submission-of-unemployment-benefit-claim-under-atal-bimith-kalyan-yojana

submission-of-unemployment-benefit-claim-under-atal-bimith-kalyan-yojana

గుడ్‌న్యూస్… వారందరికీ నిరుద్యోగ భృతి.. ఇలా దరఖాస్తు చేసుకోండి..

ఉద్యోగాలు కోల్పోయిన కార్మికులు సమీపంలోని ఈఎస్‌ఐ కార్యాలయంలో సంప్రదించవచ్చు.

స్వయంగాగానీ, ఆన్‌లైన్‌ద్వారాగానీ, పోస్టులోగానీ నిరుద్యోగ భృతి దరఖాస్తు పంపించవచ్చు.

కరోనా లాక్‌డౌన్ వల్ల ఎంతో మంది రోడ్డున పడ్డారు. ఉద్యోగాలు కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

అలాంటి వారిందరికీ కేంద్ర కార్మికశాఖ గుడ్‌న్యూస్ చెప్పింది.

కరోనా వల్ల ఉద్యోగాలు కోల్పోయిన ఈఎస్ఐ చందాదారులకు నిరుద్యోగ భృతి ఇస్తోంది కేంద్రం. వారి నెల జీతంలో 50 శాతం సొమ్మును భృతిగా చెల్లిస్తారు.

అటల్ బీమిత్ వ్యక్తి కల్యాణ్ యోజన పథకం కింద ఈ సాయం లభిస్తుందని కేంద్ర కార్మికశాఖ తెలిపింది. జులై 1 నుంచి అమల్లోకి వచ్చిన ఈ పథకం వచ్చే ఏడాది జూన్ 30 వరకు.. అంటే ఏడాది పాటు కొనసాగుతుంది.

ఈ పథకం కింద గతంలో వేతనంలో 25 శాతం నిరుద్యోగ భృతి లభించగా.. ప్రస్తుతం దాన్ని 50శాతానికి పెంచారు.

కనీసం రెండేళ్లు ఉద్యోగం చేసి, 78 రోజులకు తగ్గకుండా ESIC చందాదారులుగా ఉన్నవారు ఈ పథకానికి అర్హులు.

నిరుద్యోగ భృతి కింద కార్మికుడి సగటు దినసరి జీతంలో 50శాతం సొమ్మును గరిష్ఠంగా 90 రోజుల పాటు చెల్లిస్తారు.

SONU SOOD MERIT SCHOLARSHIPS CLICK HERE

DD SAPTHAGIRI VIDEO LESSONS SCHEDULE & LIVE LINK

ఉద్యోగాలు కోల్పోయిన కార్మికులు సమీపంలోని ఈఎస్‌ఐ కార్యాలయంలో సంప్రదించవచ్చు.

స్వయంగాగానీ, ఆన్‌లైన్‌ద్వారాగానీ, పోస్టులోగానీ నిరుద్యోగ భృతి దరఖాస్తు పంపించవచ్చు. దరఖాస్తుతో ఆధార్‌ కాపీ, బ్యాంకు వివరాలు, అఫిడవిట్‌ను సమర్పించాల్సి ఉంది.

గతంతో పోల్చితే నిబంధనలను కూడా సరళీకరించారు.

ఇంతకుముందు సంస్థ యజమాని ద్వారా మాత్రమే దరఖాస్తులు పంపించాల్సి ఉండేది. కానీ ఇప్పుడు స్వయంగా కార్మికులే సమర్పించుకునే వీలు కలిగించారు.

నిరుద్యోగ భృతి సొమ్ము నేరుగా కార్మికుల బ్యాంకు ఖాతాలోనే పడుతుంది.

గతంలో ఉద్యోగం కోల్పోయిన 90 రోజుల తర్వాతే దరఖాస్తు చేయాల్సి ఉండేది.

కానీ ప్రస్తుతం దాన్ని 30 రోజులకు తగ్గించారు. అంటే.. ఉద్యోగం కోల్పోయిన 30 రోజుల తర్వాత నిరుద్యోగ భృతికి దరఖాస్తు చేసుకోవచ్చు.

అర్హులైన ప్రతి ఒక్కరికీ దరఖాస్తు అందిన 15 రోజుల్లోనే ఖాతాలో డబ్బును జమచేస్తారు.

భవిష్యత్‌లో అటల్ బీమిత్ వ్యక్తి కల్యాణ్ యోజన పథకం ఒరిజినల్ ఎలిజిబిలిటీ కండిషన్స్‌తో కొనసాగనుంది.

మార్చి 23, 2020కి ముందు జనవరి 1, 2021 తర్వాత ఉద్యోగం కోల్పోయిన వారికి.. నిరుద్యోగ భృతి కింద వేతనంలో 25శాతం సొమ్మును చెల్లిస్తారు.

కరోనా సమయంలో ఉద్యోగం కోల్పోయిన వారికి మాత్రం 50శాతం సొమ్మును చెల్లిస్తారు.

error: Content is protected !!