Online image compressor ](https://amaravathiteacher.com/online-image-compressor/)
 *  [ AP Medical Reimbursement Proposal Software ](https://amaravathiteacher.com/ap-medical-reimbursement-proposal-software/)

[View More ](https://amaravathiteacher.com/category/teachers-softwares/)
