AP Unlock 5.0: సినిమా హాల్స్‌లో ఇక కరోనా యాడ్, స్కూళ్లలో ప్రతి పిరియడ్ తర్వాత శానిటైజేషన్.. పూర్తి వివరాలివే!
పాఠశాలలన్నింటి లో కోవిడ్ ప్లెడ్జ్*
*12 అక్టోబర్ నాడు ఉదయం 11 కు ఉపాధ్యాయులచే చేయించాలని ఉత్తర్వులు…*
ప్రతిజ్ఞ
________________అను నేను COVID 19 వ్యాధి గురించి ఎల్లవేళలా పూర్తి అప్రమత్తతో ఉంటూ నాకు మరియు నా సహచరులకు వ్యాధి సోకకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటాను.
Covid 19 వ్యాధి వ్యాప్తి అరికట్టడం కోసం అవసరమైన అన్ని ముందు జాగ్రత్తలు నేను పాటిస్తూ ఇతరుల చేత పాటింప చేస్తాను.
నేను ఎల్లప్పుడూ ముఖ్యంగా పబ్లిక్ ప్రదేశాలలో ముఖానికి మాస్కు ధరిస్తాను.
ఇతరుల నుండి కనీసం ఆరు అడుగుల దూరం పాటిస్తూ జాగ్రత్తగా ఉంటాను.
నేను తరచూ చేతులు సబ్బుతో పరిశుభ్రం చేసుకుంటాను.
నేను ఈ నియమాలు పాటిస్తూ అందరి చేత పాటింప చేస్తూ కలిసికట్టుగా కోవిద్ 90 విజయం సాధిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను.
“Public Health Response to
Covid-19: Campaign for COVID-Appropriate Behaviour” –
Communication of pledge to take on Monday i.e., 12-10-2020 by 11:00 AM
PM గారి Jan Andolan Campaign on COVID-19 లో భాగంగా సోమవారం 12.10.2020 నాడు ఉదయం 11:00 గంటలకు ప్రతి ఆఫీస్ మరియు ప్రతి పాఠశాలలో Public Health Response to Covid-19:Campaign, Appropriate Behaviour మీద చేయవలసిన ప్రతిజ్ఞ గురించి మార్గదర్శకాలు విడుదల*
ఈ క్రింది 3 key points హైలైట్ చేయవలెను*
*1.Wear Mask,*
*2.Follow Physical Distancing*
*3.Maintain Hand Hygiene*
Guidelines మరియు DEO లకు ఇచ్చిన మార్గదర్శకాలు*
ఇటివల కేంద్ర ప్రభుత్వం ఆన్‌లాక్ 5 మార్గదర్శకాలను ప్రకటించడంతో.. కరోనా నుంచి ప్రజల జీవన విధానం సాధారణ స్థితికి వచ్చింది.
దాదాపు అన్ని రకాల వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు యతావిధిగా సాగుతున్నాయి.
అక్టోబర్ 15 నుంచి అమల్లోకి రానున్న ఈ మార్గదర్శకాలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రానికి సంబంధిదంచిన అన్‌లాక్ 5.0 గైడ్‌లైన్స్‌ను విడుదల చేసింది.
రద్దీగా ఉండే ప్రదేశాల్లో మాస్కులు, భౌతికదూరం తప్పనిసరి అని పేర్కొంది.
సినిమాహాళ్లు, షాపింగ్ మాల్స్, షాపుల వద్ద శానిటైజర్లు ఏర్పాటు చేయాలని సూచించింది.
ప్రజారవాణాలో కోవిడ్ నిబంధనలు కచ్చితంగా పాటించాలని, ప్రార్థనా మందిరాల్లో కూడా కోవిడ్ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని పేర్కొంది.
మాస్క్ లేకుంటే షాపింగ్ మాల్స్, సినిమా హాల్స్‌లో ప్రవేశం నిరాకరించాలని తెలిపింది.
కోవిడ్ నిబంధనలు అమలయ్యేలా పర్యవేక్షణకు ప్రత్యేక అధికారి ఉండేలా నిర్ణయించిన ప్రభుత్వం బస్టాండ్, రైల్వేస్టేషన్లలో మాస్క్‌లు ధరించేలా ప్రచారం నిర్వహించాలని, మైక్ అనౌన్స్‌మెంట్ ఏర్పాటు చేయాలని పేర్కొంది.
సినిమా హాల్స్‌లో కోవిడ్ నిబంధనలపై టెలీ ఫిల్మ్ ప్రదర్శించేలా చర్యలు తీసుకోవాని వెల్లడించింది.
స్కూళ్లు, విద్యా సంస్థలు, పారిశ్రామిక కార్యకలాపాలు నిర్వహించే చోట కేంద్ర మార్గదర్శకాలు తప్పనిసరిగా పాటించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
విద్యార్థులు, అధ్యాపకులు ప్రతి పీరియడ్ తర్వాత శానిటైజేషన్ చేసుకునేలా యాజమాన్యాలకు ఆదేశాలు ఇవ్వాలని తెలిపింది.