Swachh Andhra Pledge Download
ప్రతి నెల మూడవ శనివారము అన్ని పాఠశాల లలో విధిగా స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్చ దివస్ “కార్యక్రమాన్ని నిర్వహించేలా రూపొందించారు అందులో భాగముగా మార్చి -2025 ” నెలలో అంశము ” Ban on Single use Plastic ” అనే అంశము పై స్వచ్చ కార్యక్రమాలు చేపట్టాలని, స్వచ్ఛత ప్రాధాన్యంపై విద్యార్ధులు, తల్లి తండ్రులు, ప్రజల్లో అవగాహన కల్పించి, అందరిని భాగస్వామ్యులను చేయాలని సూచించారు.
తేది 15-03-2025 న చేయవలసిన కార్యక్రమాలు :
- జిల్లాలో అన్ని యాజమాన్యాల పాఠశాలల్లో స్వచ్ఛత ప్రతిజ్ఞ చేయవలెను.
- విద్యార్ధుల భాగస్వామ్యముతో ప్రతి పాఠశాలలో తరగతి గదులు శుభ్రముగా ఉంచే విధముగా విద్యార్ధులకు అవగాహన కల్పించవలెను.
- స్వచ్ఛ ఆంధ్ర- స్వచ్ఛ దివస్ కార్యక్రమములో భాగముగా ప్రతి పాఠశాలలో తరగతి గదులు, పాఠశాల ఆవరణ పరిసరాలు పరిశుభ్రముగా మొక్కల పెంపకము మరియు నీటి సరఫరా(Running Water) సదుపాయము వుండే విధముగా తగు చర్యలు గైకొన వలెను.
- మీ మండలములో Best Swatch School Contest ద్వారా అత్యంత పరిశుభ్రమైన పాఠశాలకు అవార్డు ప్రకటించి ఈ కార్యాలయమునకు తెలియ జేయవలెను.
- ప్లాస్టిక్ రహిత క్యాంపస్ డ్రైవ్ ద్వారా విద్యార్థులకు ప్లాస్టిక్ వినియోగముపై అవగాహన కల్పించవలెను.
- వ్యర్థ పదార్థాల విభజన పై అవగాహన కల్పించవలెను. తడి చెత్తకు- Green dustbin, పొడి చెత్తకు -blue dustbin, హానికరమైన చెత్తకు Red dustbin వినియోగించేలా చర్యలు తీసుకోనవలెను.
- పర్యావరణ సహిత సమాజము – అనే అంశ ముపై డ్రాయింగ్ మరియు క్విజ్ పోటీలు నిర్వహించవలెను మరియు వ్యర్ధ పదార్ధాల ద్వారా సరికొత్త ప్రాజెక్ట్ లు తయారీ చేసే విధముగా విద్యార్ధులను ప్రోత్సహించవలెను.
- ప్రతి పాఠశాలలో విద్యార్ధులకు సరియైన విధముగా చేతులు కడుక్కోవడం మరియు పరిశుభ్రత ప్రదర్శన ఏర్పాటు చేసి, వారికి తగు అవగాహన కల్పించవలెను.
- జిల్లాలో అన్ని యాజమాన్యాల పాఠశాలల వారు, పరిశుభ్రతను ప్రోత్సహించే ప్లకార్డులతో విద్యార్థులు తో స్వచ్ పాఠశాల ర్యాలీ నిర్వహించవలెను.
- కమూనిటీ క్లీన్ డ్రైవ్ క్రింద విద్యార్ధులకు అవగాహన కల్పించవలెను.
- జిల్లాలో అన్ని యాజమాన్యాల పాఠశాలలలో ఆహార వ్యర్థాల లేకుండా చూసే విదముగా ఆహార వ్యర్థాలను తగ్గించడానికి అవగాహన కార్యక్రమాములు నిర్వహించవలెను.
- పాఠశాలలో కంపోస్ట్ Kit తయారికి తగు ఏర్పాట్లు చూడవలెను. మరియు వర్షపు నీరు భద్రపరిచే ఏర్పాట్లు చేస్తూ, సదరు అంశముపై విధ్యార్దులకు తగిన అవగాహన కల్పించవలెను.
పైన తెల్పిన అన్ని కార్యక్రమాలను Photos, Videos తీయించి SASA app లో submit చెయ్యాలి.
“స్వచ్ఛ ఆంధ్ర- స్వచ్చ దివస్ ” లో ఏ ఏ activities చేసారు, category wise ఎంతమంది పాల్గొన్నారు అనేది జాగ్రత్తగా “స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ దివస్” QUESTIONNAIRE fill చేసి submit చెయ్యాలి. అదే విధంగా questionnaire Excel format కూడా submit చెయ్యాలి.
పాఠశాల ఆవరణలో ప్లాస్టిక్ వాడకము నిషేదించవలెను.
పై విషయములన్నింటిని దృష్టి లో ఉంచుకొని అందరు ఉప విద్యాశాఖాధికారులు, మండల విద్యాశాఖాధికారులు తమ పరిధిలో గల అన్ని యాజమాన్యాల ప్రాదమిక, ప్రాధమికోన్నత మరియు ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు తగు సూచనలు జారీ చేయవలేనని తెలుపుతూ సదరు కార్యక్రమము తే 15.03.2025 ది న అన్ని పాఠశాలలలో జరుపుతూ మరియు ప్రతి నెల మూడవ శనివారము విధిగా నిర్వహించేలా తగు చర్యలు తీసుకోనవలేనని ఆదేశించడ మైనది. మరియు ఉపవిద్యాశాఖాధికారి వారి కార్యాలయము మరియు మండల విద్యాశాఖాధికారి కార్యాలయములలో కూడా పైన తెలిపిన కార్యక్రమములు అమలు చేయవలసినదిగా తెలియజేయడమైనది.

SWARNA ANDHRA SWACHHA ANDHRA – SASA APP LATEST VERSION DOWNLOAD