teachers-welfare-fund-TFW-ap-nftw-2020-application-proceesure

teachers-welfare-fund-TFW-ap-nftw-2020-application-proceesure

ఉపాధ్యాయ సంక్షేమ నిధి* *(TEACHERS’ WELFARE FUND)*

      నేషనల్ ఫౌండేషన్ ఫర్ టీచర్స్ వెల్ఫేర్ వారు ప్రతి సంవత్సరం సర్వీసులో వున్న మరియు రిటైరైన ఉపాధ్యాయులకు ఆర్థిక సహాయం చేస్తారు. దీనికి సంబంధించిన దరఖాస్తులను జిల్లా విద్యాశాఖాధికారి ద్వారా ప్రకటించిన తేదీ లోపల పంపుకొనాలి.         

     సాధారణంగా జూన్ చివరిలోగా దరఖాస్తులు డిఇఓ గార్కి పంపాలి. .

*దరఖాస్తు చేయదగిన ప్రాథమిక, సెకండరీ పాఠశాలల ఉపాధ్యాయులు*

1) ఇన్సర్వీస్ ఉపాధ్యాయులు 

2) 21.10.1974కు పూర్వం ప్రైవేటేతర పాఠశాలల్లో పనిచేస్తూ చనిపోయిన వారిపై ఆధారపడినవారు, 

3) 03.07.1980 కి పూర్వం ప్రైవేటు పాఠశాలల్లో పనిచేస్తూ చనిపోయిన వారిపై ఆధారపడినవారు,

4) 01.04.1973కు పూర్వం రిటైరైన వారు. (కాలేజీ టీచర్లకు సైతం దాదాపు పై నిబంధనలు వర్తిస్తాయి)  ద్రవ్య సహాయం ఈ క్రింది కారణాలపై మంజూరు చేస్తారు

1) ఉపాధ్యాయులు, లేదా వారిపై ఆధారపడిన వారు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులయినప్పుడు,

2) కుమార్తెల వివాహ ఖర్చుల నిమిత్తం, 

3) అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు, 

4) వరదలలో తీవ్రమైన నష్టాలకు గురయి నప్పుడు, 

5) ఇంటర్మీడియేట్ కంటే పై స్థాయి విద్యను పిల్లలు చదువుతు న్నప్పుడు ఖర్చుల నిమిత్తం..

*దరఖాస్తు చేయు విధానం – షరతులు* :

1. పైన పేర్కొన్న మొదటి నాలుగు కారణములపై దరఖాస్తులను డూప్లికేట్లో డిఇఓ గార్కి పంపాలి.

2. వైద్య సహాయం నిమిత్తం దరఖాస్తు చేసేవారు తమ వ్యాధి స్వభావాన్ని విస్పష్టంగా తెలిసేలా ఎంబిబిఎసకు తక్కువగాని అర్హతగల డాక్టరు నుండి పొందిన సర్టిఫికెటు జతపరచాలి.

LEAVE TRAVEL CONCESSION (LTC) PROCEESURE AND APPLICATIONS

3. దరఖాస్తు దారునిపై ఆధారపడిన వారి పిల్లల వయస్సు, ఆదాయ వివరాలు తెలియ జేయాలి.

4. దరఖాస్తు దారుని భార్య / భర్త | పిల్లల వయస్సు, ఆదాయ వివరాలు తెలియ జేయాలి.

5. తమ పిల్లలు ఇంటర్మీడియేట్ కు పైబడిన విద్యాభ్యాసం చేస్తున్నప్పుడు మాత్రమే ఈ సహాయం లభిస్తుంది. దీనికై అప్లయి చేసేవారు కోర్సు, కాలపరిమితి తదితర వివరాలు తెలపాలి. స్కాలర్షిప్పులు పొందుతున్న పక్షంలో ఈ కారణంపై దరఖాస్తు చేయరాదు.

6. కుమార్తెల వివాహం విషయంలో వారి వయస్సు, ఆదాయం , ఉద్యోగ వివరాలు విధిగా తెలపాలి.

7. ఉద్యోగంలో వున్నవారు తాము పనిచేసే పాఠశాలల ప్రధానోపాధ్యాయుల ద్వారా, రిటైరైన వారు తాము పనిచేసిన చివరి పాఠశాల ప్రధానోపాధ్యాయుని ద్వారా దరఖాస్తు పంపాలి. చనిపోయిన వారి వారసులు సైతం ఉపాధ్యాయుడు/ ఉపాధ్యాయిని పనిచేసిన చివరి పాఠశాల ప్రధానోపాధ్యాయుని ద్వారానే పంపాలి.

