ssc-public-examinations-certain-clarifications-minimum-pass-mark

ssc-public-examinations-certain-clarifications-minimum-pass-mark

పది’ పరీక్షా విధానంలో మార్పు?*

*ప్రశ్నాపత్రాలు మరింత కఠినం*

 *పదో తరగతి పరీక్షలను సెకండరీ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ మరింత కఠినం చేయబోతోంది.

2019-20 విద్యాసంవత్సరంలో 10వ తరగతి పరీక్షల్లో పెను మార్పులకు విద్యాశాఖ శ్రీకారం చుట్టింది.

ఇదివరకటి లాగా కాస్త సులభతరం అనేది ఇక కనిపించదు.

10/10 రావాలంటే చాలా కష్టపడాల్సిన పరిస్థితులు ఉన్నాయి.

ఆ దిశగా ఉపాధ్యాయులు కూడా విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు.

ఇప్పటికే సిలబ్‌సను వందశాతం పూర్తి చేసుకుని రివిజన్‌ టెస్ట్‌లను నిర్వహించారు.*

*సీసీఈ మోడల్‌లోనే ప్రశ్నలు*

*పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు ఇప్పుడు మరింత కఠినతరం అయ్యాయి.

ఒక సబ్జెక్టులో విద్యార్థికి 10/10 రావాలంటే 46 కన్నా ఎక్కువ మార్కులు ఆ పేపరులోనే రావాలి. ఒకవేళ పేపర్‌ 1లో 44 మార్కులు, పేపరు 2లో 49 మార్కులు వచ్చినా కూడా 10/10 సాధ్యపడదు. 10/10 మార్కులు సాధించాలంటే పేపర్‌ 1,2లలో మొత్తం 92 మార్కులు సాధించాల్సి ఉంది.

ప్రతి పేపర్‌లోను హిందీ మినహాయించి 46 మార్కులు విద్యార్థి సాధించగలిగితేనే 10/10 సాధ్యమవుతుంది.

ఇక పరీక్షా విధానంలో చాలా మార్పులు వచ్చాయి.*

*ఏ సబ్జెక్టుకు బిట్‌ పేపర్‌ ఉండదు.

24 పేజీల బుక్‌లెట్‌ ఇస్తారు. అదనంగా ఏ విధమైన అడిషనల్‌ షీట్స్‌ ఇవ్వరు. ఆ 24 వేజీల బుక్‌లెట్‌లోనే అన్ని సమాధానాలు రాయాలి.

ఇక ప్రశ్నాపత్రాల విషయానికి వస్తే గతేడాది 30 నుంచి 40 శాతం ప్రశ్నలు సీసీఈ మోడల్‌లో ఉన్నాయి.

కానీ ఈ ఏడాది వందశాతం ప్రశ్నలు సీసీఈ మోడల్‌లోనే ఉంటాయి.*

 *అందువల్ల ప్రశ్నాపత్రాలు అంత సులభతరం కాదని ఉపాధ్యాయులు అంటున్నారు.* 

*పరీక్షా కేంద్రాల్లో కెమెరాలు*

*పదో తరగతి పరీక్షలను ఈ దఫా చాలా కఠినంగా నిర్వహించేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది. ఇన్విజి లేటర్లు ఉపాధ్యాయులు కాకుండా రెవెన్యూ, తదితర శాఖల నుంచి ఉద్యోగులను కేటాయించనున్నారు. ప్రతి పరీక్షా కేంద్రంలోను వెబ్‌ కెమెరాలు, సీసీ కెమెరాలు అమర్చి ఫ్లైయింగ్‌ స్వ్కాడ్‌ను పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నారు.*

*పరీక్షలో ప్రశ్నాపత్రాన్ని ఆయా పరీక్షా కేంద్రంలోని ప్రిన్సిపాల్స్‌, డీన్‌లు, ఇన్‌చార్జిలు వాట్సాప్‌, ఫేస్‌బుక్‌ వంటి ప్రసార మాధ్యమాల ద్వారా బయటకు పంపిస్తే అటువంటి వారిపై నాన్‌ బెయిల్‌బుల్‌ కేసులు పెట్టి అరెస్టు చేసే విధంగా ప్రణాళిక రూపొందించారు.

మొత్తంమీద పదో తరగతి పరీక్షలు చాలా కఠినతరం చేయడంతో విద్యార్థులు కష్టపడి సబ్జెట్‌ల వారీగా అవగాహన తెచ్చుకోవాల్సి ఉంది. ఆ దిశగానే ప్రస్తుతం ఉపాధ్యాయులు విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు*

