TCS National Qualifier Test: కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగం కావాలా… ఈ పరీక్ష రాయండి
Registration Closes on 17 th October 2020
FREE
Test Dates: 24th/25th/26th October 2020
ఇప్పుడిప్పుడే చదువు పూర్తి చేసుకొని మంచి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న యువతీయువకులకు శుభవార్త.
కార్పొరేట్ కంపెనీల్లో ఉద్యోగావకాశాలను కల్పించేందుకు టీసీఎస్ అయాన్ నేషనల్ క్వాలిఫయర్ టెస్ట్ నిర్వహిస్తోంది.
కార్పొరేట్ కంపెనీలో జాబ్ కోరుకుంటున్నారా? చదువు పూర్తి కాగానే మంచి కంపెనీలో అడుగుపెట్టాలనుకుంటున్నారా?
అయితే మీకు గుడ్ న్యూస్. యువతీయువకులు దేశంలోని బడాబడా కార్పొరేట్ కంపెనీల్లో ఉద్యోగాలు పొందేలా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్-TCS తన వంతు కృషి చేస్తోంది.
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌కు చెందిన టీసీఎస్ అయాన్ నేషనల్ క్వాలిఫయర్ టెస్ట్-NQT నిర్వహిస్తోంది.
ఈ టెస్ట్ ద్వారా టీసీఎస్‌లో ఫ్రెషర్స్‌ని నియమించుకోవడంతో పాటు ఇతర కార్పొరేట్ కంపెనీలకు నైపుణ్యం గల యువతీయువకుల్ని అందించనుంది.
ప్రస్తుతం నేషనల్ క్వాలిఫయర్ టెస్ట్ రిజిస్ట్రేషన్స్ కొనసాగుతున్నాయి.
టీసీఎస్‌తో పాటు ఫ్రెషర్‌ని నియమించుకోవాలనుకునే ఇతర కంపెనీలకు టీసీఎస్ అయాన్ నేషనల్ క్వాలిఫయర్ టెస్ట్ కామన్ గేట్‌వేగా మారనుంది.
అంతేకాదు… ఉద్యోగాలు కోరుకునే ఫ్రెషర్స్‌కి ఇది సరైన వేదిక. నేషనల్ క్వాలిఫయర్ టెస్ట్ ద్వారా లక్షలాది మంది యువతీయువకులు హైక్వాలిటీతో నిర్వహించే స్టార్డర్డైజ్డ్ టెస్ట్ ద్వారా కార్పొరేట్ కంపెనీలకు అన్ని అర్హతలు ఉన్న నిపుణులను అందిస్తామన్నారు.
టీసీఎస్‌తో పాటు ఇతర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ-IT, బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్స్యూరెన్స్-BFSI, మ్యాన్యుఫ్యాక్చరింగ్, ఫార్మా, ఎఫ్ఎంసీజీ రంగాల్లో ఉద్యోగాలు కోరుకునే ఫ్రెషర్స్ ఈ పరీక్ష రాయొచ్చు.
2021 లో టీసీఎస్ క్యాంపస్ హైరింగ్ మొదలుపెట్టనుంది. అందులో పాల్గొనేవారు టీసీఎస్ అయాన్ నేషనల్ క్వాలిఫయర్ టెస్ట్‌లో క్వాలిఫై కావాలి.
అండర్ గ్రాడ్యుయేట్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ఈ పరీక్ష రాయొచ్చు.
ఫ్రెషర్స్ మాత్రమే కాదు, ఆయా రంగాల్లో రెండేళ్ల అనుభవం ఉన్నవారు కూడా అప్లై చేయొచ్చు. అభ్యర్థులు ఇంట్లో నుంచే ఈ పరీక్ష రాయొచ్చు. లేదా దగ్గర్లోని టీసీఎస్ అయాన్ సెంటర్‌లో ఎగ్జామ్ రాయొచ్చు.
మొదటి టెస్ట్ 2020 అక్టోబర్ 24 నుంచి 26 వరకు ఉంటుంది. దరఖాస్తు చేయడానికి 2020 అక్టోబర్ 17 చివరి తేదీ. ఈ ఎగ్జామ్ రాయడానికి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
టీసీఎస్ అయాన్ నేషనల్ క్వాలిఫయర్ టెస్ట్‌లో సాధించిన స్కోర్‌కు రెండేళ్ల వేలిడిటీ ఉంటుంది. తమ స్కోర్ పెంచుకోవడానికి అభ్యర్థులు ఎన్నిసార్లైనా పరీక్ష రాయొచ్చు.
నేషనల్ క్వాలిఫయర్ టెస్ట్‌కు సంబంధించిన పూర్తి వివరాల