State-Bank-Of-India-quick-banking-srvice-with-Mobile

State-Bank-Of-India-quick-banking-srvice-with-Mobile

SBI Quick: ఫోన్ ఉంటే చాలు… ఎస్‌బీఐ నుంచి ఈ సేవలన్నీ ఈజీగా పొందొచ్చు

టెక్నాలజీ పెరుగుతున్నకొద్దీ బ్యాంకింగ్ సేవలూ సులువవుతున్నాయి.

ఫోన్ ఉంటే చాలు… బ్యాంకింగ్ సేవల్ని ఎక్కడ్నుంచైనా పొందొచ్చు. ‘ఎస్‌బీఐ క్విక్’ పేరుతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేక బ్యాంకింగ్ సేవల్ని కస్టమర్లకు అందిస్తోంది.

మరి ఎస్‌బీఐ క్విక్ ఎలా పనిచేస్తుందో తెలుసుకోండి.

మీరు మీ ఫోన్ నెంబర్‌ను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో రిజిస్టర్ చేయించారా?

అయితే ఫోన్ బ్యాంకింగ్‌ సేవలు ఈజీగా పొందొచ్చు. ‘ఎస్‌బీఐ క్విక్’ ద్వారా బ్యాలెన్స్ ఎంక్వైరీ, ఇ-స్టేట్‌మెంట్, లోన్ ఆఫర్స్ ఇలా ఎలాంటి సేవలైనా సులువుగా పొందొచ్చు.

మీరు నెట్ బ్యాంకింగ్ ద్వారా ఇప్పటికే అనేక సేవలు పొందుతూ ఉండొచ్చు.

కానీ ఫోన్ బ్యాంకింగ్ ద్వారా కొన్ని సేవలు ఇంకా సులువుగా లభిస్తాయి.

ఖాతాదారులకు కావాల్సిన సమాచారాన్ని వెంటనే అందించేందుకు మిస్డ్ కాల్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ సేవల్ని ప్రారంభించింది SBI.

SBI QUICK MOBILE APP IN GOOGLE PLAY STORE DOWNLOAD

ముందుగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లు ‘ఎస్‌బీఐ క్విక్’ సేవల కోసం రిజిస్టర్ చేసుకోవాలి.

REG Account Number అని టైప్ చేసి మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌ నుంచి 09223488888 నెంబర్‌కు ఎస్ఎంఎస్ పంపాలి.

రిజిస్ట్రేషన్ సక్సెస్ అయితే మీ ఫోన్‌కు ఎస్ఎంఎస్ వస్తుంది. డీ రిజిస్టర్ చేయాలంటే ‘DREG’ అని టైప్ చేసి 09223488888 నెంబర్‌కు పంపాలి.

ఎస్‌బీఐ ఏటీఎం సెంటర్‌లోనూ రిజిస్టర్ చేసుకోవచ్చు. మీ ఏటీఎం కార్డును స్వైప్ చేసి స్క్రీన్‌పైన రిజిస్ట్రేషన్ ఆప్షన్ ఎంచుకోవాలి.

ఆ తర్వాత ఏటీఎం పిన్ ఎంటర్ చేయాలి. తర్వాత స్క్రీన్‌లో Phone Banking Registration క్లిక్ చేయాలి.

ఆ తర్వాత మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి.

మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు 6 అంకెల ఫోన్ బ్యాంకింగ్ పాస్‌వర్డ్ వస్తుంది.

మీ హోమ్ బ్రాంచ్‌కు వెళ్లి ఫోన్ బ్యాంకింగ్ దరఖాస్తు పూర్తి చేసివ్వాలి.

బ్యాంకు 6 అంకెల ఫోన్ బ్యాంకింగ్ పాస్‌వర్డ్‌ను కస్టమర్‌కు అందజేస్తుంది.

ఫోన్ బ్యాంకింగ్ రిజిస్ట్రేషన్ పూర్తైన తర్వాత ఈ కింది సేవలు పొందొచ్చు.

Generate ATM PIN:

మీరు ఎస్ఎంఎస్ ద్వారా మీ ఏటీఎం పిన్ జెనరేట్ చేయొచ్చు.

PIN అని టైప్ చేసి ఆ తర్వాత మీ కార్డు నెంబర్ చివర్లో నాలుగు అంకెలు, అకౌంట్ నెంబర్లో చివరి నాలుగు అంకెలు కలిపి 567676 నెంబర్‌కు ఎస్ఎంఎస్ పంపాలి.

