Swarna Andhra Swachha Andhra (SASA) December 2025 Activities

Swarna Andhra Swachha Andhra (SASA)

Swarna Andhra Swachha Andhra (SASA) December 2025 Activities

కార్యక్రమాలు & సూచనలు : 

ప్రభుత్వ ఆదేశాల మేరకు, ప్రతి నెల మూడవ శనివారము నిర్వహించవలసిన “స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ ఆంధ్ర దినోత్సవం” డిసెంబర్ 2025 నెలకు గాను 20.12.2025 (శనివారం) న “Opportunities in Environment” అనే Theme జిల్లాలోని అన్ని ప్రభుత్వ / ప్రైవేట్ పాఠశాలల్లో తప్పనిసరిగా నిర్వహించవలసిందిగా ఆదేశించడమైనది.
ఈ థీమ్ యొక్క ప్రధాన ఉద్దేశ్యం పర్యావరణ రంగంలో ఉన్న ఉపాధి, స్వయం ఉపాధి మరియు ఉద్యోగ అవకాశాలపై విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు సమాజంలో అవగాహన కల్పించడం.

కాన్సెప్ట్ కమ్యూనికేషన్ & ప్రధాన కార్యక్రమాలు : 

  • పర్యావరణ పరిరక్షణతో సంబంధం ఉన్న ఉపాధి మరియు స్వయం ఉపాధి అవకాశాలపై అవగాహన కార్యక్రమాలు.
  •  ఘన మరియు ద్రవ వ్యర్ధాల నిర్వహణలో  నైపుణ్యాభివృద్ధి అంశాలపై చర్చలు. (Solid & Liquid Waste Management)
  • వ్యర్థాల సేకరణ, వర్గీకరణ, పునర్వినియోగం, రీసైక్లింగ్, Up సైక్లింగ్ వంటి వినుత్నమైన కార్యకలాపాలపై అవగాహన.
  • “ఒక కుటుంబం – ఒక ఉపాధ్యమి (One Family – One Entrepreneur)” భావనపై ప్రచారం.
  • పర్యావరణానికి అనుకూలమైన ఉత్పత్తులు, స్టార్టప్ ఆలోచనలపై విద్యార్థులకు ఉపన్యాసాలు.
  • విద్యార్థులతో వ్యాస రచన, వక్తృత్వం, పోస్టర్ తయారీ, నాటికలు, మోడల్ ప్రదర్శనలు వంటి పోటీలు నిర్వహించడం.
  • స్థానిక స్థాయిలో పర్యావరణ సమస్యలకు పరిష్కారాలు సూచించే ఆలోచనలను ప్రోత్సహించడం.
  • Before & After , SASA Mobile App 50 20.12.2025 ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 1:00 గంటల మధ్య తప్పనిసరిగా అప్లోడ్ చేయాలి.

ఆశించిన ఫలితాలు: 

  • విద్యార్థుల్లో పర్యావరణ రంగంలో ఉన్న ఉపాధి అవకాశాలపై అవగాహన పెరుగుతుంది.
  • స్వయం ఉపాధి, ఉపాధ్యమి దృక్పథం (Entrepreneurial Mindset) అభివృద్ధి.
  • స్థానిక వనరుల వినియోగంతో ఆర్థిక అవకాశాల సృష్టి.
  • పర్యావరణ పరిరక్షణతో ఆర్థిక అభివృద్ధి సాధన, శుభ్రమైన, హరిత ఆంధ్రప్రదేశ్ లక్ష్య సాధనకు తోడ్పాటు.

పర్యవేక్షణ & నివేదికలు

అన్ని కార్యక్రమాల ఫొటోలు, వీడియోలు మరియు సంక్షిప్త నివేదికలను SASA Mobile App ద్వారా తప్పనిసరిగా అప్లోడ్ చేయాలి. Before & After visuals ను తప్పనిసరిగా నమోదు చేయాలి.
error: Content is protected !!