# State-Bank-Of-India-quick-banking-srvice-with-Mobile

- Link: https://amaravathiteacher.com/state-bank-of-india-quick-banking-srvice-with-mobile/
- Published: 2019-09-20T22:30:11+05:30
- Author: amaravathiteacher

# **_State-Bank-Of-India-quick-banking-srvice-with-Mobile_**

![](https://i0.wp.com/amaravathiteacher.com/wp-content/uploads/2019/09/download-
1-3.jpg?resize=296%2C296&ssl=1)

### **SBI Quick: ఫోన్ ఉంటే చాలు… ఎస్‌బీఐ నుంచి ఈ సేవలన్నీ ఈజీగా పొందొచ్చు**

### **టెక్నాలజీ పెరుగుతున్నకొద్దీ బ్యాంకింగ్ సేవలూ సులువవుతున్నాయి. **

### **ఫోన్ ఉంటే చాలు… బ్యాంకింగ్ సేవల్ని ఎక్కడ్నుంచైనా పొందొచ్చు. ‘ఎస్‌బీఐ క్విక్’ పేరుతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేక బ్యాంకింగ్ సేవల్ని కస్టమర్లకు అందిస్తోంది. **

### **మరి ఎస్‌బీఐ క్విక్ ఎలా పనిచేస్తుందో తెలుసుకోండి.**

### **మీరు మీ ఫోన్ నెంబర్‌ను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో రిజిస్టర్ చేయించారా? **

### **అయితే ఫోన్ బ్యాంకింగ్‌ సేవలు ఈజీగా పొందొచ్చు. ‘ఎస్‌బీఐ క్విక్’ ద్వారా బ్యాలెన్స్ ఎంక్వైరీ, ఇ-స్టేట్‌మెంట్, లోన్ ఆఫర్స్ ఇలా ఎలాంటి సేవలైనా సులువుగా పొందొచ్చు.**

### **మీరు నెట్ బ్యాంకింగ్ ద్వారా ఇప్పటికే అనేక సేవలు పొందుతూ ఉండొచ్చు. **

### **కానీ ఫోన్ బ్యాంకింగ్ ద్వారా కొన్ని సేవలు ఇంకా సులువుగా లభిస్తాయి. **

### **ఖాతాదారులకు కావాల్సిన సమాచారాన్ని వెంటనే అందించేందుకు మిస్డ్ కాల్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ సేవల్ని ప్రారంభించింది SBI.**

### **󠀁[SBI QUICK MOBILE APP IN GOOGLE PLAY STORE DOWNLOAD](https://play.google.com/store/apps/details?id=com.sbi.sbiquick&hl=en_IN)󠁿**

### **ముందుగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లు ‘ఎస్‌బీఐ క్విక్’ సేవల కోసం రిజిస్టర్ చేసుకోవాలి. **

### **REG Account Number అని టైప్ చేసి మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌ నుంచి 09223488888 నెంబర్‌కు ఎస్ఎంఎస్ పంపాలి.**

### ** రిజిస్ట్రేషన్ సక్సెస్ అయితే మీ ఫోన్‌కు ఎస్ఎంఎస్ వస్తుంది. డీ రిజిస్టర్ చేయాలంటే ‘DREG’ అని టైప్ చేసి 09223488888 నెంబర్‌కు పంపాలి.**

### **ఎస్‌బీఐ ఏటీఎం సెంటర్‌లోనూ రిజిస్టర్ చేసుకోవచ్చు. మీ ఏటీఎం కార్డును స్వైప్ చేసి స్క్రీన్‌పైన రిజిస్ట్రేషన్ ఆప్షన్ ఎంచుకోవాలి. **

