VideoMeet-Audio-Video-Conference-Webinar-indian-mobile-app

VideoMeet-Audio-Video-Conference-Webinar-indian-mobile-app

మన దేశం నుండి VideoMeet అనే మరో వీడియో కాన్ఫరెన్సింగ్ అప్లికేషన్ వచ్చింది!

*ఇటీవల దేశీయ అప్లికేషన్లకు డిమాండ్ పెరుగుతున్న సరళిని దృష్టిలో పెట్టుకుని అనేక సంస్థలు దేశీయ అప్లికేషన్స్ తయారు చేయటానికి ముందుకు వస్తున్నాయి.

అందులో భాగంగా తాజాగా VideoMeet అనే వీడియో కాన్ఫరెన్సింగ్ అప్లికేషన్ విడుదల చేయబడింది.*

*దీంతో ప్రధానంగా Zoom తరహాలో వీడియో రికార్డింగ్, స్క్రీన్ షేరింగ్ సదుపాయం, మ్యూజిక్ షేర్, ఫ్లిప్ కెమెరా, సెలబ్రేట్, వీడియో కాల్ సమయంలో ఛాటింగ్ సదుపాయం వంటివి ఉంటాయి.

ఇప్పటివరకు ఈ అప్లికేషన్ 50 వేల మంది డౌన్లోడ్ చేసుకున్నారు.

Android ఆపరేటింగ్ సిస్టం వాడే యూజర్లకు Google Play Storeలో ఇది లభిస్తుంది.*

*వర్చ్యువల్ మీటింగ్స్, వెబినార్లను దృష్టిలో పెట్టుకొని ఇది రూపొందించబడింది.

ఎలాంటి రిజిస్ట్రేషన్ అవసరం లేకుండా నేరుగా మీటింగ్ లో జాయిన్ కావచ్చు.

గరిష్టంగా 100 మంది వరకూ మీటింగ్ లో పాల్గొనవచ్చు.

అప్లికేషన్ అవసరం లేకుండా బ్రౌజర్ నుండి కూడా ఇది పనిచేస్తుంది.

మీటింగ్ స్కెడ్యూలింగ్, స్టార్ట్, జాయిన్ వంటి సదుపాయాలు లభిస్తాయి.

అలాగే వెయిటింగ్ రూం సదుపాయం కూడా ఉంటుంది.

మీటింగ్ రూమ్‌లను వివిధ సంస్థలు పర్సనలైజ్ చేసుకోవచ్చు.*

రహస్యమైన మీటింగ్లకు సెన్సిటివ్ మీటింగ్ మోడ్ అనే సదుపాయం కూడా ఉంటుంది.

మీటింగ్‌లో పాల్గొనే వ్యక్తుల ప్రదేశంలో ఏమైనా నాయిస్ ఉంటే దాన్ని ఆటోమేటిక్గా తొలగించే సదుపాయం దీంట్లో కల్పించబడింది.

మీటింగ్ లో పాల్గొనే వ్యక్తులు తమ దగ్గర ఉండే డాక్యుమెంట్లు ఒకరికొకరు షేర్ చేసుకోవచ్చు.* *ప్రభుత్వాలు, టీచర్లు, నాయకులు, స్కూలు యాజమాన్యం, హాస్పిటల్స్, స్నేహితులతో ఛాటింగ్ చేసుకోవటానికి ఇలా వివిధ అవసరాలకు తగ్గట్లుగా దీన్ని ఉపయోగించుకోవచ్చు.

మొబైల్ డేటా ఆధారంగా కూడా ఎలాంటి నాణ్యత లోపం లేకుండా ఇది సమర్థవంతంగా పని చేయగలుగుతుంది.*

*కచ్చితంగా మున్ముందు భారతీయ వీడియోకాన్ సర్వీసింగ్ అప్లికేషన్స్ Zoom వంటి వాటిని అధిగమించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

పరిస్థితి ఎలా ఉంటుందో వేచి చూడాలి.

ఈ కింది లింకు నుండి దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు

VideoMeet provides anytime anywhere secure audio/video conferencing in between people without the need of any registration and signup. Simply users can create their “room” and share the room name to join. Even the “room” can be protected by password.

VideoMeet has waiting room with Audio / text messages.

VideoMeet allows webinar and panelist mode also along with Screen Sharing.

VideoMeet allows shared document , where participants can co-create document.

VideoMeet allows to schedule Conference and Webinar with a personalised room name.

VideoMeet can be used by Governments, Teachers, Leaders, Schools, Hospitals, Mentors, Startups, Group of Friends, Family Members and organisations.

VideoMeet depends on internet available on mobile and fully supported on mobile data (4g/3g) and wifi.

Visit www.videomeet.in for more details.

VideoMeet – Audio/Video Conference & Webinar mobile APP

error: Content is protected !!