Teacher-MLC-election-enrollment-your-vote-latest-updates-2020

Teacher-MLC-election-enrollment-your-vote-latest-updates-2020

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు కసరత్తు

వివరణ& సవరణ

As per AP Chief Election officer   instruction No 5(XIII) of Memo no 821 Dt 23.9.2020

>Teacher MLC  ఓటరు గా enrole అగుటకు ఇంటి Address మాత్రమే criteria. అసెంబ్లీ ఓటు లేకపోయినా,వేరే జిల్లా లో ఉన్నా ,వేరే  జిల్లా  హైస్కూల్/college    (ది1.11.2020   నాటికి 3 సంవత్స‌ ల సర్వీసు తో )పనిచేస్తున్నా  ఓటరు గా నమోదు కావచ్చును.

> అసెంబ్లీ ఓటు ఎక్కడ ఉన్నా present Address  ఉన్నచోట mlc  ఓటరుగా నమోదు కావచ్చును

> Voter id card&అసెంబ్లీ ఓటు వివరాలు కేవలం  identity  గా మాత్రమే ఉపయోగపడును.

> పేరు, తండ్రి/ భర్త(Relation) పేరు, Address , Service certificate, Photo , Epic card , Date of Birth, Date of entry into service,Date of Retirement ,Cell no  వివరాలు  Form 19  దరఖాస్తు నింపుటకు తప్పక  కావలెను

>Off line  లో Form19  సమర్పించే వారు ,ఇంటి అడ్రస్   (ఓటు వివరాలు వేరే చోట ఉన్నను)ఉన్న  మండల తహశీల్దారు, MDO, /Mpl commissioner  కార్యాలయములో ఇవ్వవలెను.

> ఉదా హరణకు అసెంబ్లీ‌ఓటు గురజాలలో ఉన్నప్పటికి గుంటూరులో నివాసము చిరునామా Form19 లో ఇస్తే  గుంటూరు లోనే mlc  ఓటు ఇవ్వబడును. వీరు offline  Form 19 గుంటూరుMpl commissioner  కు ఇవ్వ వలసి ఉండును

1 నుంచి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గాల ఓటర్ల నమోదు*

*రెండు నియోజకవర్గాల్లో ముగియనున్న పదవీకాలం*

️రాష్ట్రంలో రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గాల పదవీ కాలం వచ్చే ఏడాది మార్చి 29వ తేదీతో ముగియనుంది.

 ️ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీగా ఉన్న రాము సూర్యనారాయణ,

కృష్ణా-గుంటూరు టీచర్ ఎమ్మెల్సీగా ఉన్న ఏ.ఎస్.రామకృష్ణ వచ్చే ఏడాది మార్చి 29వ తేదీన రిటైర్ కానున్నారు. 

️ఈ నేపథ్యంలో ఈ రెండు నియోజకవర్గాల్లో ఓటర్ల నమోదుకు కేంద్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ప్రకటించింది. 

️2020 నవంబర్ 1 అర్హత తేది కాగా.. వచ్చే నెల 1వ తేదీ నుంచి నమోదు ప్రక్రియ ప్రారంభం కానుంది.

నవంబర్ 6 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు.

డిసెంబర్ 1న ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రకటించనున్నారు.

అదే తేదీ నుంచి డిసెంబర్ 31 వరకు అభ్యంతరాలను, మార్పులు చేర్పులను స్వీకరించనున్నారు.

ఓటర్ల తుది జాబితాను జనవరి 18వ తేదీన ప్రకటిస్తారు.

 ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియను కేంద్ర ఎన్నికల సంఘం ప్రారంభించింది.

ఓటర్ల నమోదు ప్రక్రియకు శ్రీకారం చుట్టాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని ఆదేశించింది.

ఓటర్ల జాబితా తయారుకు అక్టోబరు1న ఈసీ బహిరంగ నోటీసు ఇవ్వనుంది.

ONLINE FORM-19 FOR TEACHERS MLC OFFICIAL WBSITE

IIIT ENTRANCE TEST COMPLT DETAILS

FORM-19 Claim for inclusion of name in the electoral roll for a Teachers’ constituency

అర్హతలు

ది 1.10.2020  నుండి ప్రారంభించి 6.11.2020 వరకు అర్హులైన టీచర్లు, అధ్యాపకులు ఓటర్లుగా చేరుటకు ఫారం-19 లో దరఖాస్తులను తమకు అసెంబ్లీ ఓటున్న మండల తహశీల్దారు లేక మున్సిపల్ కార్యాలయములో సమర్పించవలసి యన్నది.

