# Top-5-ugc-scholarships-for-higher-studies-students-list

- Link: https://amaravathiteacher.com/top-5-ugc-scholarships-for-higher-studies-students-list/
- Published: 2020-10-13T09:45:02+05:30
- Author: amaravathiteacher

## **Top-5-ugc-scholarships-for-higher-studies-students-list**

### **UGC scholarship: యూజీసీ అందించే టాప్ 5 స్కాలర్ షిప్‌లు ఇవే.. దరఖాస్తు చేసుకోండి**

### **UGC scholarship: దేశ వ్యాప్తంగా ఉన్నత విద్యను అభ్యసించే అనేక మంది విద్యార్థులకు వివిధ రకాల స్కాలర్ షిప్ లను అందిస్తూ యూజీసీ ప్రోత్సహిస్తోంది.**

### **ప్రధానాంశాలు:**

 * 
   ### **ఏపీలో3527 మందికి, తెలంగాణలో 2570 మందికి అవకాశం**
   
 * 
   ### **దేశ వ్యాప్తంగా 82 వేల మందికి స్కాలర్‌షిప్‌లు**
   
 * 
   ### **సాధారణ డిగ్రీలు, ఇంటిగ్రేటెడ్‌ పీజీ చదివేటప్పుడు 10 వేలు.. పీజీ చేరితే 20 వేలు**
   
 * 
   ### **అక్టోబర్‌ 31 దరఖాస్తులకు ఆఖరు తేది**
   

### **వెనకబడిన వర్గాలకు చెందిన ప్రతిభ గల విద్యార్థులు యూనివర్సిటీ, కాలేజీ స్థాయి విద్య అభ్యసించడానికి ఈ స్కాలర్ షిప్ లు దోహదపడతాయి.**

### **వీటికి బీఏ, బీకాం, బీఎస్సీ, బీటెక్, ఎంబీబీఎస్, బీడీఎస్, ఏజీబీఎస్సీ లేదా మరేదైనా డిగ్రీ ఫస్టియర్‌ చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. **

### **దేశవ్యాప్తంగా 82,000 మందికి ఈ ప్రోత్సాహకాలు అందుతాయి. **

### **సీనియర్‌ సెకెండరీ/ఇంటర్మీడియట్‌ పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా ఈ పురస్కారాలు అందిస్తారు. **

### **ఈ మొత్తం 82,000 స్కాలర్‌షిప్పుల్లో 41,000 అమ్మాయిలకు, 41,000 అబ్బాయిలకు కేటాయించారు.**

### **యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(UGC) భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన చట్టబద్ధమైన సంస్థ. **

### **భారతదేశంలో ఉన్నత విద్య యొక్క ప్రమాణాలను పెంచడం ఈ కమిషన్ బాధ్యత. **

### **దేశ వ్యాప్తంగా ఉన్నత విద్యను అభ్యసించే అనేక మంది విద్యార్థులకు వివిధ రకాల స్కాలర్ షిప్ లను అందిస్తూ యూజీసీ ప్రోత్సహిస్తోంది. వెనకబడిన వర్గాలకు చెందిన ప్రతిభగల విద్యార్థులు యూనివర్సిటీ, కాలేజీ స్థాయి విద్య అభ్యసించడానికి ఈ స్కాలర్ షిప్ లు దోహదపడతాయి. **

### **ఈ నేపథ్యంలో విద్యార్థుల కోసం యూజీసీ అందించే టాప్ 5 స్కాలర్ షిప్ ల వివరాలు..**

### **ఇషాన్ ఉదయ్ స్పెషల్ స్కాలర్ షిప్ పథకం..**

### **ఈశాన్య భారత దేశంలోని విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించేలా ప్రోత్సహించడానికి ఈ స్కాలర్ షిప్ పథకాన్ని రూపొందించారు. **

### **ఆ ప్రాంతానికి చెంది 12వ తరగతి లేదా అందుకు సమానమైన విద్యార్హత కలిగిన విద్యార్థులు ఈ స్కాలర్ షిప్ పొందేందుకు అర్హులు. **

