WE LOVE READING SUMMER ACTIVITIES 2024 – DAY44 – 1,2,3,4,5 CLASSES
SUMMER BREAK ACTIVITIES – GUIDELINES FOR TEACHERS
• Class teachers have to create Whats app groups with their class students.
• Ask them to maintain a notebook for summer activities and submit at the time of reopening.
• Keep in touch with the students and encourage them from time to time to monitor their activities.
• Gather students activities in the form of pics/videos/reports through Whats app group
• Music, Dance and Drama :
Select a music/dance/drama of their own culture or local tradition where a group of people (Peer/siblings/other family members) come together to develop the child’s aesthetic sense. Example: Folk or traditional songs/dance can be recorded from their area using some musical instruments involving their siblings, friends and family members.
WE LOVE READING SUMMER Activities 2024 for Class 1 Students :
ACTIVITY 1: – LEARN 1 TO 10 TABLES
ACTIVITY 2 : –
ACTIVITY 3 : –
WE LOVE READING SUMMER Activities 2024 for Class 2 Students :
ACTIVITY1:-
LEARN 1 TO 10 TABLES
ACTIVITY2:-
ACTIVITY 3 : –
WE LOVE READING SUMMER Activities for Class 3,4,5 Students
ACTIVITY1:- READING
ACTIVITY2:-
LEARN 11 TO 20 TABLES
WE LOVE READING SUMMER ACTIVITIES 2024 :: TODAY MORAL STORY : అడవికి మేలు చేసే కానుక
అడవికి మేలు చేసే కానుక
మండు వేసవిలో మృగరాజు పుట్టినరోజు వేడుకలు ప్రారంభమయ్యాయి. జంతువులు ఒక్కొక్కటిగా వచ్చి సింహానికి శుభాకాంక్షలు చెప్పి, తమకు తోచిన కానుకలు ఇస్తున్నాయి. అందుకు కారణం లేకపోలేదు.. వచ్చిన బహుమతుల్లో ఉత్తమమైనదాన్ని ఎంపిక చేయడం మృగరాజుకు అలవాటు. ఉత్తమ కానుక తెచ్చిన వారిని, మరో మంచి బహుమతితో ప్రతి సంవత్సరం సత్కరించడం.. మృగరాజు ఆనవాయితీగా పెట్టుకుంది.
ఈ సంవత్సరం కోతి తెచ్చిన కానుకకు మృగరాజు ముగ్ధురాలైంది. ‘కోతి బావా! సమయానికి తగ్గట్టుగా కానుక అందించి నా మనసు గెలుచుకున్నావు’ అని ప్రశంసించింది మృగరాజు. సింహానికి ధన్యవాదాలు తెలియజేస్తూ కోతి ఉబ్బితబ్బిబైంది. తర్వాత కాసేపటికి విందు ప్రారంభమైంది. అక్కడ కోతిబావ కానుకను ఉత్తమ బహుమతిగా ప్రకటించింది మృగరాజు.
‘ఇంతకీ.. కోతి తెచ్చిన కానుక ఏంటబ్బా?!’ అంటూ కొన్ని జంతువులు ఆరా తీయసాగాయి. నక్క కుతూహలాన్ని ఆపుకోలేక.. ‘మృగరాజా! మీ మనసును గెలుచుకున్న ఆ కానుకేమిటో తెలుసుకోవాలని ఉంది’ అని వినయంగా అడిగింది. ‘మండు వేసవిలో మనల్ని వేధించే సమస్య ఒకటి ఉంది. దాని నుంచి ఉపశమనం కలిగించే కానుక అది’ అని గొప్పగా చెప్పింది మృగరాజు. ‘అంటే…’ అని అడిగింది నక్క.
