️జిల్లాలోని ప్రభుత్వరంగ పాఠశాలలకు 2020-21 విద్యా సంవత్సరానికి 1 నుంచి 8తరగతి వరకు తరగతులు నిర్వహిస్తున్న 2,753 పాఠశాలలకు రూ.7.24 కోట్లు వార్షిక గ్రాంటు మంజూరు చేస్తూ సమగ్రశిక్ష రాష్ట్ర పీడీ కె.వెట్రిసెల్వి ఉత్తర్వులు జారీ చేశారు.
గతంలో ఉన్న విధానానికి స్వస్తి చెప్పి విద్యార్థుల సంఖ్య ఆధారంగా నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
️1 నుంచి 15 మంది వరకు విద్యార్థులు ఉన్న స్కూలుకు రూ.12,500 చొప్పున,
15 నుంచి 100 మంది ఉంటే రూ.25 వేలు,
100 నుంచి 250 మంది వరకు రూ.50వేలు చొప్పున,
250 మందికి పైన 1000 మందిలోపు విద్యార్థులు ఉన్న పాఠశాలకు రూ.75వేలు వంతున నిధులు కేటాయించారు.
టెస్త్ నుంచి ఇంటర్ వరకు 481 విద్యాసంస్థలకు రూ.2.85 కోట్లు మంజూరు చేశారు.