### **జనరల్, ప్రొఫేషనల్, టెక్నికల్, మెడికల్, పారామెడికల్ కోర్సుల్లో గుర్తింపు పొందిన కళాశాల లేదా యూనివర్సిటీలో ప్రవేశం పొందిన వారు మాత్రమే స్కాలర్ షిప్ పొందేందుకు అర్హులు. **

### **వారి వార్షిక ఆదాయం రూ. 4.50 లక్షల కన్నా తక్కువగా ఉండాలి. **

### **మొత్తం 10 వేల మందికి ఈ స్కాలర్ షిప్ ను ఒక్కొక్కరికీ నెలకు రూ. 7 వేల చొప్పున అందించనున్నారు. **

### **ఈ స్కాలర్ షిప్ కోసం ఆగస్టు నుంచి నవంబర్ వరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. నేషనల్ స్కాలర్ షిప్ పోర్టల్(NSP)లో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.**

### **పీజీ ఇందిరా గాంధీ స్కాలర్ షిప్ పథకం..**⏎ **బాలికలు చదువుకోవడానికి ఈ పథకాన్ని రూపొందించారు. **

### **వారి కుటుంబాలలో ఏకైక ఆడపిల్లగా ఉండి 30 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న వారు ఈ పథకం కింద ప్రయోజనాలను పొందవచ్చు. **

### **ఏదైనా పోస్టు గ్రాడ్యుయేషన్ కళాశాలలో మాస్టర్ డిగ్రీలో ప్రథమ సంవత్సరం అడ్మిషన్ పొందిన వారు ఈ స్కాలర్ షిప్ పొందేందుకు అర్హులు. **

### **ఈ పథకం కింద మొత్తం 3 వేల మందికి ఏడాదికి రూ. 36, 200 చొప్పున రెండేళ్ల పాటు అందించనున్నారు. **

### **ఈ స్కాలర్ షిప్ ను సైతం ఆగస్టు మరియు నవంబర్ వరకు నేషనల్ స్కాలర్ షిప్ పోర్టల్(NSP)లో ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.**

### **పీజీ మెరిట్ స్కాలర్ షిప్..**⏎ **ప్రతిభావంతులైన విద్యార్థులు పోస్ట్ గ్రాడ్యుయేట్ స్థాయి విద్యను అభ్యసించడం మరియు వారి ఖర్చులకు సహాయం చేయడం ఈ పథకం యొక్క ముఖ్య లక్ష్యం.**

### ** గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో ప్రథమ, ద్వితీయ ర్యాంకులను సాధించిన వారు ఈ స్కాలర్ షిప్ లు పొందేందుకు అర్హులు. **

### **మొత్తం 3 వేల మందికి నెలకు రూ. 3 వేల చొప్పున ఈ స్కాలర్ షిప్ ను రెండేళ్ల పాటు అందించనున్నారు. **

### **ఆగస్టు నుంచి నవంబర్ వరకు ఆన్లైన్లో నేషనల్ స్కాలర్ షిప్ పోర్టల్ లో ఈ స్కాలర్ షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.⏎ ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు పీజీ స్కాలర్ షిప్ స్కీం..⏎ ⏎ ఎస్సీ ఎస్టీ విద్యార్థులు ప్రొఫేషనల్ విద్యను అభ్యసించేందుకు సహాయ పడేందుకు ఈ స్కాలర్ షిప్ పథకాన్ని రూపొందించారు.

