Teachers-casual-leaves-sp-levaes-revised-clarification-given-cse

Teachers-casual-leaves-sp-levaes-revised-clarification-given-cse

పాఠశాల ఉపాధ్యాయులకు 2.5 సి.యల్  రెండు నెలలకు (నవంబర్,డిశంబర్)వర్తిస్తాయని, SCL -1,women scl -1 ఇస్తూ ఉత్తర్వులు….*

నవంబరు, డిశంబరు నెలలకు గాను దామాషా పద్ధతిన పురుష ఉపాధ్యాయులు 3.5శలవులు (2.5CL+1SPCL), 

★ మహిళా ఉపాధ్యాయినులు 4.5 శలవులు (2.5CL+2SPCL) వినియోగించుకునే విధంగా సవరణ ఉత్తర్వులు జారీ చేసిన ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ..

*కరోన వచ్చిన వారు మెడికల్ లీవ్ లేదా బాలన్స్ క్యాజువల్ లీవ్, spl. క్యాజువల్ లీవ్ కూడా వాడుకోవచ్చు*

CLARIFICATION ABOUT TEACHERS CLS AP CSE ORDERS DOWNLOAD

జగనన్న విద్యాకానుక వారోత్సవాలు’ 23-11-2020 నుండి 28-11-2020 వరకు చేయాల్సిన కార్యక్రమాలు CLICK HERE

APPSC DEPARTMENTAL TESTS ONLINE TSTS & MOCK TESTS, STUDY MATERIAL

పురుషులకు 3.5, మహిళలకు 4.5**ఉపాధ్యాయుల సెలవులపై పరిమితి*ఉపాధ్యాయుల సెలవుల వినియోగంపై పాఠశాల విద్యాశాఖ పరిమితులు విధించింది. దామాషా పద్ధతిలో సెలవుల వినియోగానికి అనుమతించింది.* సెలవులపై శుక్రవారం ఒక్కరోజే ఒకదాని తర్వాత ఒకటిగా రెండు ఆదేశాలు జారీ చేసింది. నవంబరు, డిసెంబరు నెలల్లో 2.5 క్యాజువల్‌ సెలవులను మాత్రమే వినియోగించుకోవాలని ఆదేశిస్తూ మొదట ఉదయం ఆదేశాలు ఇచ్చింది. ప్రత్యేక క్యాజువల్‌ సెలవులు తీసుకోకూడదని, కరోనా పాజిటివ్‌ వస్తే మెడికల్‌ సెలవులు పెట్టుకోవాలని పేర్కొంది. దీనిపై ఉపాధ్యాయుల నుంచి ఫిర్యాదులు రావడంతో మధ్యాహ్నం నుంచి వాటిని సవరిస్తూ కొత్త ఉత్తర్వులు జారీచేశారు. క్యాజువల్‌ సెలవులు 2.5తోపాటు ప్రత్యేక క్యాజువల్‌ సెలవుల్లో ఒకటి, మహిళలకు ఇచ్చే ప్రత్యేక క్యాజువల్‌ సెలవు మరొకటి వినియోగించుకునేందుకు అవకాశం కల్పించారు. ఈ లెక్కన పురుష ఉపాధ్యాయులు 3.5, మహిళ ఉపాధ్యాయులు 4.5 సెలవులను వినియోగించుకోవచ్చు. కొవిడ్‌ పాజిటివ్‌ వచ్చిన వారు వైద్య, క్యాజువల్‌, ప్రత్యేక క్యాజువల్‌ సెలవులను ఉపయోగించుకునే అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. సెలవులు మంజూరు చేసే అధికారులు పాఠశాలలకు 50శాతం మంది ఉపాధ్యాయులు హాజరయ్యేలా చూసుకోవాలని ఆదేశించారు.ఉపాధ్యాయులకు మొత్తం క్యాజువల్‌ సెలవులు 15, ప్రత్యేక క్యాజువల్‌ సెలవులు 7, మహిళలకు ప్రత్యేకించి క్యాజువల్‌ సెలవులు 5 ఉంటాయి. కొవిడ్‌-19 కారణంగా పాఠశాలల పునఃప్రారంభం ఆలస్యమైనందున దామాషా పద్ధతిలో సెలవుల వినియోగానికి అనుమతించినట్లు పాఠశాల విద్య సంచాలకులు చినవీరభద్రుడు తెలిపారు.

error: Content is protected !!