WE LOVE READING SUMMER ACTIVITIES 2024 – DAY42 – 1,2,3,4,5 CLASSES
SUMMER BREAK ACTIVITIES – GUIDELINES FOR TEACHERS
• Class teachers have to create Whats app groups with their class students.
• Ask them to maintain a notebook for summer activities and submit at the time of reopening.
• Keep in touch with the students and encourage them from time to time to monitor their activities.
• Gather students activities in the form of pics/videos/reports through Whats app group
• Music, Dance and Drama :
Select a music/dance/drama of their own culture or local tradition where a group of people (Peer/siblings/other family members) come together to develop the child’s aesthetic sense. Example: Folk or traditional songs/dance can be recorded from their area using some musical instruments involving their siblings, friends and family members.
WE LOVE READING SUMMER Activities 2024 for Class 1 Students :
ACTIVITY 1: – LEARN 1 TO 10 TABLES
ACTIVITY 2 : –
ACTIVITY 3 : –
WE LOVE READING SUMMER Activities 2024 for Class 2 Students :
ACTIVITY1:-
LEARN 1 TO 10 TABLES
ACTIVITY2:-
ACTIVITY 3 : –
WE LOVE READING SUMMER Activities for Class 3,4,5 Students
ACTIVITY1:- READING
ACTIVITY2:-
LEARN 1 TO 10 TABLES
WE LOVE READING SUMMER ACTIVITIES 2024 :: TODAY MORAL STORY : భలే.. భలే.. పిచ్చుకలు
భలే.. భలే.. పిచ్చుకలు
ఉదయాన్నే నిద్ర లేచి, సోఫాలో కూర్చొని.. ‘అమ్మా! ఇప్పుడు సెలవులు కదా! నేను ఆడుకోవడానికి మా స్నేహితుల ఇంటికి వెళ్తాను’ అన్నాడు ప్రవీణ్. ‘ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి. బయటికి ఎక్కడికీ వెళ్లకుండా.. కుదురుగా ఇంట్లోనే ఉండు’ అంది వాళ్లమ్మ జానకి. ‘మరి ఎలాగమ్మా.. రోజంతా ఇంట్లోనే ఉండి ఏం చేయాలి’ అని కాస్త చిరాగ్గా అన్నాడు ప్రవీణ్. ‘సెలవుల్లో నీకు కాలక్షేపం అవ్వడం కోసం నాన్న.. డ్రాయింగ్ బుక్, కలర్స్.. అలాగే కథల పుస్తకాలు తెచ్చారు.. అవి చదువుకో. అంతగా కావాలంటే సాయంత్రం కాస్త ఎండ తగ్గిపోయాక.. నీ స్నేహితుల దగ్గరకు వెళ్దువు, సరేనా..! అంది జానకి. ‘అలాగేనమ్మా..!’ అంటూ జవాబిచ్చాడు ప్రవీణ్.
ప్రవీణ్ హాల్లో కూర్చుని ఎంచక్కా బొమ్మలు వేసుకుంటున్నాడు. ఇంతలోనే.. ఓ చిన్ని పిచ్చుక కిచకిచమని అరుస్తూ వరండాలో పడిపోయింది. అది చూసిన ప్రవీణ్.. ‘అమ్మా!’ అంటూ గట్టిగా అరిచాడు. ఆ అరుపులు విని ఏం జరిగిందోనని కంగారుగా వచ్చింది జానకి. ‘అమ్మా.. ఒక చిన్ని పిచ్చుక మన వరండాలో పడిపోయింది పాపం..’ అని జాలిగా అన్నాడు. వెంటనే ఆమె.. నీళ్లు తీసుకొచ్చి దానికి తాగించడానికి ప్రయత్నించింది. ఆ పిచ్చుక మెల్లమెల్లగా కొన్ని నీళ్లు తాగి.. కాసేపాగి తుర్రున ఎగిరిపోయింది. ‘పాపం పిచ్చుకకు ఎంత దాహం వేసిందో కదా!’ అన్నాడు ప్రవీణ్. ‘అవును! మనమంటే దాహం వెయ్యగానే నీళ్లు తెచ్చుకొని తాగేస్తాం. కానీ పక్షులు, జంతువులకు ఎవరిస్తారు. ఈ ఎండలకు.. ఉన్న చెరువులు, కాలువలు ఎండిపోతాయి. ఇలా నీళ్లు దొరక్క చాలా పక్షులు చనిపోతాయి కూడా’ అంది జానకి. ‘అయ్యో! మరి ఎలాగమ్మా!’ అమాయకంగా అన్నాడు ప్రవీణ్. ‘ఏముంది.. గిన్నెల్లో కొన్ని నీళ్లు పోసి వాటిని పెరట్లో, వరండాలో పెట్టాలి. అవి చూసి వచ్చిన పక్షులు తాగుతాయి’ అంది వాళ్లమ్మ. ‘వరండాలో అయితే వాటికి కనిపించదేమో. మన ఇంటి ముందు ఖాళీ స్థలం ఉంది కదా! అక్కడ చిన్న చిన్న కర్రలు పాతి, వాటి మీద నీళ్ల గిన్నెలు పెడతాను’ అన్నాడు ప్రవీణ్.
