sbi-cuts-interest-rates-on-fixed-deposits-home-loans-minimum-balance-for-all-savings-accounts

sbi-cuts-interest-rates-on-fixed-deposits-and-home-loans-minimum-balance-for-all-savings-accounts

ఎస్‌బీఐ అకౌంట్ ఉందా? బ్యాంకు తీసుకున్న 5 కీలక నిర్ణయాలివే

SBI Minimum Balance: 

SBI SMS Charges

SBI Savings Account Interes

SBI Home Loan:

SBI Interest Rates

మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI అకౌంట్ ఉందా?

ఎస్‌బీఐలో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తున్నారా? లేదా హోమ్ లోన్ ఉందా?

ఇంటి రుణం తీసుకోవాలనుకుంటున్నారా?

అయితే ఎస్‌బీఐ తీసుకున్న 5 కీలక నిర్ణయాల గురించి మీకు తప్పకుండా అవగాహన ఉండాల్సిందే.

అవేంటో తెలుసుకోండి.

1. SBI Minimum Balance: ఎస్‌బీఐలో సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ ఉన్నవారికి గుడ్ న్యూస్ చెప్పింది బ్యాంకు.

అన్ని సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లపై యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్-AMB తొలగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.

ప్రస్తుతం రూరల్‌లో రూ.1000, సెమీ అర్బన్‌లో రూ.2000, మెట్రోలో రూ.3000 యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలన్న నిబంధనలు ఉన్నాయి.

ఒకవేళ మినిమమ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోతే రూ.5 నుంచి రూ.15 వరకు ఛార్జీలను కూడా వసూలు చేస్తోంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

2. SBI Minimum Balance: ఇలాంటి ఛార్జీల ద్వారానే బ్యాంకుకు కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని గతంలో లెక్కలు తేల్చాయి.

ఖాతాదారులకు కూడా మినిమమ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం పెద్ద తలనొప్పిగా మారింది.

ఇప్పుడు ఆ నిబంధనను తొలగిస్తూ మినిమమ్ బ్యాలెన్స్‌ను ఎత్తేయడం ఖాతాదారులకు అతిపెద్ద శుభవార్తే.

ప్రస్తుతం ఎస్‌బీఐలో ఉన్న 44.51 కోట్ల సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లకు ఇది వర్తిస్తుంది

3. SBI SMS Charges: సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ హోల్డర్లకు ఎస్ఎంఎస్ ఛార్జీలను కూడా తొలగించింది బ్యాంకు.

ప్రతీ మూడు నెలలకు ఓసారి ఎస్ఎంఎస్ ఛార్జీలను వసూలు చేస్తూ ఉంటుంది బ్యాంకు.

ఎస్ఎంఎస్ రూపంలో ట్రాన్సాక్షన్స్ అలర్ట్స్ ఇచ్చేందుకు బ్యాంకు వసూలు చేసే ఛార్జీలు ఇవి. ఇప్పుడు ఎస్ఎంఎస్ ఛార్జీలు కూడా కస్టమర్లకు ఆదా అయినట్టే

4. SBI Savings Account Interest: ఇక సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ ఉన్నవారందరికీ 3 శాతం వార్షిక వడ్డీని కూడా ప్రకటించింది ఎస్‌బీఐ.

ఇప్పటివరకు రూ.1,00,000 లోపు సేవింగ్స్ ఉన్నవారికి 3.25 శాతం, రూ.1,00,000 దాటిన వారికి 3 శాతం వడ్డీ వచ్చేది. ఇకపై అందరికీ 3 శాతం వడ్డీ వర్తిస్తుంది

5. SBI Home Loan: హోమ్ లోన్ కస్టమర్లకు కూడా గుడ్ న్యూస్ చెప్పింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్ బేస్డ్ లెండింగ్ రేట్-MCLR 15 బేసిస్ పాయింట్స్ వరకు తగ్గిస్తున్నట్టు ఎస్‌బీఐ ప్రకటించింది.

అన్ని కాలవ్యవధులకు ఇది వర్తిస్తుంది.

ఈ కొత్త వడ్డీ రేట్లు మార్చి 10 నుంచే అమలులోకి వచ్చేశాయి. ఎంసీఎల్ఆర్ తగ్గించడంతో హోమ్ లోన్ వడ్డీ రేట్లు తగ్గనున్నాయి

6. SBI Home Loan: ఒక ఏడాది ఎంసీఎల్ఆర్ 7.85 శాతం నుంచి 7.75 శాతానికి 10 బేసిస్ పాయింట్స్ తగ్గింది.

ఎస్‌బీఐ కొత్త ఎంసీఎల్ఆర్ చూస్తే ఓవర్ నైట్- 7.45%, ఒక నెల- 7.45%, మూడు నెలలు- 7.50%, ఆరు నెలలు- 7.70%, ఒక ఏడాది- 7.75%, రెండేళ్లు- 7.95%, మూడేళ్లు- 8.05%

7. SBI Home Loan: ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఎంసీఎల్ఆర్‌ను వరుసగా 10వ సారి తగ్గించింది ఎస్‌బీఐ. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI ఎంసీఎల్ఆర్ తగ్గించిన ప్రతీసారి హోమ్ లోన్ వడ్డీ రేట్లు తగ్గుతాయి.

దీంతో హోమ్ లోన్ తీసుకోవాలనుకునేవారికి తక్కువ వడ్డీకే రుణాలు దొరకడం కస్టమర్లకు లాభమే.

దాంతో పాటు ఇప్పటికే హోమ్ లోన్ తీసుకున్నవారికి ఈఎంఐ భారం కూడా తగ్గుతుంది.

8. SBI Interest Rates: ఫిక్స్‌డ్ డిపాజిట్ ఖాతాదారులకు మాత్రం షాక్ ఇచ్చింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను తగ్గించింది బ్యాంకు.

కొత్తగా ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేసేవారితో పాటు మెచ్యూర్ అయ్యే డిపాజిట్లను రెన్యువల్ చేసేవారికి ఈ కొత్త వడ్డీ రేట్లు వర్తిస్తాయి.

ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను తగ్గించడం నెల రోజుల్లో ఇది రెండో సారి.

తగ్గించిన వడ్డీ రేట్లు మార్చి 10 నుంచి అమలులోకి వచ్చేశాయి

SBI నుండి SMS లు రావడం లేదా ఇలా చేయండి

error: Content is protected !!