‘దాహం తీర్చే దివ్యఔషధం… పుచ్చకాయ’ అని నవ్వుకుంటూ చెప్పింది మృగరాజు. ‘మరి.. కోతి బావకు మీరిచ్చే కానుకేమిటో?’ అని అసూయ పడుతూ అడిగింది ఎలుగుబంటి. ‘ఈ మధ్య వేటగాడు జారవిడుచుకున్న ఓ కత్తి నాకు దొరికింది. అది భలే ముద్దొస్తోంది. దాన్నే ఇస్తాను’ అని చెప్పి, మృగరాజు గుహ లోపలకు వెళ్లింది. కాసేపటి తర్వాత అది, ధగధగా మెరుస్తున్న కత్తిని నోటకరుచుకొని తెచ్చి.. అందరి సమక్షంలో కోతికి అందజేసింది.
రోజులు గడుస్తున్నాయి. ఏడాది కాలం గిర్రున తిరిగింది. మళ్లీ మృగరాజు పుట్టినరోజు వచ్చింది. ఎప్పటిలానే అన్ని జంతువులూ కానుకలు తెచ్చాయి. ఇంతలో కోతి, గతంలో మృగరాజు ఇచ్చిన కత్తితో వచ్చిందక్కడికి. ‘కోతి బావా! ఈ కత్తితో నీ రాజసం భలేగుంది. ఈసారి మృగరాజు మనసు దోచేందుకు ఏ కానుకతో వచ్చావు?’ అని మిగిలిన జంతువులు అడిగాయి. కత్తిని చూపిస్తూ.. ‘ఇంతకన్నా గొప్ప కానుక ఉందా?..’ అంటూ మృగరాజుకు జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ.. బహుమతిగా దాన్ని అందజేసింది. మృగరాజు కూడా సంతోషంగా ఆ కత్తిని అందుకుంది. జంతువులన్నీ ఆశ్చర్యపోయాయి. ‘ఈసారి కూడా నీదే అత్యుత్తమ కానుక’ అంటూ కోతిని పొగిడింది సింహం. కోతి గర్వంగా జంతువుల వైపు చూస్తూ విందు భోజనాలు వడ్డిస్తున్న చోటుకు వెళ్లింది.
ఈసారి జంతువులన్నీ అవాక్కయ్యాయి. ‘మీరు ఇచ్చిన కానుకను మీకు తిరిగి అందించడంలో గొప్పతనమేముంది? అది మిమ్మల్ని అవమానించడమే’ అన్నాయి ఆ జంతువులు. ‘ఇది అవమానం కాదు, ప్రస్తుత అవసరం’ అంది మృగరాజు. ‘అవసరమా?’ అని ఆసక్తిగా అడిగాయి అక్కడున్న జంతువులు.
‘ఈ వేసవిలో వేడి మరింత పెరగకుండా ఉండేందుకు..’ అని చెప్పింది సింహం. ‘వేసవి వేడికి, కోతి చేతిలో కత్తికీ సంబంధమేమిటి?’ అని అర్థంగాక అడిగాయి జంతువులు. ‘ఒక్కసారిగా అడవిలో వేడి పెరగడంతో.. విషయం ఏంటని, ఆరా తీశాను. పెరగాల్సిన మొక్కలు నేలకొరిగి ఉండడం, కోతి పనేనని విచారణలో తేలింది. చెట్లు, మొక్కల సంఖ్య తగ్గే చోట వేడి పెరుగుతుంది. ఇది పర్యావరణ పాఠం. గతంలో కోతి నాకు ఇచ్చిన పుచ్చకాయ తినగా విసిరేసిన విత్తనాలు, మొక్కలుగా మారి ఈ ఏడాది ఇబ్బడిముబ్బడిగా కాయలు కాశాయి. ఈ వేసవిలో నా దాహం తీర్చడానికి చాలా ఉపయోగపడ్డాయి. కానుకలు ఇచ్చినప్పుడు ఉపయోగపడేదిగా ఉండటం సముచితమని నాకు అర్థమైంది. విధ్వంసానికి కారణమయ్యే కానుక ఇవ్వడం ఎంత చేటు తెస్తుందో.. కత్తితో కోతి చేష్టలు నాకు పాఠంగా నిరూపించాయి’ అని వివరంగా చెప్పింది మృగరాజు.
