SBI-RECRUITMENT-OF-JUNIOR-ASSOCIATES-CUSTOMER-SUPPORT-SALES-
SBI JA Application: ఎస్బీఐ ‘క్లర్క్’ ఉద్యోగాల దరఖాస్తు ప్రారంభం
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో క్లర్క్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది.
ఏదైనా డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
హైలైట్స్
-
జనవరి 3 నుంచి 26 వరకు కొనసాగనున్న ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ
-
ఫిబ్రవరి/ మార్చిలో ప్రిలిమినరీ పరీక్ష
-
ఏప్రిల్ 19న మెయిన్ పరీక్ష నిర్వహణ
ఎస్బీఐలో కస్టమర్ సపోర్ట్, సేల్స్ విభాగంలో జూనియర్ అసోసియేట్ (క్లర్క్) పోస్టుల జనవరి 2న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.
దీనిద్వారా మొత్తం 8,134 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో రెగ్యులర్ పోస్టులు 7870 ఉండగా.. 134 బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయి.
ఇక స్పెషల్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేసే పోస్టులు 130 ఉన్నాయి.
ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ జనవరి 3న ప్రారంభమైంది. జనవరి 26 వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది.
పోస్టుల వివరాలు..
మొత్తం ఖాళీల సంఖ్య: 8,134
పోస్టుల కేటాయింపు |
ఖాళీలు |
రెగ్యులర్ పోస్టులు |
7,870
|
బ్యాక్లాగ్ పోస్టులు |
134 |
స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్ |
130 |
మొత్తం ఖాళీలు |
8,134 |