‍CEO Andhra  website  ద్వారా online  లో కూడ సమర్పించవచ్చును.

ది 1.11.2020  కు ముందు  గత 6 సంవత్సరాలలో కనీసం 3 సంవత్సరాలు  సర్వీసు ను (సెకండరీ స్థాయి మరియు ఆ పైస్థాయి ప్రభుత్వ గుర్తింపు పొందిన విద్యాసంస్థలలో పనిచేస్తూ)  పూర్తి చేసిన  టీచర్లు, అధ్యాపకులు , ప్రొఫెసర్లు ఓటరు గా నమోదగుటకు అర్హులు.

‍ అనగా ది 1..11.2020 నాటికి 3 సంవత్సరాల నిరంతరాయ సర్వీసు( ఒకే విద్యాసంస్థలో గాని వేరు విద్యా సంస్ధలలో గాని ) పూర్తి చేసుకొన్న, ప్రభుత్వ , జిల్లాపరిషత్ ,ఎయిడెడ్, మున్సిపల్, సాంఘీక సంక్షేమ,, Tribal welfare, గురుకలం, మోడల్ ,KGB, unaided  మేనేజ్ మెంట్ల క్రింద ఉన్నహైస్కూల్స్  జూనియర్ ,డిగ్రీ, పాలిటెక్నిక్, యూనివర్సిటీ, B.Ed  కాలేజీలు, DIET, మెడికల్, ఇంజనీరింగ్ కాలేజీలలో పనిచేయుచున్న బోధనా సిబ్బంది ( కేడర్ తో నిమిత్తం లేకుండా) అందరూ ఓటరుగా నమోదు అగుటకు అర్హులు.

2015  లో తయారు చేసిన ఓటరు జాబీతాలు రద్దయినవి కనుక మరల అందరూ తాజా ఓటరుగా నమోదుకావాలి

ఇతర జిల్లాలలో పనిచేయుచూ అసెంబ్లీ ఓటు హక్కు ఈ 4 జిల్లాలలో కలిగి యున్నవారు కూడ ఓట రుగా నమోదు కావచ్చు.

ఈ 4 జిల్లాలలో అసెంబ్లీ ఓటు హక్కు లేని వారు ఈ జిల్లాలలో పనిచేస్తున్నపటికి ఓటరుగా నమోదు  అగుటకు అనర్హులు

Form19 లో ఫొటో పేరు, తండ్రిపేరు, డోరు నెంబరు , చిరునామా, ఓటరు కార్డు నెంబరు, ఓటరు సీరియల నెంబరు, Cell నెంబరు, విద్యాలయ అధిపతి నుండి Service certificate   తదితర వివరములు పొందు పరచాలి.

Form 19 లో దరఖాస్తును online  లో  photo, Service certificate  ను upload  చేసి  పంపిస్తే .Revenue staff  వెరిఫికేషన్ కు వచ్చినప్పుడు service certicate  ను తీసుకొని దరఖాస్తు కాపీ పై సంతకం పెట్టించు కొంటారు

Unaided  లో పనిచేసే టీచర్లు తమ‌ EPF  No  తో సహా service certificate ను సంబధిత శాఖ జిల్లా/ జోనల్ స్థాయి ధృవీకరణ చేయాలి

Assemvly Voter Serial No  తెలియని వారు ECI< space> EPICCARD NO> తో 1950 కు SMS  చేసి అసెంబ్లీ ఓటు వివరాలు పొందవచ్చును.

ఈ వివరములు తప్పని సరిగా నమోదు చేయాలి.

Form19 తో ఓటరు కార్డు, Service certificate ను జతపరచ వలెను

Electoral Registration  కార్యాలయములలో పూర్తి చేసిన  దరఖాస్తులు గుత్తగా తీసుకోరు.

ఒక టీచర్ తన, తన కుటుంబ సభ్యుల దరఖాస్తులు మాత్రమే‌ సమర్పించవచ్చును. అయితే విద్యాలయ అధిపతి/HM/Principal  తమ వద్ద పనిచేసే టీచర్లందరి ఓటు దరఖాస్తులు (ఫారం19 లను) కవరింగ్ లెటర్ తో సంబంధిత ERO  కు పంపవచ్చును. పైన తెల్పిన విద్యా సంస్థలలో పనిచేసి ది 1.11.2017  తర్వాత పదవీ విరమణ‌చెందిన బోధనా సిబ్బంది కూడ అర్హులే

Know Your Application Status FORM-19

FORM-19 Claim for inclusion of name in the electoral roll for a Teachers’ constituency

ELECTION COMMISSION AP OFFICIAL WEBSITE

error: Content is protected !!