10TH CLASS PUBLIC EXAMS MARCH 2020 SCERT MODEL PAPERS PDF FILES DOWNLOAD

10th CLASS PUBLIC EXAMS MARCH-2020 ANSWER BOOKLET PDF FILE DOWNLOAD

ఈ విద్యాసంవత్సరం(2019-2020) లో,10 వ తరగతి పరీక్షా విధానంలో వచ్చిన మార్పులు.🟣*

*🟢1. రెండు పేపర్లలో కలిపి 35 మార్కులు రావాలి.*

*🟢2.ఒక సబ్జెక్టు లో 10/10 రావాలంటే, విద్యార్థి కి 46 ,అంతకన్నా ఎక్కువ మార్క్స్ ఆ పేపర్ లో రావాలి…ఒకవేళ 44మార్క్స్ పేపర్-1లో,49మార్క్స్ పేపర్-2లో వచ్చినా కూడా, ఆవిద్యార్థి కి,10/10 వచ్చినట్టు కాదు..*

*🟢3. 10/10 మార్క్స్ స్కోర్ చేయాలంటే, పేపర్-1,పేపర్-2 లలో మొత్తం 92మార్క్స్ ,,ప్రతీ పేపర్ లో46 మార్క్స్ రావాలి.(హిందీ సబ్జెక్టు మినహాయించి)*

*🟢4.’హింది సబ్జెక్టు’ పాస్ మార్క్,20; హిందీలో 10/10రావాలంటే మాత్రం, 90మార్క్స్ రావాలి.*

*🟢5.ఈ సంవత్సరం,ఏ సబ్జెక్ట్ కి, “బిట్ పేపర్” ఉండదు.*

*🟢6.ఈ సంవత్సరం నుండి ,24 పేజీల “బుక్ లెట్” ఇస్తారు..అదనంగా, ఏవిధమైన అడిషనల్ షీట్స్ ఇవ్వరు.*

*కావున*

 *విద్యార్థులు,ఈ 24పేజీల బుక్ లెట్ లోనే,మొత్తం అన్ని ఆన్సర్స్ రాసేలా,స్టూడెంట్స్ కి, ట్రయినింగ్ ఇవ్వండి.*

*🟢7.ఈ సంవత్సరం, ఇన్విజిలేషన్, మరియు,”పరీక్షల మానెటరింగ్” చాలా కష్టంగా వుండబోతోంది..*

*ఇన్విజిలేటర్స్ గా,టీచర్స్ కాకుండా,రెవిన్యూ మొదలైన డిపార్ట్ మెంట్స్ నుండి రాబోతున్నారు..*

*🟢8.ప్రతీ ఎగ్జామ్ సెంటర్ లోను,వెబ్ కెమెరాలు,సి.సి కెమేరాలు అమర్చుతారు..ఫ్లయింగ్  స్క్వేడ్స్ సంఖ్య కూడా పెంచుతున్నారు.‌*

*కావున స్టూడెంట్స్,ఎగ్జామ్ హాలులో గాని, బయటినుండి గాని,ఏవిధమైన  సహాయం ఆశించినా భంగపాటు తప్పదు.

ఇలాంటి పరిస్థితుల మధ్య, విద్యార్థులు, ప్రశాంతంగా వుండి, ఆత్మవిశ్వాసం తో ఆన్సర్స్ రాసేలా,తర్ఫీదు ఇవ్వండి..*

*ఒకవేళ “మాల్ ప్రాక్టీస్” కి, పాల్పడుతూ దొరికితే,(స్లిప్స్ తో దిరికినా,ఒకరి బుక్ లెట్ ఇంకొకరి వద్ద దొరికినా),ఆ విద్యార్థి డిబార్ చెయ్యబడతాడు.*

*🟢9.ఫ్రిన్స్ ఫాల్స్, డీన్స్,ఇన్ చార్జ్ లకు హెచ్చరిక.*

*ఎగ్జామ్ ముందు గాని,ఎగ్జామ్ జరుగుతున్న సమయంలో గాని,క్వశ్చన్ పేపర్ ,వాట్స్ ఆఫ్,ఫేస్ బుక్ మొదలైన సామాజిక మాధ్యమాల్లో, ‘సర్క్యు లేట్’ ,చేసినట్లయితే,అలా చేసిన వారిని,వెంటనే అరెస్ట్ చేసి,వారి పై,నాన్-బెయిలబుల్ కేసులు, రిజిస్టర్ చేయబడతాయి.*

*🟢10. ఈసంవత్సరం క్వశ్చన్ పేపర్లు చాలా కఠినంగా ఉండబోతున్నాయి..గత సంవత్సరం అయితే,30%, నుండి 40% క్వఛ్ఛన్స్CCE మోడల్ లో వుండి, మిగిలిన క్వఛ్ఛన్స్ డైరెక్ట్ గా,ఈజీగా వుండేవి..కాని ఈ సంవత్సరం,100%క్వఛ్ఛన్స్ CCE మోడల్ లోనే వుంటాయి.*

  *కాబట్టి, ఈవిధమైన క్వశ్చన్ పేపర్స్ కి,ఈజీగా సమాధానాలు,రాయగలిగే లా,విద్యార్ధులకు తర్ఫీదు ఇవ్వండి..*

10TH CLASS ALL SUBJECTS STUDY MATERIAL NEW MODEL

10TH CLASS PUBLIC EXAMINATION MARCH-2020 TIME TABLE & MODEL PAPERS

error: Content is protected !!