పది’ పరీక్షా విధానంలో మార్పు?*
*ప్రశ్నాపత్రాలు మరింత కఠినం*
*పదో తరగతి పరీక్షలను సెకండరీ స్కూల్ ఎడ్యుకేషన్ మరింత కఠినం చేయబోతోంది.
2019-20 విద్యాసంవత్సరంలో 10వ తరగతి పరీక్షల్లో పెను మార్పులకు విద్యాశాఖ శ్రీకారం చుట్టింది.
ఇదివరకటి లాగా కాస్త సులభతరం అనేది ఇక కనిపించదు.
10/10 రావాలంటే చాలా కష్టపడాల్సిన పరిస్థితులు ఉన్నాయి.
ఆ దిశగా ఉపాధ్యాయులు కూడా విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు.
ఇప్పటికే సిలబ్‌సను వందశాతం పూర్తి చేసుకుని రివిజన్ టెస్ట్‌లను నిర్వహించారు.*
*సీసీఈ మోడల్లోనే ప్రశ్నలు*
*పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ఇప్పుడు మరింత కఠినతరం అయ్యాయి.
ఒక సబ్జెక్టులో విద్యార్థికి 10/10 రావాలంటే 46 కన్నా ఎక్కువ మార్కులు ఆ పేపరులోనే రావాలి. ఒకవేళ పేపర్ 1లో 44 మార్కులు, పేపరు 2లో 49 మార్కులు వచ్చినా కూడా 10/10 సాధ్యపడదు. 10/10 మార్కులు సాధించాలంటే పేపర్ 1,2లలో మొత్తం 92 మార్కులు సాధించాల్సి ఉంది.
ప్రతి పేపర్లోను హిందీ మినహాయించి 46 మార్కులు విద్యార్థి సాధించగలిగితేనే 10/10 సాధ్యమవుతుంది.
ఇక పరీక్షా విధానంలో చాలా మార్పులు వచ్చాయి.*
*ఏ సబ్జెక్టుకు బిట్ పేపర్ ఉండదు.
24 పేజీల బుక్లెట్ ఇస్తారు. అదనంగా ఏ విధమైన అడిషనల్ షీట్స్ ఇవ్వరు. ఆ 24 వేజీల బుక్‌లెట్‌లోనే అన్ని సమాధానాలు రాయాలి.
ఇక ప్రశ్నాపత్రాల విషయానికి వస్తే గతేడాది 30 నుంచి 40 శాతం ప్రశ్నలు సీసీఈ మోడల్లో ఉన్నాయి.
కానీ ఈ ఏడాది వందశాతం ప్రశ్నలు సీసీఈ మోడల్లోనే ఉంటాయి.*
*అందువల్ల ప్రశ్నాపత్రాలు అంత సులభతరం కాదని ఉపాధ్యాయులు అంటున్నారు.*
*పరీక్షా కేంద్రాల్లో కెమెరాలు*
*పదో తరగతి పరీక్షలను ఈ దఫా చాలా కఠినంగా నిర్వహించేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది. ఇన్విజి లేటర్లు ఉపాధ్యాయులు కాకుండా రెవెన్యూ, తదితర శాఖల నుంచి ఉద్యోగులను కేటాయించనున్నారు. ప్రతి పరీక్షా కేంద్రంలోను వెబ్ కెమెరాలు, సీసీ కెమెరాలు అమర్చి ఫ్లైయింగ్ స్వ్కాడ్‌ను పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నారు.*
*పరీక్షలో ప్రశ్నాపత్రాన్ని ఆయా పరీక్షా కేంద్రంలోని ప్రిన్సిపాల్స్, డీన్లు, ఇన్చార్జిలు వాట్సాప్, ఫేస్బుక్ వంటి ప్రసార మాధ్యమాల ద్వారా బయటకు పంపిస్తే అటువంటి వారిపై నాన్ బెయిల్‌బుల్ కేసులు పెట్టి అరెస్టు చేసే విధంగా ప్రణాళిక రూపొందించారు.
మొత్తంమీద పదో తరగతి పరీక్షలు చాలా కఠినతరం చేయడంతో విద్యార్థులు కష్టపడి సబ్జెట్ల వారీగా అవగాహన తెచ్చుకోవాల్సి ఉంది. ఆ దిశగానే ప్రస్తుతం ఉపాధ్యాయులు విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు*