WE LOVE READING SUMMER ACTIVITIES 2024 – DAY32 – 1,2,3,4,5 CLASSES
SUMMER BREAK ACTIVITIES – GUIDELINES FOR TEACHERS
• Class teachers have to create Whats app groups with their class students.
• Ask them to maintain a notebook for summer activities and submit at the time of reopening.
• Keep in touch with the students and encourage them from time to time to monitor their activities.
• Gather students activities in the form of pics/videos/reports through Whats app group
• Music, Dance and Drama :
Select a music/dance/drama of their own culture or local tradition where a group of people (Peer/siblings/other family members) come together to develop the child’s aesthetic sense. Example: Folk or traditional songs/dance can be recorded from their area using some musical instruments involving their siblings, friends and family members.
WE LOVE READING SUMMER Activities 2024 for Class 1 Students :
ACTIVITY 1: – Prepare lemon juice and serve your family members
Learning Outcome : To develop skills
ACTIVITY 2 : –
ACTIVITY 3 : –
WE LOVE READING SUMMER Activities 2024 for Class 2 Students :
ACTIVITY1:- Prepare lemon juice and serve your family members
Learning Outcome : To develop skills
ACTIVITY2:-
ACTIVITY 3 : –
WE LOVE READING SUMMER Activities for Class 3,4,5 Students
ACTIVITY1:- READING
ACTIVITY2:-
WE LOVE READING SUMMER ACTIVITIES 2024 :: TODAY MORAL STORY : దొంగలు చేసిన సాయం..!
దొంగలు చేసిన సాయం..!
అవంతి రాజ్యంలో బుడగడు, మల్లేశం, బసవయ్య, రంగదాసు అనే నలుగురి దొంగల ముఠా ఉండేది. ఒకరోజు వాళ్లు చలమచర్ల గ్రామాన్ని దోచుకోవడానికి బయలుదేరారు. ఆ ఊరి సమీపంలోకి చేరుకునేసరికే అర్ధరాత్రి అయింది. అలా వెళ్తుండగా వారికి.. ఆ ఊర్లో మంటలు ఎగిసి పడుతుండటం కనిపించింది. ఒక ఇంట్లో వెలుగుతున్న దీపాన్ని, పిల్లి కింద పడేటంతో ఆ మంటలు చెలరేగాయి. అర్ధరాత్రి కావడంతో.. ఊరంతా గాఢ నిద్రలో ఉన్నారు. దాంతో మంటలు ఒక ఇంటి నుంచి మరో ఇంటికి ఊరంతా వ్యాపించాయి. ఊరు తగలబడిపోవడం చూసి, రంగదాసు ఆనందంతో చప్పట్లు కొడుతూ.. ‘కలిసొచ్చే కాలం అంటే ఇదే.. ఒకవైపు జనాలు తమ ఇళ్లను కాపాడుకునే ప్రయత్నంలో ఉంటారు. ఇంకో వైపు మనం ఏ ఆటంకం లేకుండా ఊరిని దోచుకోవచ్చు’ అన్నాడు. ఆ మాటలు ముఠా నాయకుడు బుడగడికి అస్సలు నచ్చలేదు. దాంతో అతను.. ‘ఊరు తగలబడి పోతుందని.. జనమంతా దుఃఖసాగరంలో ఉంటే, మనం దోచుకోవాలనుకోవడం చాలా తప్పు. ముందు ఆ ఆలోచన మానుకొని, మనం వారికి సహాయం చేద్దాం పదండి!’ అన్నాడు.
ఇక వాళ్లు పరుగున ఊరిలోకి వెళ్లారు. అక్కడ జనం ఏడూస్తూ దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఈ నలుగురూ సాహసించి తగలబడిపోతున్న ఇళ్లలోకి వెళ్లి.. కదలలేని స్థితిలో ఉన్న ముసలి వాళ్లను బయటకు మోసుకొచ్చారు. వస్తు సామగ్రిని బయటకు తెచ్చారు. దగ్గర్లో ఉన్న బావి నుంచి నీళ్లు తెచ్చి మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. అలా గ్రామస్థులకు తమ వంతు సహాయ సహకారాలు అందించారు. తెల్లవారే సమయానికి మంటలు అదుపులోకి వచ్చాయి. ఇంతలో.. ‘దొంగలు.. దొంగలు..!’ అంటూ అరుపులు వినిపించాయి. వాళ్లు నలుగురే అపరిచితులు కాబట్టి.. అందరికీ వారి మీదే అనుమానం వచ్చింది. ప్రాణాలకు తెగించి సహాయం చేసినప్పటికీ.. నటిస్తూ దోచుకుంటున్నారని అపోహపడ్డారు గ్రామ ప్రజలు. దాంతో వాళ్లను చెట్టుకు కట్టేసి.. రాజ భటులకు అప్పజెప్పారు.
వారం తర్వాత మహారాజు వచ్చి.. ‘మీరు ఆ ఊరిలో దొంగతనం చేశారు. కాబట్టి మీకు శిక్ష తప్పదు’ అన్నాడు. ‘మేం దొంగలం అన్నమాట నిజమే. కానీ ఆ ఊరిలో ఎలాంటి వస్తువులూ దోచుకోలేదు. మమ్మల్ని నమ్మండి. ఇంకెప్పుడూ దొంగతనాలు చేయం’ అని వేడుకున్నారా నలుగురు. ‘జనాలు చమటోడ్చి సంపాదించిన సొమ్మును దోచుకోవడం చాలా తప్పు. నష్టం తప్ప.. మీ వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. మరణదండనే మీకు సరైన శిక్ష’ అని రాజు కోపంగా అన్నాడు. అక్కడున్న ప్రజలు కూడా.. మరణ దండనే తగిన శిక్ష’ అంటూ రాజుకు వంతపాడారు. అప్పుడు అక్కడికి వచ్చిన భద్రయ్య అనే వ్యక్తి.. ‘వారికి మరణ శిక్ష వేయడం సరైంది కాదు. చేసిన తప్పును ఒప్పుకున్న వాళ్లకి క్షమాభిక్ష పెట్టడం ధర్మం. అయినా వాళ్లు ఆ రోజు దొంగతనానికే వచ్చినా.. ఏమీ దోచుకోలేదు. ఊరు తగలబడిపోతుంటే.. వారికి సహాయం చేశారు. ఎంతోమంది ప్రాణాలు రక్షించారు. వీళ్లలో మంచి మనసు కూడా ఉంది. కాబట్టి ఆ నలుగురికి మరణ శిక్ష విధించడం కాకుండా.. మంచి పని ఇప్పించి వారిలో మార్పు వచ్చేలా చేయడం మంచిది. మా పల్లెలో నాకు పెద్ద వ్యవసాయ క్షేత్రం ఉంది. అక్కడికి తీసుకెళ్లి నేను శిక్షణ ఇప్పిస్తాను. మంచి మనుషులుగా మారుస్తాను’ అన్నాడు. ఆ మాటలు విన్న రాజు కాసేపు ఆలోచించి.. ‘ఒక అవకాశం ఇస్తున్నాను. అప్పటికీ వారి బుద్ధి మార్చుకోకపోతే శిక్ష మాత్రం తప్పదు’ అన్నాడు.
అలా భద్రయ్య నలుగురినీ తన వెంటపెట్టుకొని వెళ్లాడు. ‘మీరు ఇంతకు ముందు దొంగతనాలు చేశారు కాబట్టి.. మంచి చేసినా ఎవరూ గుర్తించరు. అందుకే మంటల నుంచి ఆ గ్రామ ప్రజలను రక్షించినా వారికి దొంగతనం చేస్తున్నారనే అనిపించింది. ఇప్పటి నుంచి అయినా.. జాగ్రత్తగా పనులు చేసుకుంటూ ఆ పేరు పోయేలా చేసుకోండి’ అని చెప్పాడు. సంవత్సరం గడిచే సరికి.. వాళ్లు పూర్తిగా మారిపోయారు. ఎంచక్కా వ్యవసాయం చేసుకోసాగారు. ఆలోచనా విధానాన్ని మంచి వైపు మార్చుకుంటే.. జీవితం సాఫీగా సాగిపోతుందని నిరూపించారు.
WE LOVE READING SUMMER ACTIVITIES 2024- TODAY ENGLISH MORAL STORY : The Foolish Lion and The Clever Rabbit
Once upon a time, in a forest, there lived a greedy lion. All the other animals were scared of him, because he hunted everyday and killed the animals in large numbers even when he was not hungry. They knew that soon, none of them would be left alive.
The animals met and decided that they would offer one animal to the lion everyday. They went to the lion and said, “Your Majesty, please hear us out. We have a humble request. The rate at which you killing us, soon none of us will be left in the forest. We ask you to stay in your den always. Everyday, we will send you one animal as your food. This way you won’t have to hunt for your food and we, too, can survive.”
The lion agreed and from that day onward, one animal chosen to be sent to the lion, to become his meal.
One day it was the turn of an young rabbit. This rabbit was very clever. He did not want to be eaten by the lion. He also wanted to get rid of the lion forever. He thought hard and came up with a plan to kill the lion.
On the day he was supposed to go to the lion, to become lion’s meal, he got up very late. He started walking slowly towards the lion’s den. He even slept on the way, reaching the lion’s den by sunset.
In the meantime, the lion had grown angry and impatient. When he saw the tiny rabbit coming towards him, he roared, “I have waited an entire day, and the animals send me this puny little rabbit! You are too small for a meal. I shall teach the animals a lesson. I will kill them all!”
The rabbit remained calm and said, “Oh mighty lion, may I say something. The animals had sent a group of six rabbits for your meal. But on the way, another lion stopped us. he said that he was the new king of the forest. We told him that we already have a brave lion as our king. He kept the five rabbits with me and asked me to inform you that you must leave the forest at once or he will kill you.
The lion, upon hearing this, became very furious. He asked the rabbit to take him to the new lion’s den so that he could kill the other lion and settle the matter.
The rabbit agreed and led the lion to a deep well.
“He lives in that fortress, My Lord,” said the rabbit to the lion. The lion went to the well and looked inside. He saw his own reflection in the water and thought it was the other lion. He roared in anger. He heard the echo of his voice and thought it was the other lion. He jumped inside the well to kill the enemy lion. But his head crashed against the rocks, he fell into the water and was drowned.
The little rabbit rushed back to tell the other animals how he had saved the forest.