*పిల్లల చదువు నిమిత్తం ఆర్థిక సహాయం*:

1. 4 సం||లు (8 సెమిస్టర్లు) కల్గిన ఇంజనీరింగ్ డిగ్రీ కోర్సు, మూడు సం||లకు తక్కువ కాకుండా వుండే డిప్లమో కోర్సులకు, అల్లోపతి, హోమియోపతి, ఆయుర్వేద వైద్య విద్యలకు, పశు వైద్య కోర్సులకు, డిగ్రీ తరువాత చేసే 2సం||లు తక్కువ కాని మేనేజ్ మెంటు కోర్సులకు, రెండు సం||లు తక్కువగాని ‘బి’ ఫార్మసీ డిప్లమా కోర్సులకు ఇది వర్తిస్తుంది.

ఆర్థిక సహాయం రూ.15,000/-ల గరిష్ఠ పరిమితితో చేస్తారు.

2. ట్యూషన్ / లైబ్రరీ / లాజిరేటరీ ఫీజులు అనుమతించబడతాయి.

3. విద్యార్థి ఒకే పర్యాయములో ఉత్తీర్ణత పొందవలెను. యుటిఎఫ్. సప్లిమెంటరీలో ఉత్తీర్ణత పొందితే అర్హుడు కాడు. ఇతర స్కాలర్ షిప్పులు పొందే కాలములో అర్హులు కారు.

4. విద్యార్థి గత సంవత్సరం కోర్సులో జాయిన్ అయినా దరఖాస్తు చేసుకొన వచ్చును. కాని అరియర్స్ చెల్లించబడవు. 

5. దరఖాస్తుకు జతపరచవలసినవి : 

1) ఆప్లికేషన్ ఫారం (అనెగ్గర్-సి)

2.ఉపాధ్యాయుడి సెల్ఫ్ డిక్లరేషన్, 

3) జీతపు ధృవపత్రము, 4) ఒరిజినల్ ఫీజు రశీదులు (జిరాక్సులు అంగీకరించబడవు), 

5) తల్లి లేదా తండ్రి సంరక్షణలో ఉన్నట్లు ప్రిన్సిపాల్ / హెచ్ఎం చే ఇవ్వబడిన స్టడీ సర్టిఫికెట్ (ఇన్ చార్జిసంతకములు అంగీకరించబడవు)

6) దరఖాస్తులను ఉపాధ్యాయులైతే ఎంఇఓ/హెచ్ఎం ద్వారా, ప్రధానోపాధ్యాయులైతే

డివైఇఓ ద్వారా సెప్టెంబరు 30లోగా పాఠశాల విద్యా సంచాలకుల కార్యాలయాలకు పంపుకోవాలి.

MEDICAL INVALIDATION PROCESS & APPLICATION

National Foundation for Teachers’ Welfare GUIDELINES

APPLICATIONS FOR FINANCIAL ASSISTANCE FROM TEACHERS WHOSE CHILDREN STUDIED PROFESSIONAL COURSES (ENGINEERING, MEDICINE, MANAGEMENT, B.PHARMACY, ETC) DURING ACADEMIC YEAR.

>>Original FEE RECEIPTS TO BE SUBMITTED

>> ONE TEACHER SHOULD SUBMIT ONLY ONE APPLICATUON EVEN THOUGH MORE THAN ONE CHILD IS STUDYING

>>ONLY TUTION FEE& LIBRARY& LABORATORY FEE RECEIPTS TO BE SUBMITTED.

>>HOSTEL/ MESS FEE ARE NOT ELEGIBLE 

>>FILLED APPLICATION TO BE SENT TO

SECRETARY- TREASURER,

NFTW AP,  OFFICE OF COMMISSIONER OF SCHOOL EDUCATION AP ,

B BLOCK ANJANEYA TOWERS,

IBRAHIMPATNAM 

>>APPLICATIONS TO BE SUBMITTED FROM OFFICES OF  MEO OR HEAD MASTER. OF HIGH SCHOOLS.

>> copy of Proceedings& MODEL APPLICATION 

>>All elegible Teachers can apply and trynur luck.

>>Total 400+ Teachers in AP will be benifted with this financial Assistance.

EARNED LEAVES & SURENDER LEAVES RULES

TEACHERS WELFARE FUND APPLICATION FORM PDF

National Foundation for Teachers’ Welfare GUIDELINES

error: Content is protected !!