చెప్పినట్లుగానే.. పెరట్లో ఉన్న చెక్కలు తెచ్చి ఖాళీ స్థలంలో పాతాడు. వాటి మీద చిన్న గిన్నెలు, డబ్బాలు పెట్టీ.. నీళ్లు పోశాడు. ఇంకా వాళ్లమ్మ ఇచ్చిన పెసర, మినప గింజలు కూడా అక్కడక్కడా చల్లాడు. ఇక వెళ్లి భోజనం చేసి.. మళ్లీ డ్రాయింగ్ వేసుకోవడం ప్రారంభించాడు. కానీ తన మనసంతా బయటే ఉంది. ‘అమ్మా.. ఇంకా ఒక్క పక్షి కూడా రావడం లేదేంటి?’ అని అటువైపుగా చూస్తూ అడిగాడు. ‘వస్తాయి నాన్న.. ముందు ఒక పక్షి వచ్చి చూస్తే.. ఇక్కడ నీళ్లు ఉన్నాయని మిగతా వాటికి చెబుతుంది. అప్పుడు అన్నీ వస్తాయి’ అని బదులిచ్చింది జానకి. అప్పుడే.. కిచకిచమంటూ ఒక పిచ్చుక వచ్చింది. దాన్ని చూసి ‘భలే.. భలే..!’ అంటూ బయటికి వెళ్లబోయాడు ప్రవీణ్. అప్పుడు వాళ్లమ్మ.. ‘నువ్వు ఇప్పుడు అక్కడికి వెళ్లకు. నిన్ను చూసి భయపడి నీళ్లు తాగకుండానే వెళ్లిపోతుంది’ అంది. దాంతో అలాగేనంటూ అక్కడే ఉండిపోయాడు. పిచ్చుక అక్కడున్న గింజలు తిని, కాసిన్ని నీళ్లు తాగి వెళ్లిపోయింది. అది అక్కడున్నంత సేపు కిటికీలోంచి.. ఆశ్చర్యంగా చూశాడు ప్రవీణ్. ఇంకాసేపటికి.. అక్కడికి చాలా పక్షులు వచ్చాయి. అది చూసి ప్రవీణ్ చాలా సంతోషించాడు. ఆ విషయాన్ని వెంటనే తన స్నేహితులకు చెప్పాలని నిర్ణయించుకున్నాడు.
మరుసటి రోజు ఉదయాన్నే తన స్నేహితులను వెంటపెట్టుకొచ్చాడు ప్రవీణ్. పిల్లలంతా కలిసి గిన్నెల్లో నీళ్లు నింపి.. పక్షుల కోసం పెట్టారు. ఇంతలో ప్రవీణ్ వాళ్లమ్మ అందరికీ ఎంచక్కా పాయసం చేసి పెట్టింది. పిల్లలంతా పాయసం తింటూ పక్షులు ఎప్పుడొస్తాయా.. అని బయటికి చూడసాగారు. కాసేపటికి రకరకాల పక్షులు అక్కడికి వచ్చి, గింజలు తిని.. నీళ్లు తాగి వెళ్లిపోయాయి. అది చూసిన పిల్లలు ‘అయ్యో ఆంటీ..! పక్షులన్నీ వెళ్లిపోతున్నాయేంటి?’ అని అడిగారు. ‘అవి ఇక్కడే ఉండిపోవు పిల్లలూ..! మీరు ఎక్కడికైనా ఆడుకోవడానికి వెళ్లినప్పుడు మళ్లీ తిరిగి ఇంటికి వెళ్తారు కదా! అవి కూడా అంతే’ అని చెప్పింది జానకి. ‘ఓ.. అలాగా.. మేము కూడా ఇంటికి వెళ్లి పక్షుల కోసం.. నీళ్లు పెడతాం’ అంటూ బయలుదేరారు పిల్లలు.
WE LOVE READING SUMMER ACTIVITIES 2024- TODAY ENGLISH MORAL STORY : The Elephant And The Dog
Long ago, there was a king who had deep affection for all the animals, especially elephants. He had built a very large stable for his royal elephant. A caretaker was appointed to make sure that all the needs of the royal elephant were met. The king had also ordered that special nutritious food be served to the elephant everyday, to keep him healthy.
One afternoon, a stray dog entered the royal stable. The elephant was resting under a shady tree. The dog spotted the food leftover by the elephant and ate to its heart’s content. The elephant saw the dog eating the leftover food. From that day on, the elephant gladly let the dog share his food. Soon the two became very good friends. The dog started staying in the stable and the caretaker too did not mind it. Soon, the dog too became very healthy.
One day, a farmer saw the dog and asked the caretaker if he would sell the dog to him. He offered good money for the dog. Although the dog did not belong to the caretaker, he accepted the money and gave the dog to the farmer.
After the farmer took the dog away, the royal elephant became very sad. He lost his only friend in the royal stable. He missed his friend during mealtimes and refused to eat or drink and soon became very weak. The news of the elephant’s failing health quickly reached the King. He rushed to the royal stable to inquire.
The caretaker knew why the elephant was so desolate and refused food and water, but he did not speak up. He was afraid that if the King came to know that he sold a dog which was not rightfully his, he would be punished. So he feigned ignorance.
The royal vet was called to check the health of the elephant. Even after thorough examination, the vet was unable to ascertain why the elephant was not eating and drinking. He concluded that being an emotional animal, the elephant was very sad about something.
The King’s guards questioned all the servants in the stable to find out what could be reason for the royal elephant’s sorrow. They came to know about the dog who lived with the elephant and was his close friend. They also came to know that the dog had been missing since the last few days. The King called his Chief Minister, told him about the whole situation and asked him for a solution. Upon the Chief Minister’s suggestion an announcement was made in the entire kingdom that whoever had the dog should return it immediately and he would be rewarded handsomely.
The farmer heard the announcement and immediately reached the King’s palace along with the dog. He told the King that he had bought the dog from the caretaker of the royal elephant. The caretaker was called immediately and he confessed selling the dog even though he had no right to do so. The King ordered the dog to be returned to the stable, alongside the elephant. The caretaker was ordered to return the farmer’s money. He was also ordered to look after the dog as well, along with the elephant.
The royal elephant was very happy to see his friend back. Food was served to both of them and they ate together.