WE LOVE READING SUMMER ACTIVITIES 2024 – DAY49 – 1,2,3,4,5 CLASSES
SUMMER BREAK ACTIVITIES – GUIDELINES FOR TEACHERS
• Class teachers have to create Whats app groups with their class students.
• Ask them to maintain a notebook for summer activities and submit at the time of reopening.
• Keep in touch with the students and encourage them from time to time to monitor their activities.
• Gather students activities in the form of pics/videos/reports through Whats app group
• Music, Dance and Drama :
Select a music/dance/drama of their own culture or local tradition where a group of people (Peer/siblings/other family members) come together to develop the child’s aesthetic sense. Example: Folk or traditional songs/dance can be recorded from their area using some musical instruments involving their siblings, friends and family members.
WE LOVE READING SUMMER Activities 2024 for Class 1 Students :
ACTIVITY 1: – LEARN 1 TO 10 TABLES
ACTIVITY 2 : –
ACTIVITY 3 : –
WE LOVE READING SUMMER Activities 2024 for Class 2 Students :
ACTIVITY1:-
LEARN 1 TO 10 TABLES
ACTIVITY2:-
ACTIVITY 3 : –
WE LOVE READING SUMMER Activities for Class 3,4,5 Students
ACTIVITY1:- READING
ACTIVITY2:-
LEARN 11 TO 20 TABLES
WE LOVE READING SUMMER ACTIVITIES 2024 :: TODAY MORAL STORY : ఇద్దరు.. ఇద్దరిలో ఒక్కరు
ఇద్దరు.. ఇద్దరిలో ఒక్కరు
జమీందారు భూషయ్య ఇంట్లో దుస్తులు ఉతికి, ఇస్త్రీ చేసే సోమయ్య వృద్ధుడైపోయాడు. దీంతో ఆ ఇంట్లో పని మానుకున్నాడు. సోమయ్య చాలా మంచివాడు, నిజాయతీ పరుడు. పరుల ధనాన్ని, విలువైన వస్తువుల్ని ఏమాత్రం ఆశించని వ్యక్తి. అలాంటి మంచి మనిషి, వయోభారంతో తన వృత్తిని వదులుకోవడం భూషయ్యకు కాస్త బాధనిపించినా, అతడు చేసేదేం లేక మిన్నకుండిపోయాడు. అలాంటి మంచి వ్యక్తి స్థానంలో, మరో మంచి మనిషిని నియమించాలనుకున్నాడు భూషయ్య. ఈ విషయం తెలిసి ఆ ఊళ్లో కొంతమంది, ఆ పనిని తమకు ఇప్పించాల్సిందిగా భూషయ్య దగ్గరకు వచ్చారు. కొన్ని పరీక్షల తర్వాత, చివరిగా ఇద్దరు వ్యక్తులు మిగిలారు. కానీ తనకు కావాల్సింది ఒక్కరు మాత్రమే!
ఆ ఇద్దరిలో ఒకరు రాజయ్య. ఆ ఊళ్లోనే రాజయ్యకు మంచి వ్యక్తి అనే పేరుంది. అలాగే పనిమంతుడు కూడా. ఎలాంటి దుస్తులనైనా చక్కగా ఉతికి ఆరబెట్టి, ఇస్త్రీ చేయడంలో చక్కని నైపుణ్యం కలిగిన వ్యక్తి అని ఆ ఊళ్లో చెప్పుకుంటారు. అందరూ ఎంతో ఇష్టపడే వ్యక్తి రాజయ్య. మరో వ్యక్తి నాగయ్య. అతడు కూడా అంతటి పనిమంతుడే. కానీ భూషయ్యతో సహా ఆ ఊళ్లో ఎవరికీ, అతని గురించి ఎక్కువగా తెలియదు. ఎందుకంటే అతడు ఆ ఊరికి ఈ మధ్యే కొత్తగా వచ్చాడు.