#### **󠀁[ప్రతి విద్యార్థి రోజుకి వారికిచ్చిన టెస్ట్ బుక్ నందు రెండు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి కంటెంట్ వీక్షించాలి అని విద్యార్థులు కు సూచించాలి ▪️ ఉపాధ్యాయులు దీక్ష అప్లికేషన్లు వీక్షించిన కంటెంట్ గురించి ప్రతివారం సబ్మిట్ చేసే \*Work done Statement\* లో నమోదు చేయాలి details](https://amaravathiteacher.com/sensitizing-teachers-students-on-usage-qr-codes-in-the-textbooks-to-increase-the-usage-of-diksha-instructions/)󠁿**

### **󠀁[TEACHERS & RATIONALISATION GUIDELINES DETAILS](https://amaravathiteacher.com/ap-teachers-transfers-rationalization-guidelines-october-2020/)󠁿**

### **ఏదైన గుర్తింపు పొందిన యూనివర్సిటీ, కళాశాల, సంస్థలో పీజీ ప్రథమ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ఈ స్కాలర్ షిప్ కు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు.**

### **అర్హత పొందిన విద్యార్థులకు నెలకు రూ. 7800తో పాటు ఏడాదికి ఒక సారి రూ. 15 వేలు అందించనున్నారు. **

### **ఆగస్టు నుంచి నవంబర్ మధ్యలో నేషనల్ స్కాలర్ షిప్ పొర్టల్ లో ఆన్లైన్లో ఈ స్కాలర్ షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.**

### **Dr. D. S. Kothari Postdoctoral ఫెలోషిప్ పథకం..**⏎ **PhD పట్టా పొందిన వారు లేదా PhD థీసిస్ సమర్పించిన 35 ఏళ్ల లోపు వారి పరిశోధనలకు సహకరించేందకు ఈ పథకం రూపొందించారు. **

### **గతంలో దరఖాస్తు చేసుకుని స్కాలర్ షిప్ పొందలేకపోయిన వారు సైతం మరో సారి దరఖాస్తు చేసుకోవచ్చు. **

### **మొత్తం 300 మందికి నెలకు రూ. 54 వేలతో పాటు ఏడాదికి రూ. లక్ష గ్రాంట్ అందించనున్నారు. ఏడాదిలో ఎప్పుడైనా ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. **

### **DSKPDF పోర్టల్ లో ఆన్లైన్ ద్వారా ఈ స్కాలర్ షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.**

### **అర్హత:**

 * 
   ### **ఈ స్కాలర్‌షిప్‌ నిబంధనల ప్రకారం 2019-2020 విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్‌ /10+2 కోర్సులు పూర్తిచేసుకున్నవారే అర్హులు. ఇంటర్‌ లేదా ప్లస్‌2లో 80 పర్సంటైల్‌ కంటే ఎక్కువ మార్కులు సాధించి ఉండాలి.**
   
 * 
   ### **రెగ్యులర్‌ విధానంలో చదివినవారు మాత్రమే దరఖాస్తుకు అర్హులు.**
   
 * 
   ### **డిప్లొమా విద్యార్థులకు అవకాశం లేదు.**
   
 * 
   ### **అలాగే.. తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.8 లక్షల లోపు ఉండాలి.**
   
 * 
   ### **ఇతర ఏ స్కాలర్‌షిప్పులనూ పొందనివారే దీనికి అర్హులు.**
   
 * 
   ### **ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పొందుతున్న వాళ్లు అనర్హులు.**
   
 * 
   ### **ఈ స్కాలర్‌షిప్పులకు ఎంపికైనవారు తర్వాత సంవత్సరాల్లోనూ స్కాలర్‌షిప్పు పొందడానికి అంతకు ముందు విద్యా సంవత్సరంలో కనీస హాజరు ఉండాలి. అలాగే.. ముందు విద్యా సంవత్సరంలో నిర్దేశిత మార్కుల శాతం తప్పనిసరిగా పొంది ఉంటేనే తరువాత స్కాలర్‌షిప్‌ వస్తుంది.**
   
 * 
   ### **రిజర్వేషన్‌: ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 7.5 శాతం, ఓబీసీలకు 27 శాతం, దివ్యాంగులకు 5 శాతం స్కాలర్‌షిప్పులు కేటాయించారు.**
   
 * 
   ### **దరఖాస్తులు: విద్యార్థులు ముందుగా నేషనల్‌ స్కాలర్‌షిప్పు పోర్టల్‌లో తమ వివరాలు రిజిస్టర్‌ చేసుకోవాలి. అనంతరం సంబంధిత స్కాలర్‌షిప్పు పత్రాన్ని ఆన్‌లైన్‌లో ఫిల్‌ చేయాలి. దరఖాస్తు సమయంలో అవసరమైన పత్రాలను జతచేయాలి.**
   
