Swarna Andhra Swachha Andhra (SASA)
Swarna Andhra Swachha Andhra (SASA) December 2025 Activities
కార్యక్రమాలు & సూచనలు :
ప్రభుత్వ ఆదేశాల మేరకు, ప్రతి నెల మూడవ శనివారము నిర్వహించవలసిన “స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ ఆంధ్ర దినోత్సవం” డిసెంబర్ 2025 నెలకు గాను 20.12.2025 (శనివారం) న “Opportunities in Environment” అనే Theme జిల్లాలోని అన్ని ప్రభుత్వ / ప్రైవేట్ పాఠశాలల్లో తప్పనిసరిగా నిర్వహించవలసిందిగా ఆదేశించడమైనది.
ఈ థీమ్ యొక్క ప్రధాన ఉద్దేశ్యం పర్యావరణ రంగంలో ఉన్న ఉపాధి, స్వయం ఉపాధి మరియు ఉద్యోగ అవకాశాలపై విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు సమాజంలో అవగాహన కల్పించడం.
కాన్సెప్ట్ కమ్యూనికేషన్ & ప్రధాన కార్యక్రమాలు :
- పర్యావరణ పరిరక్షణతో సంబంధం ఉన్న ఉపాధి మరియు స్వయం ఉపాధి అవకాశాలపై అవగాహన కార్యక్రమాలు.
- ఘన మరియు ద్రవ వ్యర్ధాల నిర్వహణలో నైపుణ్యాభివృద్ధి అంశాలపై చర్చలు. (Solid & Liquid Waste Management)
- వ్యర్థాల సేకరణ, వర్గీకరణ, పునర్వినియోగం, రీసైక్లింగ్, Up సైక్లింగ్ వంటి వినుత్నమైన కార్యకలాపాలపై అవగాహన.
- “ఒక కుటుంబం – ఒక ఉపాధ్యమి (One Family – One Entrepreneur)” భావనపై ప్రచారం.
- పర్యావరణానికి అనుకూలమైన ఉత్పత్తులు, స్టార్టప్ ఆలోచనలపై విద్యార్థులకు ఉపన్యాసాలు.
- విద్యార్థులతో వ్యాస రచన, వక్తృత్వం, పోస్టర్ తయారీ, నాటికలు, మోడల్ ప్రదర్శనలు వంటి పోటీలు నిర్వహించడం.
- స్థానిక స్థాయిలో పర్యావరణ సమస్యలకు పరిష్కారాలు సూచించే ఆలోచనలను ప్రోత్సహించడం.
- Before & After , SASA Mobile App 50 20.12.2025 ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 1:00 గంటల మధ్య తప్పనిసరిగా అప్లోడ్ చేయాలి.
ఆశించిన ఫలితాలు:
- విద్యార్థుల్లో పర్యావరణ రంగంలో ఉన్న ఉపాధి అవకాశాలపై అవగాహన పెరుగుతుంది.
- స్వయం ఉపాధి, ఉపాధ్యమి దృక్పథం (Entrepreneurial Mindset) అభివృద్ధి.
- స్థానిక వనరుల వినియోగంతో ఆర్థిక అవకాశాల సృష్టి.
- పర్యావరణ పరిరక్షణతో ఆర్థిక అభివృద్ధి సాధన, శుభ్రమైన, హరిత ఆంధ్రప్రదేశ్ లక్ష్య సాధనకు తోడ్పాటు.
పర్యవేక్షణ & నివేదికలు
అన్ని కార్యక్రమాల ఫొటోలు, వీడియోలు మరియు సంక్షిప్త నివేదికలను SASA Mobile App ద్వారా తప్పనిసరిగా అప్లోడ్ చేయాలి. Before & After visuals ను తప్పనిసరిగా నమోదు చేయాలి.
SWARNA ANDHRA SWACHHA ANDHRA – SASA APP LATEST VERSION DOWNLOAD
Swarna Andhra Swachha Andhra SASA DECEMBER 2025 Pledge Download
AP TEACHERS LATEST UPDATES AP Teachers updates, government orders, AP TET, DSC, SA1 key papers, textbook solutions and free school tools.