సరే, ఇద్దరిలో ఒక్కరిని మాత్రమే తను తీసుకోవాలి కనుక, ఆ ఇద్దరికీ తన దుస్తులు చెరొక జత ఇచ్చాడు. వాటిని ఉతికి, ఆరబెట్టి చక్కగా ఇస్త్రీ చేసి తెమ్మన్నాడు భూషయ్య. ఎవరైతే ఈ పనిని తన మనసుకు నచ్చే విధంగా సకాలంలో చేసి తీసుకొస్తారో, వారే తనింట్లో ఆ పనికి అర్హత సాధిస్తారన్నాడు. ఆ వ్యక్తికి చక్కని వసతి, మంచి జీతం, మూడుపూటలా తిండి లభించే కొలువు దక్కుతుందని చెప్పాడు.
ఇద్దరూ, ‘అలాగే దొరా.. మా పనితనం చూసి మీరు కొలువు ఇప్పించండి’ అని చెప్పి ఆ దుస్తులు పట్టుకొని తమ ఇళ్లకు వెళ్లిపోయారు. రెండు రోజుల్లోనే తాము అందంగా ఉతికి, సిద్ధం చేసిన భూషయ్య గారి దుస్తులు పట్టుకొని ఇద్దరూ ఆయన ఇంటికి వెళ్లారు. అప్పుడు ఆయన ఆ ఊరి తగాదా ఏదో తీర్చే పనిలో ఉన్నాడు. ఇద్దర్నీ కొంత సమయం ఆగమని చెప్పాడు. ఇద్దరూ ఒక పక్కగా నిల్చున్నారు. కాసేపటికి పంచాయితీ ముగిసిపోయింది. భూషయ్య ఇద్దరూ తెచ్చిన తన కండువాలు, పైజామాలు, లాల్చీలు చూశాడు. ఇద్దరూ పోటీ పడి మరీ, శుభ్రంగా వాటిని ఉతికి, చక్కగా ఆరబెట్టి, ఇస్త్రీ చేసి ధగధగా మెరిసేటట్టు చేసి తీసుకొచ్చారు.
భూషయ్య ఆశ్చర్యపోయాడు. శభాష్ అని ఇద్దర్నీ మెచ్చుకున్నాడు. ‘మీ ఇద్దరిలో అత్యద్భుతమైన ప్రతిభ దాగి ఉంది. ఇద్దరూ పనితనంలో ఒకరికొకరు ఏ మాత్రం తీసిపోరు. కానీ నాకు కావాల్సింది ఒక్క వ్యక్తి మాత్రమే! అది ఎవరనేది నేను ఇప్పుడు చెప్పబోతున్నాను..’ అని ఒక్క క్షణం ఆగాడు. జనం కూడా… ‘భూషయ్యగారు ఎవర్ని ఎంపిక చేస్తారా?’ అని ఆసక్తిగా చూస్తున్నారు. అందరి మదిలో మెదిలే వ్యక్తి ఒక్కడే. అది రాజయ్య. వ్యక్తిగతంగా మంచివాడు. అందరి తల్లో నాలుకలా ఉండేవాడు. భూషయ్యగారింట్లో కొలువుకు సరి తూగేవాడు అని.. అందరూ అనుకుంటున్నారు.