 * 
   ### **ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: అక్టోబరు 31, 2020**
   

 * 
   ### **వెబ్‌సైట్‌ లో డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌పై క్లిక్‌ చేసి ఈ స్కాలర్‌షిప్పునకు సంబంధించిన పూర్తి వివరాలు పొందవచ్చు**
   

### **󠀁[SCHOLARSHIP PORTAL APPLY HERE](https://scholarships.gov.in/)󠁿**

### **󠀁[SANTHOOR SCHOLARSHIPS FOR WOMENS APPLICATION & DETAILS](https://amaravathiteacher.com/santhoor-womens-scholarships-for-government-school-students-2020/)󠁿**

### 󠀁[AP TEACHERS LATEST NEWS](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)󠁿

 *  [ NEW SA1 Science Question Papers 2026 ](https://amaravathiteacher.com/sa1-science-question-papers-2026/)
 *  [ NEW SA1 EVS Key Papers 2026 PDF Download – 3rd to 5th Class ](https://amaravathiteacher.com/sa1-evs-key-papers-2026/)
 *  [ SA1 Maths Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-maths-key-papers-2026/)
 *  [ APPSC Group 2 Notification 2026 – 720 Vacancies, Post-wise Qualifications, Age, Fee, Dates & Syllabus Apply Online ](https://amaravathiteacher.com/appsc-group-2-notification-2026-720-vacancies-apply-online/)
 *  [ SA1 Hindi Key Papers 2026 PDF Download – 6th to 10th Class ](https://amaravathiteacher.com/sa1-hindi-key-papers-2026/)
 *  [ SA1 English Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-english-key-papers-2026/)
 *  [ SA1 Key Paper 2026 ](https://amaravathiteacher.com/sa1-key-paper-2026/)
 *  [ AP CPS to OPS Conversion 2026 – GO 158 Guidelines, NIDHI Application & Annexures ](https://amaravathiteacher.com/ap-cps-to-ops-conversion-2026-go-158-guidelines-nidhi-application-annexures/)
 *  [ SA1 Telugu Key Papers 2026 PDF Download – 1st to 10th Class ](https://amaravathiteacher.com/sa1-telugu-key-papers-2026/)
 *  [ AP SA1 2026 Class 10 School Level Observers Duties – DSE Proceedings 08-11-2026 ](https://amaravathiteacher.com/ap-sa1-2026-class-10-school-level-observers-duties-dse-orders/)

[View More ](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)

### 󠀁[TEACHERS SOFTWARES](https://amaravathiteacher.com/category/teachers-softwares/)󠁿

 *  [ SMC Elections 2026 Notification Voters List Download ](https://amaravathiteacher.com/smc-elections-2026-notification-voters-list-download/)
 *  [ Income Tax Online Calculator FY 2026-27 ](https://amaravathiteacher.com/income-tax-online-calculator-fy-2026-27/)
 *  [ Student id Card Download ](https://amaravathiteacher.com/student-id-card-download/)
 *  [ AP DA Arrears Calculator 2026 ](https://amaravathiteacher.com/ap-da-arrears-calculator-2026/)
 *  [ AP New DA Salary Calculator ](https://amaravathiteacher.com/ap-new-da-salary-calculator/)
 *  [ AP EHS Hospitals List ](https://amaravathiteacher.com/ap-ehs-hospitals-list/)
 *  [ AP Teachers ID Card Download ](https://amaravathiteacher.com/ap-teachers-id-card-download/)
 *  [ Pdf Compressor Online ](https://amaravathiteacher.com/pdf-compressor-online/)
 *  [ Online image compressor ](https://amaravathiteacher.com/online-image-compressor/)
 *  [ AP Medical Reimbursement Proposal Software ](https://amaravathiteacher.com/ap-medical-reimbursement-proposal-software/)

[View More ](https://amaravathiteacher.com/category/teachers-softwares/)
