school-transformation-monitering-system-STMS-detailsa-ap

school-transformation-monitering-system-STMS-detailsa-ap

ప్రభుత్వ పాఠశాలలను ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితి కి తీసుకెళ్లాలనే సమున్నత లక్ష్యం తో ముఖ్యమంత్రి గారి ఆలోచనలతో విద్యాశాఖ వారు ప్రారంభించబడిన ప్రాజెక్ట్.

ప్రతి ఉపాధ్యాయుడు,ఉపాధ్యాయురాలు తన పాఠశాలను ఒక అందమైన,ఆదర్శవంతమైన పాఠశాల గా పాఠశాల రూపురేఖలను మార్చేందుకు ఒక శక్తివంతమైన ప్రయత్నం School Transformation Monitoring System.

కావున పాఠశాలలోని ప్రతి ఉపాధ్యాయుడు, ఉపాధ్యాయురాలు దీనిని ప్రథమ బాధ్యతగా భావించి  మన పాఠశాల స్థితిగతులను శక్తివంచన లేకుండా సంపూర్తి చేయగలరని మనవి.

STMS లో ప్రధానంగా 4 Task లు కలవు.

TASK1 :  Capture vedio 

మన పాఠశాల ముఖ చిత్రాన్ని 10 సెకన్ల నిడివి గల వీడియో ను capture చేసి దానిని submit చేసినచో మొదటి టాస్క్ పూర్తి అవుతుంది.

( ప్రతి టాస్క్ geo తో అనుసంధానం కావలసి ఉంటుంది)

TASK 2 : Capture data

ఇందులో 5 అంశాలు ఉన్నాయి.

1.Toilets,

2. Buildings,

3.Classrooms,

4.Bathrooms,

4.furniture data entry 

పై అంశాలు అన్ని మొదట ఒక పేపర్ లో వ్రాసుకొని తదుపరి అంశాల వారీగా app లో నింపినచో capture డేటా టాస్క్ పూర్తి అవుతుంది.

ఇందులో విషయాలు అసంపూర్తిగా కానీ, వదిలివేయడం కానీ చేసిన యెడల capture data టాస్క్ పూర్తి కాదు.

data పూర్తి అయినపుడు మాత్రమే తరువాత టాస్క్ కు వెళ్లుటకు అవకాశం ఉంటుంది.

TASK 3: Capture vedio

రెండవ టాస్క్ లో పూర్తి చేసిన ప్రతి అంశానికి ఫొటోలు తీయవలసిఉంటుంది.

Task3 లో buildings,toilets,black boards, electricity,fans,tubs,water supply, kitchen garden,paints, compound wall,major repairs, minor repairs,play ground…etc అంశాలు ఉంటాయి.వాటిని పరిశీలించి ప్రతి అంశాన్ని ఫొటో తీసినచో మన పాఠశాల కు ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు అయ్యే అవకాశం కలదు.కావున ఈ అంశాన్ని నామమాత్రంగా పరిశీలించకుండా చాలా జాగ్రత్త తో అన్ని అంశాల ఫొటోలు తీయగలరు.ఇక్కడ ప్రతి ఫొటో geo తో అనుసంధానం కావలసి ఉండటం వల్ల కొంచెం ఎక్కువ సమయం పడుతుంది.పాఠశాల అభివృద్ధి కొరకు మనం కొంచెం కష్టసాధ్యమయినప్పటికీ ఇష్టం తో ఫొటోలు తీయగలరని మనవి.

Task 3 complete అయితే మన ప్రయత్నం చాలా వరకు పూర్తి అయినదిగా భావించవచ్చు.

STMS USER MANUAL CLICK HERE FOR DOWNLOADL

TASK 4: Geo fencing

ఇందులో పాఠశాల boundry ని నిర్ధారించవలసి ఉంటుంది.

పాఠశాల compound wall చుట్టూ ఫెన్సింగ్ చేయవలసిఉంటుంది.

కనీసం 8 points capture boundary ని నిర్దారించవలసి ఉంటుంది.

మనం మొదటి point వద్ద capture boundary ని నిర్దారించినపుడు చివరిసారిగా అదే point వద్ద capture boundary నిర్దారించవలసి ఉంటుంది.

ప్రతి పాయింట్ కు 10-15 అడుగుల నిడివిలో point ను capture బౌండరీ చేసినచో చాలా సులువుగా geo fencing చేయవచ్చు.

( geo fencing optional గా ఇవ్వబడింది కావున దీనిని కూడా అన్ని పాఠశాలల్లో పూర్తి చేసే ప్రయత్నం చేద్దాం).

మరిన్ని వివరాలకు మీ ప్రాంత టెక్నికల్ సిబ్బందిని సంప్రదించగలరు.

STMS DOWNLOAD USER MANUAL

STMS OFFICIAL WEBSITE

DOWNLOAD STMS APK

error: Content is protected !!