what-is-lockdown-till-march-31st-dos-donts-for-the-public

what-is-lockdown-till-march-31st-dos-donts-for-the-public

లాక్ డౌన్ అంటే ఏంటి? ప్రజలు చేయదగినవి.. చేయకూడని పనులివే…

కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ఏపీ, తెలంగాణతో పాటు చాలా రాష్ట్రాలు లాక్ డౌన్ ప్రకటించాయి.

ఈ క్రమంలో లాక్ డౌన్ అంటే ఏంటి? ఆ సమయంలో ప్రజలు ఏం చేయాలి, ఏం చేయకూడదో తెలుసుకుందాం.

రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో లాక్ డౌన్ ప్రకటించాయి.

కరోనా వైరస్‌‌ను కట్టడి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు సంచలన నిర్ణయం తీసుకున్నాయి.

ఈ క్రమంలో అసలు లాక్ డౌన్ అంటే ఏంటి? ప్రజలు ఏం చేయొచ్చు?

ఏం చేయకూడదని అనుమానం చాలా మందిలో కలుగుతోంది. అలాగే, లాక్ డౌన్ సమయంలో అన్నీ మూసేస్తే బతికేదెలా అనే సహజసిద్ధమైన సందేహాలు కూడా ఉంటాయి.

ఈ క్రమంలో అసలు లాక్ డౌన్ అంటే ఏంటి? ఆ సమయంలో ప్రజలు ఏం చేయొచ్చు?

ఏం చేయకూడదనే అంశాలు తెలుసుకుందాం.

1897 నాటి చట్టాన్ని అమల్లోకి తెస్తూ తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ ప్రకటించారు సీఎం కేసీఆర్. అంటే, మొదటగా అంతర్రాష్ట్ర సరిహద్దులు మూసేస్తారు.

ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలను సరిహద్దులకు అవతలే నిలిపివేస్తారు.

కేవలం అత్యవసరం అయినవి మాత్రమే (పాలు, నీళ్లు, కూరగాయలు, మందులు, వైద్య సేవలు.. వగైరా) అనుమతి ఉంటుంది.

ఇప్పటికే దేశవ్యాప్తంగా అన్ని ప్రయాణికుల రైళ్లను రైల్వే శాఖ మార్చి 31 వరకు రద్దు చేసింది.

లాక్ డౌన్ సమయంలో ప్రజలు ఈ పనులు చేయకూడదు

  • ప్రజలు గుంపులు గుంపులుగా తిరగకూడదు.

  • ఎలాంటి ఫంక్షన్లు నిర్వహించకూడదు.

  • ప్రయాణాలు, కుటుంబంతో విహార యాత్రలు నిషేధం

  • బహిరంగ ప్రదేశాల్లో ఐదుగురికి మించి గుంపుగా ఉండకూడదు

  • ఇటీవల విదేశాల నుంచి వచ్చిన వారు అస్సలు బయటకు రాకూడదు

  • ప్రజా రవాణా వాహనాలు (బస్సులు, క్యాబ్‌లు, ఆటోలు మొత్తం బంద్ చేయాలి)

  • వ్యాపార సముదాయాలు, షాపింగ్ మాల్స్, ధియేటర్లు, జిమ్‌లు, ఫంక్షన్ హాళ్లు మూసేయాలి

  • వృద్ధులు, చిన్న పిల్లలను ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు పంపకూడదు.

  • గుళ్లు, మసీదులు, చర్చిలు అన్నీ మూసేయాలని ఆదేశాలు ఉన్నాయి.

  • పెద్దవారి ఇంట్లో పనులు చేసే వారు గడప దాటడం కూడా కష్టమే. వారు ఇళ్ల బయటకు వస్తే పోలీసులు ప్రశ్నిస్తారు.

లాక్ డౌన్ సమయంలో ప్రజలు ఈ పనులు చేయవచ్చు

  • తప్పనిసరి అయితేనే ప్రజలు బయటకు రావాలి

  • అత్యవసరం (మందులు, కూరగాయలు, నిత్యావసర సరుకులు, వగైరా) అయిన వాటి కోసం బయటకు వెళ్లవచ్చు. తెలంగాణలో ఇంటికి ఒక్కరు మాత్రమే బయటకు రావాలని ప్రభుత్వం సూచించింది.

  • అత్యవసర సేవల్లో ఉండే ఉద్యోగులు బయటకు వెళ్లవచ్చు. (విద్యుత్, వైద్యం, మీడియా, టెలికం శాఖ, వగైరా)

  • తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వచ్చినా ఇతరులకు కనీసం రెండు మీటర్ల దూరం ఉండాలి

  • ఇంటికి వెళ్లిన తర్వాత దుస్తులను వెంటనే ఉతికివేయాలి. ఎండలో ఆరబెట్టాలి.

  • బయటకు వెళ్లి వచ్చిన తర్వాత తప్పనిసరిగా చేతులు శుభ్రం చేసుకోవాలి. వీలైనంత వరకు స్నానం చేసేయాలి.

  • బయట నుంచి తీసుకొచ్చిన సరుకుల మీద కూడా శానిటైజేషన్ చేయాలి.

  • పెట్రోల్ బంకులు తెరిచే ఉంటాయి. కావాలంటే వెళ్లి రావొచ్చు.

  • అంతర్జాతీయ విమానాలు ఇప్పటికే రద్దయ్యాయి. డొమెస్టిక్ ఫ్లైట్స్‌ తిరుగుతాయి. మీకు టికెట్ ఉంటే బయటకు రావొచ్చు.

  • ఈ కామర్స్ సైట్స్ ద్వారా మీకు కావలసినవి ఆర్డర్ చేసుకోవచ్చు.

  • ఏటీఎంకు వెళ్లి డబ్బులు విత్ డ్రా చేసుకోవచ్చు.

  • మీ ఇంట్లో కుక్క ఉంటే, మీరు కావాలనుకుంటే దాన్ని తీసుకుని బయటకు వెళ్లవచ్చు. అయితే, గుంపులుగా కాదు.

ఇంట్లోనే ఈజీగా శానిటైజర్‌ని తయారు చేయండిలా..

దక్షిణ కొరియా: 7 నిమిషాల్లోనే కరోనా పరీక్ష.. నో లాక్‌డౌన్, టెక్నాలజీతో కోవిడ్‌ను గెలిచిందిలా!

error: Content is protected !!