అయితే ఈ క్రింది entries చెక్ లిస్ట్ రాసుకోండి మీ ఆఫీసు నుంచి ఎస్. ఆర్. ను అడిగి చెక్ చేసుకొని ఏదైనా ఎంట్రీ పెండింగ్ లో ఉంటే మీ HM లేదా MEO గారికి తెలియజేసి అప్డేట్ చేసుకోండి.
1. Periodical Increments entry :
ప్రతి సంవత్సరం మీకు శాంక్షన్ చేసే యాన్యువల్ ఇంక్రిమెంట్ ఎంట్రీ అప్డేట్ అయ్యిందా లేదా అలాగే మీ సర్వీస్ ఒక సంవత్సరం పూర్తి అయిన సందర్భంలో సర్వీస్ వెరిఫై స్టాంప్ మీ ఎస్. ఆర్. లో వేశారా? లేదా? సరి చూసుకోండి.
2. G.I.S. Entry :
జి .ఐ .ఎస్. చందా డిడక్టు అవుతూ ఉంటుంది కదా మీ ఎస్ ఆర్ లో జి .ఐ .ఎస్. అమౌంట్ సబ్స్క్రిప్షన్ ఎంత కాలం ఎంత అమౌంట్ డిడక్ట్ అయిందో ఆ ఎంట్రీ రాశారా ?లేదా ?చెక్ చేసుకోవాలి .అయితే జి .ఐ.ఎస్.అమౌంట్ enhance అవుతూ ఉంటుంది గమనించుకోవాలి.
3. APGLI Entry :
మీ జీితంలో ప్రతి నెల ఏ.పీ.జి.ఎల్.ఐ. అమౌంట్ డిడక్ట్ అవుతుంది కదా మీ ఎపిజిఎల్ఐ subscription enhance అయినప్పుడల్లా ఎంట్రీ పడిందా ?లేదా? చెక్ చేసుకున్నారా?
4. E. L. Entry :
ప్రతి సంవత్సరం సర్వీస్ పూర్తి అయినప్పుడు మనకు ఇచ్చే Earned Leave ను ఎస్ .ఆర్. చివర రాసే ఈ .ఎల్. ఖాతాలో అప్డేట్ అయ్యిందా లేదా చూసుకోవాలి
5. Half Pay Leave Entry :
ప్రతి సంవత్సరం సర్వీస్ పూర్తి అయినప్పుడల్లా మనకు మంజూరయ్యే 20 half pay leave లను S. R.చివరి పేజీలో half pay leave ఖాతాలో అప్డేట్ అయ్యిందా లేదా చూసుకోవాలి.
6. Training Etrny :
ఇంతవరకు సమ్మర్ లో అయిన ట్రైనింగ్ , ఇతర డ్యూటీ వివరాలు entries అప్డేట్ అయ్యిందా లేదా చూసుకోవాలి .ఇది చాలా ముఖ్యమైన విషయం.