Top-5-ugc-scholarships-for-higher-studies-students-list

Top-5-ugc-scholarships-for-higher-studies-students-list

UGC scholarship: యూజీసీ అందించే టాప్ 5 స్కాలర్ షిప్‌లు ఇవే.. దరఖాస్తు చేసుకోండి

UGC scholarship: దేశ వ్యాప్తంగా ఉన్నత విద్యను అభ్యసించే అనేక మంది విద్యార్థులకు వివిధ రకాల స్కాలర్ షిప్ లను అందిస్తూ యూజీసీ ప్రోత్సహిస్తోంది.

ప్రధానాంశాలు:

  • ఏపీలో3527 మందికి, తెలంగాణలో 2570 మందికి అవకాశం

  • దేశ వ్యాప్తంగా 82 వేల మందికి స్కాలర్‌షిప్‌లు

  • సాధారణ డిగ్రీలు, ఇంటిగ్రేటెడ్‌ పీజీ చదివేటప్పుడు 10 వేలు.. పీజీ చేరితే 20 వేలు

  • అక్టోబర్‌ 31 దరఖాస్తులకు ఆఖరు తేది

వెనకబడిన వర్గాలకు చెందిన ప్రతిభ గల విద్యార్థులు యూనివర్సిటీ, కాలేజీ స్థాయి విద్య అభ్యసించడానికి ఈ స్కాలర్ షిప్ లు దోహదపడతాయి.

వీటికి బీఏ, బీకాం, బీఎస్సీ, బీటెక్, ఎంబీబీఎస్, బీడీఎస్, ఏజీబీఎస్సీ లేదా మరేదైనా డిగ్రీ ఫస్టియర్‌ చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

దేశవ్యాప్తంగా 82,000 మందికి ఈ ప్రోత్సాహకాలు అందుతాయి.

సీనియర్‌ సెకెండరీ/ఇంటర్మీడియట్‌ పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా ఈ పురస్కారాలు అందిస్తారు.

ఈ మొత్తం 82,000 స్కాలర్‌షిప్పుల్లో 41,000 అమ్మాయిలకు, 41,000 అబ్బాయిలకు కేటాయించారు.

యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(UGC) భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన చట్టబద్ధమైన సంస్థ.

భారతదేశంలో ఉన్నత విద్య యొక్క ప్రమాణాలను పెంచడం ఈ కమిషన్ బాధ్యత.

దేశ వ్యాప్తంగా ఉన్నత విద్యను అభ్యసించే అనేక మంది విద్యార్థులకు వివిధ రకాల స్కాలర్ షిప్ లను అందిస్తూ యూజీసీ ప్రోత్సహిస్తోంది. వెనకబడిన వర్గాలకు చెందిన ప్రతిభగల విద్యార్థులు యూనివర్సిటీ, కాలేజీ స్థాయి విద్య అభ్యసించడానికి ఈ స్కాలర్ షిప్ లు దోహదపడతాయి.

ఈ నేపథ్యంలో విద్యార్థుల కోసం యూజీసీ అందించే టాప్ 5 స్కాలర్ షిప్ ల వివరాలు..

ఇషాన్ ఉదయ్ స్పెషల్ స్కాలర్ షిప్ పథకం..

ఈశాన్య భారత దేశంలోని విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించేలా ప్రోత్సహించడానికి ఈ స్కాలర్ షిప్ పథకాన్ని రూపొందించారు.

ఆ ప్రాంతానికి చెంది 12వ తరగతి లేదా అందుకు సమానమైన విద్యార్హత కలిగిన విద్యార్థులు ఈ స్కాలర్ షిప్ పొందేందుకు అర్హులు.

జనరల్, ప్రొఫేషనల్, టెక్నికల్, మెడికల్, పారామెడికల్ కోర్సుల్లో గుర్తింపు పొందిన కళాశాల లేదా యూనివర్సిటీలో ప్రవేశం పొందిన వారు మాత్రమే స్కాలర్ షిప్ పొందేందుకు అర్హులు.

వారి వార్షిక ఆదాయం రూ. 4.50 లక్షల కన్నా తక్కువగా ఉండాలి.

మొత్తం 10 వేల మందికి ఈ స్కాలర్ షిప్ ను ఒక్కొక్కరికీ నెలకు రూ. 7 వేల చొప్పున అందించనున్నారు.

ఈ స్కాలర్ షిప్ కోసం ఆగస్టు నుంచి నవంబర్ వరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. నేషనల్ స్కాలర్ షిప్ పోర్టల్(NSP)లో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.

పీజీ ఇందిరా గాంధీ స్కాలర్ షిప్ పథకం..
బాలికలు చదువుకోవడానికి ఈ పథకాన్ని రూపొందించారు.

వారి కుటుంబాలలో ఏకైక ఆడపిల్లగా ఉండి 30 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న వారు ఈ పథకం కింద ప్రయోజనాలను పొందవచ్చు.

ఏదైనా పోస్టు గ్రాడ్యుయేషన్ కళాశాలలో మాస్టర్ డిగ్రీలో ప్రథమ సంవత్సరం అడ్మిషన్ పొందిన వారు ఈ స్కాలర్ షిప్ పొందేందుకు అర్హులు.

ఈ పథకం కింద మొత్తం 3 వేల మందికి ఏడాదికి రూ. 36, 200 చొప్పున రెండేళ్ల పాటు అందించనున్నారు.

ఈ స్కాలర్ షిప్ ను సైతం ఆగస్టు మరియు నవంబర్ వరకు నేషనల్ స్కాలర్ షిప్ పోర్టల్(NSP)లో ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.