‘అయితే ఈసారి కోతికి ఏ కానుక ఇస్తున్నారు?’ అని అడిగాయి జంతువులు. ‘గంపెడు నేరేడు పండ్లు ఇస్తాను’ అంది మృగరాజు. ‘అంతేనా…’ అని తేలికగా అన్నాయి జంతువులు. ‘కోతి ద్వారా ప్రకృతికి జరిగిన నష్టం అవి తిన్నాక వచ్చిన విత్తనాలతో భర్తీ అవుతుంది’ అని నవ్వుతూ చెప్పింది మృగరాజు. ‘మీ కానుక నిజంగా అడవికి మేలు చేస్తుంది’ అంటూ మృగరాజును కొనియాడాయి ఆ జంతువులు.
WE LOVE READING SUMMER ACTIVITIES 2024- TODAY ENGLISH MORAL STORY : The four friends
An unusual group of four friends lived deep inside a forest. The four friends were: a deer, a crow, a mole and a tortoise. They would meet every afternoon under a shady banyan tree and talk for hours.
One day, the deer did not turn up at the usual time. The mole, tortoise and crow were worried. The mole turned to the crow, “I think you better fly around and see where the deer is.” The crow nodded her head and flew away.
She didn’t have to fly too far to find the deer. Unfortunately, the deer was trapped in a hunter’s net! “Friend deer! What happened?” the crow cried.
The deer sighed, “I am normally very careful in where I put my step. But this net was well-hidden. I am now trapped. It is only a matter of time before the hunter gets here.”
“I’ll get some help,” the crow said as she flapped away. She quickly flew to the banyan tree where the mole and tortoise were waiting. She told them everything that had happened.
“Friend tortoise, you wait right here,” said the mole, “I will go with the crow and cut the net our friend is trapped in with my sharp teeth.”
The crow picked up the mole in her beak and flew quickly to the spot where the deer was trapped.
The deer was happy to see his friends. The mole start cutting through the net. It was hard work, but soon the deer was free. “Thank you friend mole!” the deer cried out as he stepped out of the net.
“Ah! Looks like our friend is free!” came a voice from the bushes. It was the tortoise who had walked slowly to the spot.
At same moment, the hunter arrived. The deer ran swiftly. The crow flew away. The mole quickly dug a hole to hide in. But the tortoise was too slow.
The hunter was shocked to see that the net had been cut. But then his eyes fell on the slowly moving tortoise. “I lost the deer, but this tortoise will make a fine soup,” he thought to himself, as he tied the tortoise up with a rope.
“Oh no! We’ve lost our friend!” cried the crow.
“No, there is still hope,” said the mole with a smile as he whispered a plan to his two friends.
With the tortoise on his back, the hunter headed back to the village. The path took him past a lake. He saw the body of a deer lying on the grass. A crow was sitting on the deer’s antlers, pecking at his eyes.
The hunter could not believe his luck. “I lost one deer, but looks like I have found another! And I don’t even have to kill this one,” he said to himself.
The tortoise smiled. His friends had come to rescue him.
The hunter left the tortoise on the ground and ran towards the deer. The mole ran out of the bush and quickly cut the rope. The tortoise was free! “Friend tortoise, run!” cried the mole.
For a tortoise, he moved really fast straight to the lake.
Meanwhile, the hunter had almost reached the deer. The crow could see that the tortoise was now safe in lake. “Caw! Caw!” she cried and flew away.
That was the signal! The deer sprang to his feet and ran away. The hunter had no chance of catching him. And when he turned back, he found the tortoise missing too!
The four friends hurried back to the banyan tree. “Thank you friends for saving my life!” said the tortoise.
“No thanks needed,” said the deer with a smile, “As long as we help each
other, we’ll always be safe!”