మీ ఫోన్ నెంబర్‌కు OTP వస్తుంది.

ఆ  OTP రెండురోజులే పనిచేస్తుంది.

ఓటీపీతో ఏటీఎంకు వెళ్లి పిన్ జనరేట్ చేయొచ్చు

SBI Balance Enquiry:

మీరు మీ అకౌంట్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలంటే 09223766666 నెంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వాలి.

లేదా ‘BAL’ అని టైప్ చేసి ఇదే నెంబర్‌కు ఎస్ఎంఎస్ పంపాలి.

ఈ నెంబర్‌కు మిస్డ్ కాల్ ఇచ్చినా వివరాలు తెలుస్తాయి

SBI Mini Statement:

చివరి 5 లావాదేవీల మినీ స్టేట్‌మెంట్ పొందాలంటే 09223866666 నెంబర్‌కు కాల్ చేయాలి.

లేదా అదే నెంబర్‌కు ‘MSTMT’ అని టైప్ చేసి ఎస్ఎంఎస్ పంపాలి.

ఈ నెంబర్‌కు మిస్డ్ కాల్ ఇచ్చినా వివరాలు తెలుస్తాయి.

SBI E-Statement:

మీ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్‌కు సంబంధించి ఆరు నెలల ఇ-స్టేట్‌మెంట్ పొందొచ్చు.

ఇందుకోసం ESTMT అని టైప్ చేసి 09223588888 నెంబర్‌కు ఎస్ఎంఎస్ పంపాలి.

మీ రిజిస్టర్డ్ ఇమెయిల్ ఐడీకి స్టేట్‌మెంట్ వస్తుంది.

SBI Cheque Book Request:

మీకు చెక్ బుక్ కావాలంటే “CHQREQ” అని టైప్ చేసి 09223588888 నెంబర్‌కు ఎస్ఎంఎస్ పంపాలి.

ఆ తర్వాత మీ ఫోన్‌కు ఓ ఎస్ఎంఎస్ వస్తుంది.

ఆ తర్వాత మీ సమ్మతి తెలుపుతూ CHQACCY6-అంకెలు అదే నెంబర్‌కు రెండు గంటల్లో పంపాలి

ATM Card Blocking:

మీ ఏటీఎం కార్డ్ బ్లాక్ చేయాలంటే BLOCK అని టైప్ చేసి మీ కార్డులో చివరి నాలుగు నెంబర్లను కలిపి 567676 నెంబర్‌కు ఎస్ఎంఎస్ పంపాలి.

ఉదాహరణకు మీ కార్డు చివరి నాలుగు నెంబర్లు 0000 అయితే BLOCK0000 అని టైప్ చేసి 567676 నెంబర్‌కు ఎస్ఎంఎస్ పంపాలి.

మీ కార్డు బ్లాక్ చేయగానే మీకు ఎస్ఎంఎస్ అలర్ట్ వస్తుంది.

ATM Card On/Off:

మీ ఏటీఎం కార్డును మీరే కంట్రోల్ చేసుకోవచ్చు.

ఏటీఎం, పీఓఎస్, ఇ-కామర్స్, ఇంటర్నేషనల్, డొమెస్టిక్ యూసేజ్… ఏదైనా బ్లాక్ చేయొచ్చు.

ఇందుకోసం SWON/SWOFFATM/POS/ECOM/INTL/DOM అని టైప్ చేసి మీ కార్డ్ చివరి నాలుగు అంకెలు కలిపి 09223966666 నెంబర్‌కు కాల్ చేయాలి.

ఉదాహరణకు మీ కార్డు చివరి నాలుగు నెంబర్లు 0000 అయితే SWON/SWOFFATM/POS/ECOM/INTL/DOM 0000 అని టైప్ చేయాలి

SBI Loans:

ఇక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందించే రుణాల వివరాలు కూడా తెలుసుకోవచ్చు.

మీరు ‘HOME’ లేదా ‘CAR’ అని టైప్ చేసి 09223588888 నెంబర్‌కు కాల్ చేసి ఆఫర్లు తెలుసుకోవచ్చు

SBI QUICK MOBILE APP IN GOOGLE PLAY STORE DOWNLOAD

error: Content is protected !!