scholarships-10th-Inter-students-sponsered-HP-IT-company

scholarships-10th-Inter-students-sponsered-HP-IT-company

ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు హెచ్‌పీ (హ్యులెట్‌-ప్యాకర్డ్‌) ఐటీ కంపెనీ స్కాలర్‌షిప్‌లను ఇస్తోంది. ‘హెచ్‌పీ ఉడాన్‌ స్కాలర్‌షిప్‌ ప్రోగ్రామ్‌ 2019-20’ పేరిట అందిస్తున్న ఈ ఆర్థిక సాయానికి 10, 12 తరగతులు పూర్తయినవారు అర్హులు.

దరఖాస్తు ప్రక్రియ త్వరలో మొదలౌతుంది.
ఆర్థిక కారణాల వల్ల పదో తరగతి తరువాత చదువు మానేస్తున్న వారికి చేయూతనివ్వడం, బాలికా విద్యను ప్రోత్సహించడం హెచ్‌పీ ఐటీ కంపెనీ ఉపకార వేతన కార్యక్రమ ఉద్దేశం.

దేశవ్యాప్తంగా ఉన్న 11, 12 తరగతులు, డిగ్రీల్లో సైన్స్‌, ఆర్ట్స్‌, కామర్స్‌ నేపథ్యాలకు చెందినవారెవరైనా దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు.

ఏడాది నుంచి మూడేళ్ల డిప్లొమా, ఐటీఐ కోర్సులు చేస్తున్నవారూ వీటికి అర్హులే.

మొత్తంగా 750 స్కాలర్‌షిప్‌లను అందిస్తుండగా, వాటిలో 50% పూర్తిగా అమ్మాయిలకు కేటాయించారు. మొత్తంగా మూడు రకాల స్కాలర్‌షిప్‌లను అందిస్తున్నారు.

1. ఏడాది స్కాలర్‌షిప్‌: 

దీనికి దరఖాస్తు చేసుకునేవారు ఏడాది కాలవ్యవధి గల డిప్లొమా/ ఐటీఐ కోర్సు చదువుతుండాలి.

పదో తరగతిలో కనీసం 60% మార్కులు సాధించి ఉండాలి.

కుటుంబ వార్షిక ఆదాయం రూ.4 లక్షలు మించకూడదు.

స్కాలర్‌షిప్‌ మొత్తం రూ.20,000.

2. రెండేళ్ల స్కాలర్‌షిప్‌: 

దీనికి ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థ నుంచి ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతున్నవారు అర్హులు.

పదో తరగతిలో కనీసం 60% మార్కులు సాధించి ఉండాలి.

కుటుంబ వార్షిక ఆదాయం రూ.4 లక్షలు మించకూడదు.

స్కాలర్‌షిప్‌ మొత్తం ఏడాదికి రూ.20,000.

3. మూడేళ్ల స్కాలర్‌షిప్‌: 

దీనికి ప్రభుత్వ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి అండర్‌ గ్రాడ్యుయేషన్‌ మొదటి ఏడాది చదువుతున్నవారు అర్హులు.

ఇంటర్‌లో కనీసం 60% మార్కులు సాధించి ఉండాలి. కుటుంబ వార్షిక ఆదాయం రూ.4 లక్షలు మించకూడదు.

స్కాలర్‌షిప్‌ మొత్తం ఏడాదికి రూ.30,000.

* నాలుగేళ్ల డిగ్రీ చేసేవారు దరఖాస్తు చేసుకోవడానికి అనర్హులు.

how to apply:-

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

ఈ-మెయిల్‌/ ఫేస్‌బుక్‌ అకౌంట్‌తో సైన్‌ ఇన్‌ అవ్వొచ్చు. విద్యార్థి తన పూర్తి వివరాలతోపాటు అవసరమైన పత్రాలను (ఐడీ ప్రూఫ్‌, ఆదాయ ధ్రువీకరణ పత్రం, మార్కుల షీట్లు, ప్రస్తుత తరగతి ఫీజు రశీదు/ ఐడీ కార్డు/ బోనఫైడ్‌) అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది.

మెరిట్‌ ఆధారంగా ఎంపిక ఉంటుంది. దరఖాస్తుల ద్వారా ఎంపిక చేసినవారికి మొదట ధ్రువీకరణ పత్రాలను పరిశీలిస్తారు.

దీనిలోనూ ఎంపికైనవారికి టెలిఫోనిక్‌ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.

ఈ రెండు దశల్లో పాల్గొన్న విద్యార్థుల ఫలితాలను ప్యానెల్‌ సభ్యులు పరిశీలిస్తారు.

ఆపై తుది జాబితాను వెల్లడిస్తారు.

దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: త్వరలో.

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌ ను సందర్శించవచ్చు.

INSTRUCTIONS

Application Dates for HP Udaan Scholarship 2019-20 would be announced soon.

Stay tuned for further updates.

Eligibility for 1-Yr Scholarships:

  • Must be enrolled in a 1 Year Diploma/ITI Course

  • Must have secured a minimum of 60% in 10th Std.

  • Annual Family Income should be not more than INR 4 Lakhs

Eligibility for 2-Yr Scholarships:

  • Must be enrolled in 11th Std at a recognized school in India

  • Must have secured a minimum of 60% in 10th Std.

  • Annual Family Income should be not more than INR 4 Lakhs

Eligibility for 3-Yr Scholarships: 

  • Must be enrolled in the 1st year of college at a recognized university in India

  • Must have secured a minimum of 60% in 12th Std.

  • Annual Family Income should be not more than INR 4 Lakhs

INSTRUCTIONS & GUIDELINES FOR REGISTRATION

ONLINE APPLICATION FOR HP SCHOLARSHIPS

OFFICIAL WEBSITE H.P IT COMPANY

error: Content is protected !!