### **ఆ తర్వాత ఏటీఎం పిన్ ఎంటర్ చేయాలి. తర్వాత స్క్రీన్‌లో Phone Banking Registration క్లిక్ చేయాలి. **

### **ఆ తర్వాత మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. **

### **మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు 6 అంకెల ఫోన్ బ్యాంకింగ్ పాస్‌వర్డ్ వస్తుంది. **

### **మీ హోమ్ బ్రాంచ్‌కు వెళ్లి ఫోన్ బ్యాంకింగ్ దరఖాస్తు పూర్తి చేసివ్వాలి. **

### **బ్యాంకు 6 అంకెల ఫోన్ బ్యాంకింగ్ పాస్‌వర్డ్‌ను కస్టమర్‌కు అందజేస్తుంది. **

### **ఫోన్ బ్యాంకింగ్ రిజిస్ట్రేషన్ పూర్తైన తర్వాత ఈ కింది సేవలు పొందొచ్చు.**

### **Generate ATM PIN: **

### **మీరు ఎస్ఎంఎస్ ద్వారా మీ ఏటీఎం పిన్ జెనరేట్ చేయొచ్చు. **

### **PIN అని టైప్ చేసి ఆ తర్వాత మీ కార్డు నెంబర్ చివర్లో నాలుగు అంకెలు, అకౌంట్ నెంబర్లో చివరి నాలుగు అంకెలు కలిపి 567676 నెంబర్‌కు ఎస్ఎంఎస్ పంపాలి. **

### **మీ ఫోన్ నెంబర్‌కు OTP వస్తుంది. **

### **ఆ  OTP రెండురోజులే పనిచేస్తుంది. **

### **ఓటీపీతో ఏటీఎంకు వెళ్లి పిన్ జనరేట్ చేయొచ్చు**

### **SBI Balance Enquiry: **

### **మీరు మీ అకౌంట్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలంటే 09223766666 నెంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వాలి. **

### **లేదా ‘BAL’ అని టైప్ చేసి ఇదే నెంబర్‌కు ఎస్ఎంఎస్ పంపాలి. **

### **ఈ నెంబర్‌కు మిస్డ్ కాల్ ఇచ్చినా వివరాలు తెలుస్తాయి**

### **SBI Mini Statement: **

### **చివరి 5 లావాదేవీల మినీ స్టేట్‌మెంట్ పొందాలంటే 09223866666 నెంబర్‌కు కాల్ చేయాలి. **

### **లేదా అదే నెంబర్‌కు ‘MSTMT’ అని టైప్ చేసి ఎస్ఎంఎస్ పంపాలి. **

### **ఈ నెంబర్‌కు మిస్డ్ కాల్ ఇచ్చినా వివరాలు తెలుస్తాయి.**

### **SBI E-Statement: **

### **మీ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్‌కు సంబంధించి ఆరు నెలల ఇ-స్టేట్‌మెంట్ పొందొచ్చు. **

### **ఇందుకోసం ESTMT అని టైప్ చేసి 09223588888 నెంబర్‌కు ఎస్ఎంఎస్ పంపాలి. **

### **మీ రిజిస్టర్డ్ ఇమెయిల్ ఐడీకి స్టేట్‌మెంట్ వస్తుంది.**

### **SBI Cheque Book Request: **

### **మీకు చెక్ బుక్ కావాలంటే “CHQREQ” అని టైప్ చేసి 09223588888 నెంబర్‌కు ఎస్ఎంఎస్ పంపాలి.**

### ** ఆ తర్వాత మీ ఫోన్‌కు ఓ ఎస్ఎంఎస్ వస్తుంది. **

### **ఆ తర్వాత మీ సమ్మతి తెలుపుతూ CHQACCY6-అంకెలు అదే నెంబర్‌కు రెండు గంటల్లో పంపాలి**

### _**ATM Card Blocking:**_

### **మీ ఏటీఎం కార్డ్ బ్లాక్ చేయాలంటే BLOCK అని టైప్ చేసి మీ కార్డులో చివరి నాలుగు నెంబర్లను కలిపి 567676 నెంబర్‌కు ఎస్ఎంఎస్ పంపాలి. **

### **ఉదాహరణకు మీ కార్డు చివరి నాలుగు నెంబర్లు 0000 అయితే BLOCK0000 అని టైప్ చేసి 567676 నెంబర్‌కు ఎస్ఎంఎస్ పంపాలి.**

### ** మీ కార్డు బ్లాక్ చేయగానే మీకు ఎస్ఎంఎస్ అలర్ట్ వస్తుంది.**

### **ATM Card On/Off: **

### **మీ ఏటీఎం కార్డును మీరే కంట్రోల్ చేసుకోవచ్చు. **

### **ఏటీఎం, పీఓఎస్, ఇ-కామర్స్, ఇంటర్నేషనల్, డొమెస్టిక్ యూసేజ్… ఏదైనా బ్లాక్ చేయొచ్చు. **

### **ఇందుకోసం SWON/SWOFFATM/POS/ECOM/INTL/DOM అని టైప్ చేసి మీ కార్డ్ చివరి నాలుగు అంకెలు కలిపి 09223966666 నెంబర్‌కు కాల్ చేయాలి. **

