పది మార్కుల జాబితాలు జారీ అవుతుండడం, విద్యా సంస్థలు సెప్టెంబరులో దశల వారీగా తెరిచేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో ఇంటర్ మీడియట్ ప్రథమ సంవత్సరం కోర్సుల్లో ప్రవేశాలకు త్వరలో ఆన్లైన్ అడ్మిషన్లకు పెడ్యూల్ విడుదలకు సన్నాహాలు చురుకుగా జరుగుతున్నాయి.
అందుతున్న సమాచారం ప్రకారం రాగల వారం, పది రోజుల వ్యవధిలోనే ఇంటర్ ఆడ్మిషన్లకు షెడ్యూల్ ను విడుదల చేయనున్నా రు.
జూనియర్ కళాశాలల్లో ప్రవేశాల ప్రక్రియను ప్రభుత్వం ఈ ఏడాది సంస్కరిస్తూ ఆన్లైన్ అడ్మిషన్లకు శ్రీకారం చుట్టడానికి నిర్ణయం తీసుకున్న విషయం విదితమే.
ఈ మేరకు ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల వారేగా అందుబాటులో ఉన్న సెక్షన్లు, కోర్సులు, సీట్ల సంఖ్య అనుగుణంగా అన్ని వర్గాల విద్యార్థులకు అడ్మిషన్లు లభించేలా తొలిసారిగా రిజర్వేషన్లు కం రోస్టర్ పద్ధతి చూపించనున్నట్లు తెలిసింది.
ఈ విధానం ప్రకారమే విద్యా ర్థులకు అడ్మిషన్లు ఇవ్వడం వల్ల సామాజిక న్యాయ సూత్రాన్ని అమలు చేయనున్నారు.
ఫీజుల వసూలుపై స్పష్టత ఇచ్చి గతేడాది ఉన్న ఫీజులనే వసూలు చేసే పర్యవేక్షించడం తో పాటు విడతల వారీగా చెల్లించే వెసు లుబాటును కల్పించనున్నట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో ఇంటర్ఆడిషన్లో త్వరలో అధికారిక షెడ్యూల్, మార్గదర్శకాలు జారీ కానుంది.