ఇంతలో భూషయ్య తన ఎంపిక పూర్తి చేశాడు. ఆయన ఎంచుకున్నది నాగయ్యను. జనమంతా ఆశ్చర్యపోయారు. ఇలా ఎందుకు చేశారు? ఏదైనా కారణముందా..? అన్నట్లు భూషయ్య వంక చూశారు. ‘ఈ ఇద్దరూ తమ వృత్తిలో చక్కని నైపుణ్యం చూపించినవారే. ఎవర్నీ తక్కువ చేసి చూడకూడదు. ఇద్దరూ నైపుణ్యం ఉన్నవారే. కానీ ఇదొక్కటే సరిపోదు. నిజాయతీ కూడా చాలా ముఖ్యం. తమ కళ్లముందు ఎంత ధనమున్నా, ఎలాంటి విలువైన వస్తువులున్నా ఆశ, ప్రలోభానికి లొంగని వారై ఉండాలి. అలాంటి గుణాలున్న వ్యక్తి నాకు కావాలి. నేను ఇద్దరికీ ఉతికి తెమ్మని ఇచ్చిన నా దుస్తుల్లో, ఒక్కొక్క బంగారు నాణెం పెట్టి ఇచ్చాను. వాటిల్లో ఒకటి నిన్న సాయంత్రమే తనకు నా దుస్తుల్లో దొరికిందని.. నాగయ్య, నిజాయతీగా తెచ్చి ఇచ్చాడు. కానీ ఇప్పటి వరకు నా రెండో నాణెం నాకు అందలేదు’ అంటూ రాజయ్యకేసి చూశాడు భూషయ్య. రాజయ్య తప్పు చేసి, దొరికిన వాడిలా నేల చూపులు చూస్తుండిపోయాడు. జమీందారి ఆలోచన ప్రకారం భూషయ్యనే సరైన ఎంపికని అందరూ హర్షించారు. తనను మన్నించమని రాజయ్య తర్వాత ప్రాధేయపడ్డాడు.
WE LOVE READING SUMMER ACTIVITIES 2024- TODAY ENGLISH MORAL STORY : The fox and the drum
Shika the fox lived in a large forest. Other animals stayed with their families or in herds. But Shika loved staying alone. She was not afraid of anything. Well actually she was afraid of a great many things. The forest, after all, was very big. Every other week Shika would stumble across a stream, a lake, a hill, a clearing that she had never seen before. Today, too, she was off exploring a new part of the forest.
“Dooom!” a loud sound echoed somewhere.
The furs on Shika’s neck stood up sensing danger. It was unlike any other sound she had ever heard in the forest — roars of a lion, the bellowing of bears, the cries of the cheetals and droning of crickets. But this? Never. She almost thought she had imagined the sound and was about to walk on when.
“Dooooom!” it was louder than even before.
Shika wanted to run away. But she was also very hungry. It had been two days since she had found anything to eat. And this animal might lead her to some food.
She hid behind a bush and carefully she listened again. “Doooom!” came the sound. This time Shika sensed that it was coming from the right. Crouching low she followed the sound. Every time the sound was heard, Shika would grow closer. The fear was making her stomach squirm.
There at last she saw the animal making the sound. It was a large, cylindrical and resting against a tree. It had no legs. Shika would have assumed that this was no animal, but an object. But when the branches of the tree swayed and hit the object it let out a loud sound, “Dooooom!!!”
Shika was convinced that this was an incredible animal. Cautiously she approached it. The animal did not make a move. After a few steps Shika grew confident. She licked her lips. “This animal can’t move, and look at how loud a sound it makes. It must full of food!” she thought.
She stood right in front of the huge animal and then lunged at it. The fight lasted briefly. Shika clawed at the skin until she made a hole. The animal had stopped making the sound and Shika assumed it was dead. She looked inside the hole she had made. There was nothing! The animal was hollow. There was no food to eat.
But still it was a victory for Shika. She had defeated such a might enemy. “Ha!” she shouted at the corpse of the strange animal.
A parrot was watching all this from a tree and let out a loud laugh. Shika suddenly stopped and looked up, “Why are you laughing Master Parrot?”
“That animal you killed is called a drum! Humans beat it to make loud noises. You may not know, but many years ago, a great battle had been fought on this spot. The soldiers left that behind. And you thought you had killed it and were searching for food,” said the parrot.
Shika looked at the parrot and then at the torn up drum. She too started laughing loudly. The parrot was confused, “Why are you laughing young fox?”
“Well, I learnt a valuable lesson. Not everything that makes a loud sound is filled up with stuff! I am going to be less afraid of the forest from now on.” Saying that Shika the fox turned and left in search of food.