పీజీ మెరిట్ స్కాలర్ షిప్..
ప్రతిభావంతులైన విద్యార్థులు పోస్ట్ గ్రాడ్యుయేట్ స్థాయి విద్యను అభ్యసించడం మరియు వారి ఖర్చులకు సహాయం చేయడం ఈ పథకం యొక్క ముఖ్య లక్ష్యం.

గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో ప్రథమ, ద్వితీయ ర్యాంకులను సాధించిన వారు ఈ స్కాలర్ షిప్ లు పొందేందుకు అర్హులు.

మొత్తం 3 వేల మందికి నెలకు రూ. 3 వేల చొప్పున ఈ స్కాలర్ షిప్ ను రెండేళ్ల పాటు అందించనున్నారు.

ఆగస్టు నుంచి నవంబర్ వరకు ఆన్లైన్లో నేషనల్ స్కాలర్ షిప్ పోర్టల్ లో ఈ స్కాలర్ షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు పీజీ స్కాలర్ షిప్ స్కీం..

ఎస్సీ ఎస్టీ విద్యార్థులు ప్రొఫేషనల్ విద్యను అభ్యసించేందుకు సహాయ పడేందుకు ఈ స్కాలర్ షిప్ పథకాన్ని రూపొందించారు.

ప్రతి విద్యార్థి రోజుకి వారికిచ్చిన టెస్ట్ బుక్ నందు రెండు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి కంటెంట్ వీక్షించాలి అని విద్యార్థులు కు సూచించాలి ▪️ ఉపాధ్యాయులు దీక్ష అప్లికేషన్లు వీక్షించిన కంటెంట్ గురించి ప్రతివారం సబ్మిట్ చేసే *Work done Statement* లో నమోదు చేయాలి details

TEACHERS & RATIONALISATION GUIDELINES DETAILS

ఏదైన గుర్తింపు పొందిన యూనివర్సిటీ, కళాశాల, సంస్థలో పీజీ ప్రథమ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ఈ స్కాలర్ షిప్ కు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు.

అర్హత పొందిన విద్యార్థులకు నెలకు రూ. 7800తో పాటు ఏడాదికి ఒక సారి రూ. 15 వేలు అందించనున్నారు.

ఆగస్టు నుంచి నవంబర్ మధ్యలో నేషనల్ స్కాలర్ షిప్ పొర్టల్ లో ఆన్లైన్లో ఈ స్కాలర్ షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

Dr. D. S. Kothari Postdoctoral ఫెలోషిప్ పథకం..
PhD పట్టా పొందిన వారు లేదా PhD థీసిస్ సమర్పించిన 35 ఏళ్ల లోపు వారి పరిశోధనలకు సహకరించేందకు ఈ పథకం రూపొందించారు.

గతంలో దరఖాస్తు చేసుకుని స్కాలర్ షిప్ పొందలేకపోయిన వారు సైతం మరో సారి దరఖాస్తు చేసుకోవచ్చు.

మొత్తం 300 మందికి నెలకు రూ. 54 వేలతో పాటు ఏడాదికి రూ. లక్ష గ్రాంట్ అందించనున్నారు. ఏడాదిలో ఎప్పుడైనా ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

DSKPDF పోర్టల్ లో ఆన్లైన్ ద్వారా ఈ స్కాలర్ షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

అర్హత:

  • ఈ స్కాలర్‌షిప్‌ నిబంధనల ప్రకారం 2019-2020 విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్‌ /10+2 కోర్సులు పూర్తిచేసుకున్నవారే అర్హులు. ఇంటర్‌ లేదా ప్లస్‌2లో 80 పర్సంటైల్‌ కంటే ఎక్కువ మార్కులు సాధించి ఉండాలి.

  • రెగ్యులర్‌ విధానంలో చదివినవారు మాత్రమే దరఖాస్తుకు అర్హులు.

  • డిప్లొమా విద్యార్థులకు అవకాశం లేదు.

  • అలాగే.. తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.8 లక్షల లోపు ఉండాలి.

  • ఇతర ఏ స్కాలర్‌షిప్పులనూ పొందనివారే దీనికి అర్హులు.

  • ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పొందుతున్న వాళ్లు అనర్హులు.

  • ఈ స్కాలర్‌షిప్పులకు ఎంపికైనవారు తర్వాత సంవత్సరాల్లోనూ స్కాలర్‌షిప్పు పొందడానికి అంతకు ముందు విద్యా సంవత్సరంలో కనీస హాజరు ఉండాలి. అలాగే.. ముందు విద్యా సంవత్సరంలో నిర్దేశిత మార్కుల శాతం తప్పనిసరిగా పొంది ఉంటేనే తరువాత స్కాలర్‌షిప్‌ వస్తుంది.

  • రిజర్వేషన్‌: ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 7.5 శాతం, ఓబీసీలకు 27 శాతం, దివ్యాంగులకు 5 శాతం స్కాలర్‌షిప్పులు కేటాయించారు.

  • దరఖాస్తులు: విద్యార్థులు ముందుగా నేషనల్‌ స్కాలర్‌షిప్పు పోర్టల్‌లో తమ వివరాలు రిజిస్టర్‌ చేసుకోవాలి. అనంతరం సంబంధిత స్కాలర్‌షిప్పు పత్రాన్ని ఆన్‌లైన్‌లో ఫిల్‌ చేయాలి. దరఖాస్తు సమయంలో అవసరమైన పత్రాలను జతచేయాలి.

  • ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: అక్టోబరు 31, 2020

  • వెబ్‌సైట్‌ లో డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌పై క్లిక్‌ చేసి ఈ స్కాలర్‌షిప్పునకు సంబంధించిన పూర్తి వివరాలు పొందవచ్చు

SCHOLARSHIP PORTAL APPLY HERE

SANTHOOR SCHOLARSHIPS FOR WOMENS APPLICATION & DETAILS

error: Content is protected !!