### **ఉదాహరణకు మీ కార్డు చివరి నాలుగు నెంబర్లు 0000 అయితే SWON/SWOFFATM/POS/ECOM/INTL/DOM 0000 అని టైప్ చేయాలి**

## **SBI Loans: **

### **ఇక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందించే రుణాల వివరాలు కూడా తెలుసుకోవచ్చు. **

### **మీరు ‘HOME’ లేదా ‘CAR’ అని టైప్ చేసి 09223588888 నెంబర్‌కు కాల్ చేసి ఆఫర్లు తెలుసుకోవచ్చు**

### **󠀁[SBI QUICK MOBILE APP IN GOOGLE PLAY STORE DOWNLOAD](https://play.google.com/store/apps/details?id=com.sbi.sbiquick&hl=en_IN)󠁿**

### 󠀁[AP TEACHERS LATEST NEWS](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)󠁿

 *  [ NEW SA1 Science Question Papers 2026 ](https://amaravathiteacher.com/sa1-science-question-papers-2026/)
 *  [ NEW SA1 EVS Key Papers 2026 PDF Download – 3rd to 5th Class ](https://amaravathiteacher.com/sa1-evs-key-papers-2026/)
 *  [ SA1 Maths Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-maths-key-papers-2026/)
 *  [ APPSC Group 2 Notification 2026 – 720 Vacancies, Post-wise Qualifications, Age, Fee, Dates & Syllabus Apply Online ](https://amaravathiteacher.com/appsc-group-2-notification-2026-720-vacancies-apply-online/)
 *  [ SA1 Hindi Key Papers 2026 PDF Download – 6th to 10th Class ](https://amaravathiteacher.com/sa1-hindi-key-papers-2026/)
 *  [ SA1 English Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-english-key-papers-2026/)
 *  [ SA1 Key Paper 2026 ](https://amaravathiteacher.com/sa1-key-paper-2026/)
 *  [ AP CPS to OPS Conversion 2026 – GO 158 Guidelines, NIDHI Application & Annexures ](https://amaravathiteacher.com/ap-cps-to-ops-conversion-2026-go-158-guidelines-nidhi-application-annexures/)
 *  [ SA1 Telugu Key Papers 2026 PDF Download – 1st to 10th Class ](https://amaravathiteacher.com/sa1-telugu-key-papers-2026/)
 *  [ AP SA1 2026 Class 10 School Level Observers Duties – DSE Proceedings 08-11-2026 ](https://amaravathiteacher.com/ap-sa1-2026-class-10-school-level-observers-duties-dse-orders/)

[View More ](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)

### 󠀁[TEACHERS SOFTWARES](https://amaravathiteacher.com/category/teachers-softwares/)󠁿

 *  [ SMC Elections 2026 Notification Voters List Download ](https://amaravathiteacher.com/smc-elections-2026-notification-voters-list-download/)
 *  [ Income Tax Online Calculator FY 2026-27 ](https://amaravathiteacher.com/income-tax-online-calculator-fy-2026-27/)
 *  [ Student id Card Download ](https://amaravathiteacher.com/student-id-card-download/)
 *  [ AP DA Arrears Calculator 2026 ](https://amaravathiteacher.com/ap-da-arrears-calculator-2026/)
 *  [ AP New DA Salary Calculator ](https://amaravathiteacher.com/ap-new-da-salary-calculator/)
 *  [ AP EHS Hospitals List ](https://amaravathiteacher.com/ap-ehs-hospitals-list/)
 *  [ AP Teachers ID Card Download ](https://amaravathiteacher.com/ap-teachers-id-card-download/)
 *  [ Pdf Compressor Online ](https://amaravathiteacher.com/pdf-compressor-online/)
 *  [ Online image compressor ](https://amaravathiteacher.com/online-image-compressor/)
 *  [ AP Medical Reimbursement Proposal Software ](https://amaravathiteacher.com/ap-medical-reimbursement-proposal-software/)

[View More ](https://amaravathiteacher.com/category/teachers-softwares/)
